లెడ్ పాయిజనింగ్ అంటే ఏమిటి?
లెడ్ పాయిజనింగ్ అనేది లెడ్ కడుపులోకి వెళ్లడం వలన సంభవిస్తుంది, లెడ్ సహజంగా మన వాతావరణంలో ఉంటుంది. అభివృద్ది చెందిన దేశాలలో లెడ్ యొక్క బహిరంగ ఉపయోగాన్ని/వాడకాన్ని నివారించడానికి ఖచ్చితమైన నియమాలను ఉన్నపటికీ, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది ఇప్పటికీ నిర్లక్ష్యంగా ఉపయోగించబడుతోంది.పెద్దవారి కంటే పిల్లలుఅధికంగా లెడ్ కి బహిర్గతం అవుతున్నారు, పిల్లల బొమ్మల కోసం ఉపయోగించిన రంగులలో ఇది ఎక్కువగా ఉండడం ఒక కారణం. గణాంకాల ప్రకారం, అన్ని విషపూరిత (టాక్సిక్) రసాయన పాయిజనింగ్ కేసులలో దాదాపుగా 0.6% కేసులు లెడ్ పాయిజనింగ్ కు సంబంధించినవిగా ఉంటున్నాయి.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
పదేపదే లెడ్ కు బహిర్గతం కావడం వలన శరీరంలో కొంచెం పరిమాణంలో లెడ్ చేరుతుంది. దాని ఘాడత (concentration) రక్తంలో ఎక్కువగా ఉన్నప్పుడు, అది దీర్ఘకాలిక రోగ లక్షణాలు, కోమా మరియు ప్రాణాంతక చర్యలకు కారణమవుతుంది. పిల్లలు ఎక్కువగా ప్రభావితం అవుతారు కాబట్టి, అది వారి మెదడు మరియు నాడీ వ్యవస్థ అభివృద్ధికి హాని కలిగించవచ్చు. లెడ్ పాయిజనింగ్ యొక్క ఆరోగ్య (వైద్య) మార్పులు:
- రక్తపోటు పెరగడం
- కడుపు నొప్పి
- జ్ఞాపక శక్తిలో ఆటంకాలు
- మగవారిలో సంతాన (పునరుత్పత్తి) సమస్యలు
- గర్భస్రావాలు
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
దీని ప్రధాన పర్యావరణ కారణాలు వీటిని కలిగి ఉంటాయి:
- రోడ్ పక్కల దుమ్ము, నిర్మాణాలలో ఉపయోగించే సిమెంట్
- లీడ్ తయారు చేయబడిన పాత నీటి గొట్టాలు
- లెడ్ మెరుగులతో ఉండే ఆహార పాత్రలు (containers)
- పెన్సిల్, సిరా/ఇంక్ మరియు బొమ్మలు, ఆభరణాలు ఇతర వస్తువులు వంటి స్టేషనరీ సామానులు
- కొన్ని రకాల ఆయుర్వేద నివారణలు
పెద్దలలో, వృత్తిపరమైన ప్రమాదాలు మరియు వాహన పొగలు లెడ్ పాయిజనింగ్ ను కలిగిస్తాయి.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
పూర్తి భౌతిక పరీక్ష మరియు చరిత్రను గురించి తెలుసుకోవడం అనేవి ఈ పరిస్థితి నిర్దారణకు ముఖ్యమైనవి. రక్తంలో లెడ్ గాఢతని (lead concentration) కొలవడం ద్వారా ఇది గుర్తించబడుతుంది. ఇది ప్రధానంగా లెడ్ పాయిజనింగ్ యొక్క తీవ్రతను గుర్తిస్తుంది, ప్రధానంగా పిల్లలలో నిర్వహించబడుతుంది. పెద్దలలో, దీర్ఘకాలిక ఎక్స్పోజర్ను (బహిర్గతాన్ని) జింక్ ప్రొటోపార్ఫిరిన్ (ZPP, zinc protoporphyrin) పరీక్ష ద్వారా కొలవవచ్చు.
ఈ చికిత్సలో, మొదట లెడ్ ఎక్స్పోజర్ను (బహిర్గతాన్ని) నివారించడం ఉంటుంది. ఇంటిలో నుండి పూర్తిగా లెడ్ ను తొలగించాలి మరియు ఇది ఒక అనుభవజ్ఞుడైన వ్యక్తిచే చేయబడాలి. పిల్లలకు శరీరం నుండి లెడ్ ను తొలగించటానికి ఒక కలేటింగ్ ఏజెంట్ (chelating agent) సూచించవచ్చు.
కొన్ని స్వీయ సంరక్షణ చిట్కాలు:
- పాత పైపులు లేదా ఇతర ప్లంబింగ్ పదార్థాలు తొలగించాలి అవి లీడ్ కలిగి ఉండవచ్చు.
- ఇంటిని క్రమంగా శుభ్రపరచుకోవాలి
- సాధారణ సమతుల్య ఆహారం తీసుకోవాలి
- బిజీగా ఉన్న ప్రాంతాల్లో తిరగడం లేదా ఆడడం వంటివి చేయకూడదు
లీడ్ చాలా విషపూరితమైన పదార్థం మరియు దానిని నిర్లక్ష్యం చేయరాదు. మరణం వంటి తీవ్ర పరిమాణాలను నివారించడానికి శరీరం నుండి లెడ్ ను తొలగించడం అవసరం.