సారాంశం
తెల్లబట్ట మహిళల్లో కనిపించే సాధారణ మరియు మాములు స్థితి. ఇది ఒక పారదర్శక ద్రవం యొక్క స్రావం లేదా శ్లేష్మం, ఇది యోనిని తేమగా మరియు సరళతగా ఉంచి, యోని సంక్రమణలను నివారిస్తుంది.. ఒక మహిళ యొక్క వయోజన జీవితంలో యుక్తవయస్సు నుండి రుతువిరతి వరకు కలిగే హార్మోన్ల స్థాయిలో మార్పుల మూలంగా తెల్లబట్ట ఏర్పడుతుంది. దురదలేని తెల్లటి స్రావం మరియు తడిగా ఉండటం వంటివి తెల్లబట్ట యొక్క లక్షణాలు, ఇది హానిరహితమైనది మరియు ఎటువంటి సంక్లిష్టత లేకుండా పరిష్కరించవచ్చు. తెల్లబట్టకు గల ఇతర కారణాల్లో లైంగికేతర మరియు లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు కూడా ఉన్నాయి. ఈ సందర్భాలలో, దురద, ఎరుపుదనం, చెడు వాసన, అసౌకర్యం లేదా నొప్పి వంటి లక్షణాలు కూడా ఎదుర్కోవచ్చును. అటువంటి సంక్రమణలు సోకకుండా నివారించడానికి లేదా సంక్లిష్టతలను నివారించడానికి మందులు అలాగే ఇతర జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది అధికంగా లేదా అసాధారణంగా ఉంటే తప్ప, తెల్లబట్టకు చికిత్స అవసరం లేదు.