గోరులలో ఫంగస్ అంటే ఏమిటి?
గోరులలో ఫంగస్ అనేది చేతి వ్రేళ్ళ గోళ్లపై లేదా కాలివేలి గోళ్ళపై సాధారణంగా కనిపించే ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది గోరు యొక్క అంచు వద్ద ప్రారంభమయ్యి తరువాత మధ్యలోకి వ్యాపిస్తుంది, ఇది గోరు యొక్క రంగులో మార్పునకు లేదా రంగు పోవడానికి దారితీస్తుంది. అయితే గోరు యొక్క ఫంగస్ సంక్రమణ/ఇన్ఫెక్షన్ తీవ్రమైనది కానప్పటికీ, ఇది నయం కావడానికి చాలా సమయం పడుతుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
గోరు యొక్క ఫంగల్ సంక్రమణ/ఇన్ఫెక్షన్ ఈ కింది లక్షణాలును ఏవైనా కలిగించవచ్చు:
- గోరు చుట్టూ నొప్పి
- గోరు చుట్టూ ఉన్న ప్రాంతంలో వాపు
- గోరు ఆకారంలో మార్పు
- గోరు గట్టిపడటం
- గోరు రంగులో మార్పు లేదా పోవడం
- గోర్లు పెళుబారడం
- గోరు కింద వ్యర్థపదార్దాలు చిక్కుకుపోవడం
- గొర్ల అంచులు చిన్న చిన్న ముక్కలు అవుట
- గొర్ల మెరుపులో నష్టం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
చేతి వేళ్ళ అంటురోగాల/ఇన్ఫెక్షన్ల కంటే కాలివేళ్ళ అంటువ్యాధులు అధికంగా సంభవిస్తాయి. ఈ క్రింది పరిస్థితులు గోరులలో ఫంగస్ అంటురోగాల/ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతాయి:
- చిన్నపాటి/తేలికపాటి గోరు లేదా చర్మ గాయాలు
- బలహీనమైన రోగనిరోధకత
- గోర్ల యొక్క వైకల్యం
- గొర్ల రుగ్మతలు
- గోర్లకు గాలి సరఫరాను నిలిపి చేసే మూసివుండేటువంటి పాదరక్షలు/చెప్పులు
- ఎక్కువసేపు చర్మం తేమగా ఉండడం
దీనిని ఎలా నిర్ధారణ మరియు చికిత్స ఏమిటి?
వైద్యులు ఈ క్రింది తనిఖీల ద్వారా గోరులలో ఫంగల్ ఇన్ఫెక్షన్ను నిర్ధారణ చేస్తారు:
- గోరు యొక్క భౌతిక పరీక్ష.
- గోరు చిన్న ముక్కను తీసి, మరియు ఆ కణజాలాన్ని మైక్రోస్కోప్ క్రింద అధ్యయనం చేస్తారు. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ రకాన్ని గుర్తించడానికి సహాయపడుతుంది.
చికిత్స:
ఓవర్ ది కౌంటర్ సమయోచిత క్రిములు మరియు మందులు ఈ పరిస్థితిని నయం చేయలేవు. ఈ క్రింది చికిత్సా పద్ధతులు గోరులలో ఫంగస్ ఇన్ఫెక్షన్ చికిత్సకి ప్రభావవంతమైనవి:
- ఓరల్ (నోటి ద్వారా తీసుకునే) యాంటీ ఫంగల్ మందులు-. చికిత్స యొక్క వ్యవధి చేతివేలి గోళ్ల కంటే కాలివేలి గోళ్ళకు ఎక్కువగా ఉంటుంది.
- ఫంగస్ను చంపడానికి లేజర్ చికిత్సలు ఉపయోగపడతాయి.
- కొన్నిసార్లు, ఈ అంటువ్యాధిని వదిలించుకోవటం కోసం గోరు తొలగింపు మాత్రమే చికిత్సా ఎంపికగా ఉంటుంది.
గోరులో ఫంగల్ సంక్రమణ/ఇన్ఫెక్షన్ చికిత్సకు చాలా సమయం పడుతుంది, అందుచే గోరుల సంక్రమణకు చికిత్స కంటే దానిని నివారించడానికి ఎల్లప్పుడూ మంచిది.
గోరు సంక్రమణ యొక్క నివారణ చర్యలు:
- ఎల్లప్పుడూ గోర్లు మరియు దాని పరిసర చర్మం శుభ్రంగా మరియు పొడిగా ఉంచాలి
- వ్యక్తి తన శరీరంలోని లేదా వేరొకరిలోనైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ను తాకితే వెంటనే పూర్తిగా కడగాలి/శుభ్రం చేసుకోవాలి
- మేనిక్యూర్ మరియు పెడిక్యూర్ చేసే సాధనాలను పంచుకోవడాన్ని నివారించాలి
- గోర్లు మరియు చర్మానికి తగు జాగ్రత్తలు పాటించాలి