మైగ్రైన్ - Migraine in Telugu

Dr. Nabi Darya Vali (AIIMS)MBBS

March 09, 2017

April 27, 2023

మైగ్రైన్
మైగ్రైన్

సారాంశం

మైగ్రేన్ లేదా పార్శ్వపు తలనొప్పి నరాలకు సంబంధించిన జబ్బు, ఇది వరుసగా వెంట వెంటనే వస్తూ ఒక మోస్తరు నుండి తీవ్రస్థాయిలో  బాధించే తలనొప్పులలో ఒకటి. మైగ్రేన్ హెచ్చుగా బాధించే తలలో ఒకవైపు వచ్చే జబ్బు. మైగ్రేన్ లక్షణాలు గల  బాధితుడు ప్రశాంతంగా ఉన్న చీకటిగదిలో సంపూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని కోరుకొంటాడని పరిశీలనలలో వెల్లడయింది. కొందరిలో మైగ్రేన్ తలనొప్పి కి ముందుగా కానీ లేదా నొప్పి వచ్చినప్పుడు గాని కనిపించే లక్షణాలు జబ్బుమనిషి వెలుగును నిరోధించడం, వికారానికి గురికావడం, చూపు మందగించడం లేదా  మోచేతులలో లేదా కాలులో జలదరింపు, వమనం వంటివి. ఏమయినా మైగ్రేన్ ను పూర్తిగా నివారించడానికి ఔషధాలు లేనప్పటికీ, కొన్ని నిర్ణీత ఔషధాలు, జీవన సరళిలో మార్పులు,  మైగ్రేన్ తీవ్రతను పలుమార్లు రావడాన్ని నిరోధించగలవు.

మైగ్రైన్ అంటే ఏమిటి? - What is Migraine in Telugu

తలనొప్పిలో పెక్కు రకాలు ఉన్నాయి. అన్నీకూడా బాధతొపాటు అసౌకర్యం కలిగిస్తాయి.  పార్శ్వపు తలనొప్పి గుండెజలదరింపును కలిగించవచ్చు. ఈ రకం నొప్పి తలనొప్పులలో హెచ్చుగా బాధ కలిగిస్తుంది. దైనందిన పనులకు హెచ్చుగా ఇబ్బంది, ఆటంకం కలిగిస్తుంది. మైగ్రేన్ తలనొప్పి రోగులపై జరిపిన పరిశీలనలో ఈ జబ్బు పురుషులలో కంటే స్త్రీలలో మూడురెట్లు అధికంగా ఉంటుందని వెల్లడయింది. తీవ్రరూపంలో ఉండే పార్శ్వపు తలనొప్పి కనిపించే విధంగా హెచ్చరిక చిహ్నాలను కల్పిస్తుంది. నిర్దుష్టమైన అంతరంలో వచ్చే పార్శ్వపు తలనొప్పి పై మీ వైద్యుడు జబ్బును గుర్తించి సహకరించగలడు.  మైగ్రేన్ వచ్చే సంఖ్యలను బట్టి  , నొప్పి తీవ్రతను బట్టి దాని రకాన్ని నిర్ధారిస్తారు. కొన్ని మైగ్రేన్లు ఎప్పుడైనా రావచ్చు, సంవత్సరానికి ఒక మారు నుండి వారంలో పెక్కుసార్లు కూడా ఉండవచ్చు.

మీకు తెలుసా ?

  • తరచుగా మైగ్రేన్ తలనొప్పికి గురయ్యే కొందరు వ్యక్తులు వారి తలనొప్పి కారకాలను నిర్ణయించగలరు. అవి అలర్జీ, మానసిక ఒత్తిడి, వెలుగు, కొన్ని నిర్దుష్టమైన ఆహారపదార్థాలుగా గుర్తించబడ్డాయి.
  • పెక్కుమంది మైగ్రేన్ రోగులు  తమకు ఎప్పుడు ఈ నొప్పి రానున్నదనే  అనుభూతి పొందగలరు. తలనొప్పి ప్రబలడానికి ముందుగా కొన్ని లక్షణాలు  వారిని హెచ్చరిస్తాయి. ఉదాహరణకు వమనాలు, వికారాలు, దృష్టిలో లోపం వంటివి.
  • మైగ్రేన్ రోగులలో పెక్కుమంది తలనొప్పి రావడాన్ని ముందుగానే హెచ్చరిక లక్షణాలను కనుగొని దాని నివారణకు చర్య తీసుకొంటారు. వారు వెంటనే మందులు తీసుకొని మైగ్రేన్ ను రాకుండా అడ్దుచేస్తారు.
  • తీవ్రంగా నొప్పిని ఎదుర్కొనేవారు  నివారణ ఔషధాలను తీసికొని జబ్బును నివారించవచ్చు.
Lords L 142 Migraine & Neuralgia Drops
₹153  ₹180  15% OFF
BUY NOW

మైగ్రైన్ యొక్క లక్షణాలు - Symptoms of Migraine in Telugu

పార్శ్వతలనొప్పి బాల్యంలో, యుక్తవయసులో, లేదా యౌవన తొలిదశలో రావచ్చు. మైగ్రేన్ తలనొప్పి బాధితుడు కొన్ని లేదా అన్నిరకాల లక్షణాలను తెలుసుకొంటాడు. కొని సాధారణ లక్షణాలు క్రింద పేర్కొనబడినాయి.

మైగ్రేన్ సాధారణ లక్షణాలు

  • ఒక మోస్తరు నుండి తీవ్రస్థాయి వరకు నొప్పి, సామాన్యంగా ఒకవైపు తలనొప్పి, కొన్ని సందర్భాలలో తల రెండువైపులా నొప్పి రావడం.
  • స్థిరప్రవాహ లేదా తలపోటు రకం నొప్పి
  • నొప్పిస్థాయి  అధికం కావడం
  • దైనందిన పనులకు నొప్పి అడ్డురావడం
  • వమనాలతొపాటు, వమనాలు లేకుండా వికారాలు
  • వెలుగు మరియు శబ్దానికి సున్నితత్వం

సామాన్య్ మైగ్రేన్ లక్షణాలు

  • తలపోటుకు దారితీసే ఒకవైపు (ఒంటితలనిప్పి అని కూడా పిలుస్తారు) తలనొప్పి
  • వెలుగు , శబ్దం, వాసన సరిపడకపోవడం,
  • హెచ్చుగా అలసట అనుభూతి
  • తలపోటు మరియు వమనాలు
  • చిరాకు మరియు మనసిక స్థితిలో మార్పులు
  • పనులపై దృష్టి కేంద్రీకరణకు అశక్తత
  • కదలికలతో పరిస్థితి మరింద అధ్వాన్నం కావడం

మూర్చకు ముందుగా హెచ్చరించే మైగ్రేన్ లక్షణాలు

  • వెలుగుకు ఇబ్బంది మరియు చూపులో మాంద్యం
  • స్పర్శరాహిత్యం లేదా జలదరింపు అనుభూతి
  • మాటలలో స్పష్టత లేకపోవడం లేదా తికమక పడటం
  • విచిత్రమైన వాసనను పసికట్టడం లేదా వెవులలో గంటానాదం వినబడటం
  • తలపోటు లేదా ఆకలి కలగకపోవడం
  • కొన్ని విచిత్రమైన సందర్భాలలో పూర్తిగా లెక పాక్షికంగా కనుచూపు కొల్పోవడం

దీర్ఘకాలిక మైగ్రేన్ లక్షణాలు

  • రోజు పూర్తిగా భరింపశక్యం కానట్టి తలనొప్పి
  • కొనసాగుతున్న తలపోటు మరియు వమనాలు
  • చూపు లోపం మరియు ఆకలి

కుటుంబపరమైన  అర్ధాంగ మైగ్రేన్

  • శరీరంలో ఒకవైపు పక్షవాతం
  • ఉన్నదున్నట్లుగా తల తిరగడం (వెర్టిగో)
  • కుచ్చుతున్ని లెదా పొడుస్తున్నట్టి అనుభూతి
  • చూపు మాంద్యం మాటలలో భిన్నత్వం
  • పార్శ్వవాయువు వలె లక్షణాలు ( నొప్పి, వమనం, స్పృహకోల్పోవడం)

ప్రాథమిక ధమని మైగ్రేన్ లక్షణాలు

  • ఉన్నపళంగా  నొప్పి రావడం లేదా గొంతునొప్పి
  • పూర్తిగా లేదా పాక్షికంగా చూపులోపం
  • వికారం లేదా వమనం
  • తలతిరుగుడు అదుపుతప్పడం లేదా  స్పృహ కోల్పోవడం
  • మాటలలో తడబాటు
  • తగ్గిన కండరాల సమన్వయం
Krishnas Herbal & Ayurveda Migraine Care Juice 500ml
₹300  ₹300  0% OFF
BUY NOW

మైగ్రైన్ యొక్క చికిత్స - Treatment of Migraine in Telugu

మీకు ఎప్పుడైనా మైగ్రేన్ అనుభవం ఉన్నట్లయితే అది రాకమునుపే దానిని ఎందుకు అదుపు చేయాలని మీకు అవగతమవుతుంది.  దాని లక్షణాలు మీకు తెలుసు కాబట్టి అవి ప్రబలక ముందే నొప్పిని అదుపు వేయాలి. ఈ కారణంగ మైగ్రేన్ కు చికిత్స సాధారణంగా రెండు రకాలుగా ఉంటుంది.

  • నిరోధక ( తలనొప్పులను అవి ప్రారంభం కాక మునుపే వాటిని నిలపడం) మరియు
  • తీవ్రమైన/ నిష్పలమైన (తలనొప్పులు రావడానికి మునుపే వాటిని ఆపడం)

నిరోధక చికిత్స

  • జీవన సరళిలో మార్పులు
  • ఔషధాలు సేవించడం
  • ఇతర ఔషధేతర  చికిత్స ( మందులతో అవసరంలేని ప్రక్రియ -  శారీరక థెరపీ, మర్దనం, ఆక్యుపంచర్ లెదా చిరోప్రాక్టరును చూడటం వంటివి)
  • పోషకాహారల సహాయకాలు ( మెగ్నెషియం, కాక్ 10 లేదా విటమిన్ బి2 లేదా బి 12)

తీవ్రతకు మరియు నిష్పల చర్యకు చికిత్స

ఓవర్ ది కౌంటర్  ఔషధాలు :  వాటిలో కొన్ని మౌలికంగా నొప్పి నివారణ మందులు ( ఆస్పిరిన్, ఇబుప్రోఫెన్, నాప్రొక్సెన్ మరియు అసెటమినోఫెన్ వంటివి)  మరియు మిగతావి సమ్మిళనాలు ( ఎక్సిడ్రిన్ మైగ్రేన్, ఉదా: ఇది  అసెటమినోఫెన్, ఆస్పిరిన్ మరియు కఫిన్ కలిసినట్టిది  మరియు అల్కా సెల్ట్జర్ ఆస్పిరిన్ మరియు రెండు ఆంటాసిడ్స్ కలిసినవి)

  • సిఫారసు చేయబడిన మందులు
  • వేరుపరచడం మరియు నీటిని తీసుకోవడం ( చీకటి, ప్రశాంతత కలిగిన గదిలో ఉండటం, నీరు సేవించడం,  త్యర్వాత నిద్రకు ప్రయత్నించడం)

డాక్టరును ఎప్పుడు సంప్రతించాలి :

  • ఔషధసూచిక (ప్రిస్క్రిప్షన్) లెకుండా కౌంటరుపై విక్రయింపబడే మమ్దుల వల్ల మీకు అవసరమైన మోతాదులో ఫలితం లభింఛనట్లయితే  మరియు జీవన సరళిలో మార్పులు వచ్చినప్పుడు దాక్తరును సంప్రతించాలి.
  • మీరు నెలకు 10 నుండి 15 మార్లు ఓవర్ ది కౌంటర్ మందులను కొన్నప్పటికీ, తలనొప్పి నయం కాని పక్షంలో డాక్టరును సంప్రతించడం అవసరం.


వనరులు

  1. Science Direct (Elsevier) [Internet]; Brazilian Journal of Anesthesiology (English Edition)
  2. ICHD-3 The International Classification of Headache Disorders. [Internet]. International Headache Society. London, United Kingdom. Migraine.
  3. National Health Service [internet]. UK; Retinal migraine
  4. National institute of neurological disorders and stroke [internet]. US Department of Health and Human Services; Migraine Information Page
  5. US Food and Drug Administration (FDA) [internet]; Treating Migraines: More Ways to Fight the Pain

మైగ్రైన్ కొరకు మందులు

Medicines listed below are available for మైగ్రైన్. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.