మలేరియా యొక్క లక్షణాలు రెండు విభాగాలుగా విభజించబడినాయి సరళమైన మరియు తీవ్రమైనవి.
సరళమైన మలేరియా యొక్క లక్షణాలు
సరళమైన మలేరియా సాధారణంగా మలేరియా యొక్క అన్ని విలక్షణమైన లక్షణాలను చూపిస్తుంది, అయితే ఈ లక్షణాలు తీవ్రమైన సంక్రమణ యొక్క లక్షణాలు కలిగి ఉండవు మరియు శరీరం యొక్క ముఖ్యమైన అవయవాలకు నష్టం కలిగించదు.
సరళమైన మలేరియా, చికిత్స చేయకుండా వదిలిస్తే, తీవ్రమైన మలేరియాకు దారితీస్తుంది. ఒక వ్యక్తికి చాలా తక్కువ రోగనిరోధక శక్తి ఉంటే కూడా తీవ్రమైన మలేరియా సంభవించవచ్చు. మలేరియా లక్షణాలు 6 నుంచి 10 గంటల వ్యవధి వరకు ఉంటాయి మరియు ప్రతి రెండో రోజుకి వాటంతట అవి పునరావృతమవుతాయి. ఈ లక్షణాలు దీన్ని కలిగించే పరాన్నజీవి యొక్క రకాన్ని బట్టి మారుతూ ఉంటాయి మరియు కొన్ని సార్లు మిశ్రమ లక్షణాలు ఏర్పడతాయి.
సరళమైన మలేరియాలో లక్షణాల పురోగమనం క్రింది విధంగా ఉంది:
- వణుకుతో పాటు జలుబుగా ఉన్నట్టు ఉండటం.
- అధిక జ్వరం, తలనొప్పి, మరియు వాంతులు.
- యువ రోగులకు కొన్నిసార్లు మూర్ఛ రావచ్చు.
- జ్వరం తగ్గిపోవటంతో చెమట పట్టడం మరియు అలసట మరియు నీరసంగా అనిపించడం (మరింత చదువు - అలసట)
తీవ్రమైన మలేరియా యొక్క లక్షణాలు
తీవ్రమైన మలేరియాలో, శరీరంలో ముఖ్యమైన అవయవాలకు హానిని సూచిస్తున్న సంకేతాలు మరియు లక్షణాలు ఉంటాయి.
తీవ్రమైన మలేరియా యొక్క కొన్ని లక్షణాలు:
- జ్వరం మరియు చలి.
- అవగాహన తగ్గిపోవడం మరియు హుషారుతో పాటు స్పృహతో సమస్యలు.
- ప్రమాదకరమైన భంగిమల్లో పాడుకోవాలనిపించడం(బోర్లగా పడుకోవడం).
- లోతైన శ్వాస లేదా శ్వాసలో ఇబ్బందులు.
- అలసిపోయినట్లు అనిపించడం మరియు సాధారణమైన బలహీనత వంటి రక్తహీనత లక్షణాలు.
- కామెర్లు యొక్క చిహ్నాలు, ఉదాహరణకు, కళ్ళు మరియు గోళ్ళ తెల్లని ప్రాంతాల్లో పచ్చగా ఉండటంతో పాటు, పసుపు రంగులో మూత్రం.
చికిత్స చేయకపోతే తీవ్రమైన మలేరియా ప్రాణాన్నే కోల్పోయేలా చేస్తుంది.
మలేరియా యొక్క లక్షణాలు సాధారణ ఫ్లూ యొక్క లక్షణాలు లేదా ఒక వైరల్ వంటివి మరియు వ్యాధికి గురవ్వని వ్యక్తులలో రోగ నిర్ధారణ కష్టంగా ఉంటుంది.