ఆకలి లేకపోవడం అంటే ఏమిటి?
ఆకలిని లేకపోవడం (ఆహరం) తినాలన్న కోరిక తగ్గిపోవడం. ఆకలి లేని వారికి, వారి చివరి భోజనం తర్వాత చాలా గంటల వరకు కూడా ఆకలి వేయకపోవచ్చు, ఆహారం గుర్తుకు వచ్చినా లేదా ఆహారాన్ని చూసినా వారికీ చిరాకు వచ్చేస్తుంది మరియు నీరసం కూడా రావచ్చు. అనేక పరిస్థితులు - భౌతికమైనవి మరియు మానసికమైనవి రెండూకూడా ఆకలి నస్టానికి కారణం కావచ్చు. ఇది చాలా కాలం పాటు కొనసాగితే, అనోరెక్సియా ( anorexia) అని పిలువబడే ఒక పరిస్థితిని సూచిస్తుంది.
దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఆకలి లేమి యొక్క సంకేతాలు స్పష్టంగా తెలుస్తాయి. ఆహారం అంటేనే తీవ్ర విరక్తి ఏర్పడుతుంది మరియు తిండి గురించి ఆలోచించినా లేదా తిండిని చూసినా వికారం కలుగుతుంది, ఆకలి అసలు లేకపోవడం మరియు బరువు తగ్గుదల ఉంటాయి. కొందరు వ్యక్తులు ఆకలి లేనప్పుడు తినడానికి ప్రయత్నస్తే తిన్న తర్వాత వాంతి చేసుకుంటారు. ఆకలి లేకపోవడం అనేది దీర్ఘకాలం కొనసాగితే, వ్యక్తికి కళ్ళు తిరగడం మరియు అలసటగా అనిపించడం, గందరగోళంగా ఉండడం, ఛాతీ నొక్కిపెట్టినట్లు ఉండడం, శ్వాస అస్తవ్యస్తంగా మారడం లేదా ఉష్ణోగ్రత మార్పులకు అసహనం(తట్టుకోలేకపోవడం) వంటివి సంభవిస్తాయి.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
వివిధ ఆరోగ్య సమస్యలు ఆకలి నష్టానికి కారణమవుతాయి. ఇది తీవ్రమైన తలనొప్పి వంటి చిన్న సమస్య కావచ్చు, లేదా క్యాన్సర్ వంటి తీవ్ర అనారోగ్యం కావచ్చు. తీవ్రమైన మరియు దీర్ఘకాల వ్యాధులు రెండూ రకాలు ఆకలిని కోల్పోయేలా చేస్తాయి. అనారోగ్యం కారణంగా నొప్పి లేదా గాయం కూడా ఆకలిలేమికి దారితీస్తాయి. ఆకలి లేమికి కారణం అయ్యే కొన్ని కారణాలు:
- మైగ్రెయిన్ (పార్శపు తలనొప్పి)
- నరములకు హాని కలుగుట
- శస్త్రచికిత్స తరువాత ఉండే నొప్పి
- అలసట
- గర్భం
- గుండె సమస్యలు
- ఋతుక్రమ సమయానికి ముందు ఉండే సిండ్రోమ్ (లక్షణం)
- జలుబు
- మద్యం మరియు మాదకద్రవ్యాల ఉపసంహరణ వలన
- కొన్ని మందుల యొక్క ఒక దుష్ప్రభావం వలన
- ఆందోళన, నిరాశ మరియు ఒత్తిడి
- అనోరెక్సియా నెర్వోసా (Anorexia nervosa) లేదా బులీమియా (bulimia)
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
లక్షణాలు, ఆరోగ్య చరిత్రను తెలుసుకోవడం మరియు భౌతిక పరీక్షలు ప్రాధమిక నిర్ధారణకు సహాయం చేస్తాయి. ఇవి వైద్యులకు వ్యాధి యొక్క కొన్ని సంభావ్య కారణాలను విశ్లేషించడానికి మరియు ఇతర పరీక్షలను సూచించడానికి సహాయం చేస్తాయి. థైరాయిడ్ సమస్యలు, హెచ్ఐవి (HIV), క్యాన్సర్ మరియు ఇతర వ్యాధుల తనిఖీ కోసం రక్త పరీక్షలు సూచించబడవచ్చు. గుండెకు ఎలెక్ట్రో కార్డియోగ్రామ్ (ECG), కడుపుకు గ్యాస్ట్రిక్ పరీక్షలు మరియు సిటి (CT) స్కాన్ కూడా సూచించవచ్చు.
అంతర్లీన కారణం యొక్క చికిత్స అనేది ప్రధానం. మందులు లేదా థెరపీతో పాటు, అవసరమైతే వైద్యులు నొప్పి నివారణలను కూడా సూచించవచ్చు. జీవనశైలికి మార్పులు, వ్యాయామం, విశ్రాంతి, సరైన ఆహారం తీసుకోవడం మరియు కౌన్సిలింగ్ కూడా సూచించబడవచ్చు. ఆకలి పెంచేవావి (Appetite enhancers) మరియు ఆహార రుచిని మార్చడం వంటివి కూడా ఆకలిని పెంచే కొన్ని పద్ధతులు.