ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏమిటి?
ఆస్టియోఆర్థరైటిస్ నెమ్మదిగా వృద్ధి చెందే కీళ్ల వ్యాధి, దీని వలన కీళ్ళు బాధాకరముగా/నొప్పిగా మరియు బిరుసుగా మారతాయి, ఇది ప్రధానంగా మధ్య వయస్కులవారిలో మరియు వృద్ధులలో, కనిపిస్తుంది. మెకానికల్ స్ట్రెస్ (mechanical stress) లేదా జీవరసాయన మార్పుల (biochemical changes) కారణంగా కార్టిలేజ్కు భంగం కలగడం వలన అది బరువును మోసే కీళ్లపై ప్రభావం చూపుతుంది. కొన్నిసార్లు దీనిని ఇతర ఆర్థరైటిస్ రకాల పాటు చూడవచ్చు. ఆస్టియోఆర్థరైటిస్ వలన శరీరంలో ఏ జాయింట్ (ఉమ్మడి) అయినా ప్రభావితమవుతుంది, అయితే, సాధారణంగా చేయి, మోకాలు మరియు తుంటిలో ఉండే చిన్న జాయింట్లు ప్రభావితమవుతాయి.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
లక్షణాలు వస్తూ పోతూ ఉంటాయి, వాటిలో ఇవి ఉంటాయి:
- కీళ్ళ నొప్పి మరియు బిరుసుదనం
- మజిల్ వెస్టింగ్తో (muscle wasting) కుడిన కండరాల బలహీనత
- పరిమితమైన కదలికలతో ప్రభావిత జాయింట్లను కదిలించేటప్పుడు సమస్య
- సాధారణం కంటే పెద్దగా కనిపించే కీళ్ల వాపు మరియు సున్నితత్వం (తాకితేనే నొప్పి పుట్టడం)
- కీళ్ళలో చిటపటమనే ధ్వని లేదా అనుభూతి లేదా మృదువైన, కిరకిరమనే ధ్వని
- రోజువారీ కార్యకలాపాలను చేసుకోవడంలో కష్టం అవుతుంది
- వేళ్లు వంగిపోతాయి
- ప్రభావిత భాగాలలో నొప్పితో కూడిన బొబ్బలు లేదా ద్రవం నిండిన గడ్డలూ కనిపిస్తాయి
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
కీళ్ళలో నెమ్మదైన మరియు తక్కువ స్థాయి స్థిరమైన కీళ్ల నష్టాన్ని శరీరం సాధారణంగా మరమ్మత్తు చేస్తుంది. కానీ ఈ పరిస్థితిలో, ఎముక చివరలలో ఉండే రక్షిత కార్టిలేజ్కు నష్టం మరియు విచ్ఛిన్నం జరుగుతుంది. ప్రభావిత జాయింట్లో చిన్న ఎముక పెరుగుదల (bony growth or bone spur) ఏర్పడుతుంది అది వాచి నొప్పిగా మరియు బాధాకరంగా మారుతుంది. ఆస్టియోఆర్థరైటిస్ యొక్క కారణం తెలియదు, కానీ ఈ క్రింది వాటితో ముడిపడి ఉండవచ్చు:
- ఏదైనా గాయం తర్వాత కూడా ప్రభావిత జాయింట్ యొక్క మితిమీరిన వాడుక
- రుమాటాయిడ్ ఆర్థరైటిస్ లేదా గౌట్ వంటి సమస్యల వలన కీళ్ళు తీవ్రంగా దెబ్బతినడం
- అధిక బరువు లేదా వయసు పెరగడం లేదా ఆస్టియోఆర్థరైటిస్ యొక్క కుటుంబ చరిత్ర కలిగిన వ్యక్తులు
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వైద్యులు ముందుగా లక్షణాల యొక్క పూర్తి చరిత్రను తెలుసుకుంటారు, ప్రభావిత భాగాల మరియు జాయింట్ల యొక్క పూర్తిస్థాయి పరిశీలనతో పాటు ఈ రోగికి వ్యాధి కలిగిన కారణాల లేదా పరిస్థితుల గురించి తనిఖీ చేస్తారు. తర్వాత, వైద్యులు ఈ క్రింది పరీక్షలను సూచించవచ్చు:
- కొన్ని రకాల రక్త పరీక్షలు
- ఫ్రాక్చర్ లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ సంభావ్యతను నిర్మూలించడానికి, ప్రభావిత భాగాల ఎక్స్-రే.
ఆస్టియోఆర్థరైటిస్ యొక్క నిర్వహణ
చికిత్సలో తేలికపాటి లక్షణాలను తగ్గించడానికి ఇవి ఉంటాయి :
- బరువు నిర్వహణ కోసం క్రమమైన వ్యాయామం
- సరైన పరికరాల లేదా తగిన పాదరక్షల వాడకంతో కీళ్ళ మీద పడే ఒత్తిడి యొక్క నిర్వహణ
చికిత్సలో తీవ్ర లక్షణాల యొక్క నిర్వహణకు ఇవి ఉంటాయి:
- నొప్పి నివారణ మందుల ఉపయోగం:
- పారాసెటమాల్ (Paracetamol)
- నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDs): ఇబుప్రోఫెన్ (ibuprofen), నేప్రోక్సెన్ (naproxen), సెలేకోక్సిబ్ (celecoxib), ఎటోరికోక్సిబ్ (etoricoxib), మరియు డైక్లోఫెనాక్ (diclofenac)
- ఓపియాయిడ్స్ (కోడైన్) [Opioids (Codeine)]
- కేప్సైసీన్ క్రీమ్ (Capsaicin cream)
- స్టెరాయిడ్ ఇంజెక్షన్
- ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా (PRP, Platelet-rich plasma) ఇంజెక్షన్
- పోషక పదార్ధాలు
- ఫిజియోథెరపిస్ట్ పర్యవేక్షణలో ఫిజియోథెరపీ ద్వారా సూచించబడిన వ్యాయామ ప్రణాళికను నిర్వహించడం .
- ట్రాన్స్క్యుటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్ (Transcutaneous electrical nerve stimulation [TENS])
- వేడి లేదా చల్లని ప్యాక్ లను ఉపయోగించడం
- తీవ్రమైన సందర్భాల్లో దెబ్బతిన్న జాయింట్లను మరమత్తు చేయడానికి, బలోపేతం చేయడానికి లేదా భర్తీ చేయడానికి శస్త్రచికిత్స విజయవంతంగా పనిచేస్తుంది:
- ఆర్త్రోప్లాస్టీ (Arthroplasty)
- ఆర్త్రోడెసిస్ (Arthrodesis)
- ఓస్టియోటోమీ (Osteotomy)
- ప్రత్యామ్నాయ చికిత్సలో ఇవి ఉంటాయి
- ఆక్యుపంక్చర్
- అరోమాథెరపీ