ఆస్టియోమైలైటిస్ - Osteomyelitis in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

January 04, 2019

March 06, 2020

ఆస్టియోమైలైటిస్
ఆస్టియోమైలైటిస్

ఆస్టియోమైలైటిస్ అంటే ఏమిటి?

ఎముక యొక్క సంక్రమణ/ఇన్ఫెక్షన్, ఆస్టియోమైలైటిస్ సాధారణంగా బ్యాక్టీరియా వలన సంభవిస్తుంది మరియు అది తీవ్రముగా లేదా దీర్ఘకాలికంగా ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్/సంక్రమణ ఎముక యొక్క వాపుకు దారితీస్తుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ఈ పరిస్థితి యొక్క ముఖ్య లక్షణాలు:

  • ఎముకలలో నొప్పి
  • అధిక చెమటలు
  • జ్వరం
  • చలి
  • అసౌకర్యం
  • వాపు
  • వెచ్చగా  అనిపించడం
  • సంక్రమణ ఉన్న ప్రాంతంలో నొప్పి

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

ఎముక ఇన్ఫెక్షన్లకు బ్యాక్టీరియా అత్యంత సాధారణ కారణం; అయితే, ఎముక సంక్రమణలు ఫంగస్ మరియు ఇతర సూక్ష్మజీవుల ద్వారా కూడా సంభవించవచ్చు. ఆస్టియోమైలైటిస్ సంభవించడానికి ఒక బాగా తెలిసిన సాధారణ కారక జాతి స్టెఫైలోకోకస్ (Staphylococcus).

ఆస్టియోమైలైటిస్లో బాక్టీరియా, ఇన్ఫెక్షన్ సోకిన చర్మం లేదా కండరాల ద్వారా సమీప ఎముకకు వ్యాపించవచ్చు.

అయితే, కొన్ని ఆరోగ్య సమస్యల వలన కూడా ఆస్టియోమైలైటిస్ సంభవించే ప్రమాదం ఉంది.

ప్రమాద కారకాలు:

  • మధుమేహం
  • రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం
  • ఇటీవలి జరిగిన గాయం వలన
  • ఇటీవలి జరిగిన ఎముక శస్త్రచికిత్స
  • బలహీనమైన రోగనిరోధక శక్తి

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

ఈ సమస్య నిర్ధారణ కోసం అనేక పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. అవి:

  • ఎముక యొక్క జీవాణుపరీక్ష (బయాప్సీ)
  • సిటి (CT) స్కాన్, డి.ఇ.ఎక్స్.ఏ  (DEXA) వంటి ఎముక స్కాన్లు
  • ఇన్ఫెక్షన్  సోకిన భాగానికి ఎక్స్- రే
  • లక్షణాల యొక్క పరిశీలన
  • సంపూర్ణ రక్త గణన (CBC, Complete blood count )
  • ఎముక యొక్క ఎంఆర్ఐ (MRI)

ఈ పరీక్షలు ఎముక సంక్రమణ యొక్క తీవ్రతను గమనించడానికి కూడా సహాయపడతాయి.

ఆస్టియోమైలైటిస్ యొక్క చికిత్సకు యాంటీబయాటిక్స్ ఉపయోగపడతాయి. సంక్రమణకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగించడానికి ఈ మందులు సహాయపడతాయి. ఈ యాంటీబయాటిక్స్ పని చేయడానికి సుమారు 4-6 వారాలు పడుతుంది మరియు సంక్రమణ పూర్తిగా నయం కావడానికి క్రమం తప్పకుండా వీటిని తీసుకోవాలి.

యాంటీబయాటిక్స్ పని చేయకపోతే మరియు ఎముక నష్టం తీవ్రంగా ఉంటే, మృత ఎముక కణజాలాన్ని తీసివేయడానికి మరియు సంక్రమణ వ్యాప్తిని నివారించడానికి శస్త్రచికిత్స అవసరం కావచ్చు.

మధుమేహం ఉన్న వ్యక్తులకు ఎముక సంక్రమణ అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది మరియు తీవ్రమైన సందర్భాల్లో, ప్రమాదాన్ని నివారించడానికి  సంక్రమణ సోకిన భాగాలకు అంగచ్ఛేదనం (amputation, ప్రభావిత భాగాన్ని శరీరం నుండి తీసివేయడం) అవసరమవుతుంది.



వనరులు

  1. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Osteomyelitis
  2. National Center for Advancing and Translational Sciences. Osteomyelitis. Genetic and Rare Diseases Information Center
  3. National Health Portal [Internet] India; Osteomyelitis
  4. Momodu II, Savaliya V. Osteomyelitis. [Updated 2019 Apr 3]. In: StatPearls [Internet]. Treasure Island (FL): StatPearls Publishing; 2019 Jan-.
  5. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Osteomyelitis
  6. healthdirect Australia. Osteomyelitis. Australian government: Department of Health