ప్రయాణంలో వికారం వాంతులు (మోషన్ సిక్నెస్) - Motion Sickness in Telugu

Dr. Rajalakshmi VK (AIIMS)MBBS

January 03, 2019

March 06, 2020

ప్రయాణంలో వికారం వాంతులు
ప్రయాణంలో వికారం వాంతులు

ప్రయాణంలో వికారం వాంతులు (మోషన్ సిక్నెస్) అంటే ఏమిటి?

మోషన్ సిక్నెస్ అనేది ప్రయాణ సమయాలలో ఆకస్మికంగా వికారం మరియు వాంతులు సంభవించే ఒక పరిస్థితి. పిల్లలు, గర్భిణీ స్త్రీలు, మరియు కొన్ని రకాల మందులు తీసుకునే వారు ఈ పరిస్థితికి అధికంగా/ముఖ్యంగా గురవుతారు. చెవులు, కళ్ళు, కండరాలు మరియు జాయింట్ల (కీళ్ళు) నుండి వచ్చిన సంకేతాలను గ్రహించిన నరములు, వాటి  ద్వారా వచ్చిన కదలికలు మెదడు కదలికలతో సరిపోలనప్పుడు, వ్యక్తులు ఈ భావనను అనుభవిస్తారు.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

సాధారణ లక్షణాలు:

తీవ్ర లక్షణాలు

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

చెవులు, కళ్ళు, కండరాల మరియు కీళ్ళ వంటి  అవయవాలకు సంబంధించిన సంకేతాలను మెదడు తప్పుగా గ్రహించినప్పుడు మోషన్ సిక్నెస్ యొక్క లక్షణాలు కనిపిస్తాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఒక విమానంలో ఉన్నట్లయితే, అతను అసాధారణ పరిస్థితిని గమనించలేడు, కానీ అతని శరీరం దానిని గ్రహిస్తుంది/అనుభూతి చెందుతుంది. సంకేతాల యొక్క అసమతుల్యత (mismatch) అసౌకర్యానికి మరియు మోషన్ సిక్నెస్ కు  దారితీస్తుంది.

కారణాలు:

  • శారీరకంగా, దృష్టి పరంగా (visual), నిజముగా (virtual) కదులుతూ ఉండడం వలన . ఉదా పడవ, కారు, విమానం లేదా రైలులో ప్రయాణించడం.
  • నిద్ర లేమి ఈ పరిస్థితి అధికం చేస్తుంది
  • వినోద సవారీలు (Amusement rides) మరియు క్రీడా స్థల (ప్లేగ్రౌండ్) పరికరాలు కూడా మోషన్ సిక్నెస్ను ప్రేరేపిస్తాయి.

దీనిని  ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

నిర్ధారణ ఈ క్రింది దశలను కలిగి ఉంటుంది:

  • మోషన్ సిక్నెస్ చాలా సందర్భాలలో దానికదే తగ్గిపోతుంది.
  • కారణాన్ని గుర్తించడానికి లక్షణాలు అంచనా వేయబడతాయి.
  • ప్రయోగశాల పరీక్షలు అవసరం.
  • హాల్పైక్ మెనోవర్ (Hallpike manoeuvre) వంటి శారీరక పరీక్షల ద్వారా మోషన్ సిక్నెస్ నిర్ధారణను దృవీకరించవచ్చు.

చికిత్స ఈ క్రింది వాటిని కలిగి ఉంటుంది:

  • వికారాన్ని తగ్గించడానికి అల్లం యొక్క సప్లిమెంట్లు సహాయపడతాయి.
  • స్కోపోలమైన్ (scopolamine), డైమెన్హైడ్రేట్ (dimenhydrate) మరియు మిక్లిజైన్ (meclizine) వంటి మందులు మోషన్ సిక్నెస్ యొక్క ఉపశమనానికి సూచించబడతాయి.

తీసుకోవలసిన నివారణ చర్యలు:

  • హోరిజోన్ వైపు లేదా దూరంగా ఉన్న, స్థిరమైన వస్తువు మీదకు రెప్పవేయకుండా చూడాలి. ఇది అంతర్లీన శరీర భాగాల సమతుల్యతను తిరిగి సంతులనం చేయడంలో సహాయపడుతుంది తద్వారా ప్రయాణ సమయ వికారాన్ని తగ్గిస్తుంది.
  • ప్రయాణిస్తున్నప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం లేదా పుస్తకాలు చదవడాన్ని నివారించాలి.
  • ధూమపానం, మద్యం, కెఫీన్, బలమైన వాసనలు ఉన్న పదార్దాలు, ఘాటుగా ఉండే మరియు నూనెలు ఎక్కుగా ఉండే ఆహారాలను నివారించాలి.
  • ప్రయాణించే ముందు తేలికపాటి ఆహారాన్ని తినాలి.
  • సౌకర్యవంతమైన స్థానంలో కూర్చోవాలి, కళ్ళు మూసుకుని  మరియు మెడను పైకి పెట్టి వెనక్కు వాలి విశ్రాంతి తీసుకోవాలి.
  • స్పష్టమైన కారణం లేనప్పుడు  చూయింగ్ గమ్ నమలడం కూడా కారు సిక్నెస్ను (car sickness) తగ్గించడంలో సహాయపడుతుంది.



వనరులు

  1. Lackner JR. Motion sickness: more than nausea and vomiting. Exp Brain Res. 2014 Aug;232(8):2493-510. PMID: 24961738
  2. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Motion Sickness.
  3. National Health Service [Internet]. UK; Motion sickness.
  4. Cleveland Clinic. [Internet]. Cleveland, Ohio. Motion Sickness.
  5. National Institutes of Health; [Internet]. U.S. National Library of Medicine. Motion sickness.

ప్రయాణంలో వికారం వాంతులు (మోషన్ సిక్నెస్) వైద్యులు

Dr. Samadhan Atkale Dr. Samadhan Atkale General Physician
2 Years of Experience
Dr.Vasanth Dr.Vasanth General Physician
2 Years of Experience
Dr. Khushboo Mishra. Dr. Khushboo Mishra. General Physician
7 Years of Experience
Dr. Gowtham Dr. Gowtham General Physician
1 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

ప్రయాణంలో వికారం వాంతులు (మోషన్ సిక్నెస్) కొరకు మందులు

Medicines listed below are available for ప్రయాణంలో వికారం వాంతులు (మోషన్ సిక్నెస్). Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.