పక్షవాతం అంటే ఏమిటి?
పక్షవాతం అంటే శరీరంలో కొన్ని లేదా అన్ని భాగాల కదలికలలో పాక్షిక లేదా పూర్తి నష్టం కలుగడం. ఇది శరీరంలో మెదడు మరియు కండరములు మధ్య సంకేతాల యొక్క అసమతుల్యత ఫలితంగా సంభవిస్తుంది. ఇది పోలియో, నరాల రుగ్మతలు లేదా ఇతర రుగ్మతలు వంటి కారణాల వల్ల కూడా కావచ్చు.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ప్రధాన లక్షణం శరీరంలో కొన్ని లేదా అన్ని భాగాలను కదల్చడంలో అసమర్థత. లక్షణాల ప్రారంభం ఆకస్మికంగా లేదా చాలా నెమ్మదిగా ఉంటుంది. లక్షణాలు అప్పుడప్పుడూ మాత్రమే/కూడా కనిపించవచ్చు. ప్రధానంగా ప్రభావితమయ్యే భాగాలు:
- ముఖ భాగం.
- చేతులు.
- ఒక చెయ్యి లేదా కాలు (మోనోప్లిజియా).
- శరీరం యొక్క ఒక వైపు భాగం (హెమిప్లిజియా).
- రెండు కాళ్ళు (పారాప్లిజియా).
- నాలుగు కళ్ళు,చేతులు (క్వాడ్రిప్లిజియా).
ప్రభావిత భాగాలు గట్టిగా లేదా వాలిపోయినట్టు కనిపిస్తాయి, సంచలనాన్ని/అనుభూతిని కోల్పోతాయి లేదా కొన్నిసార్లు నొప్పిగా కూడా ఉండవచ్చు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
పక్షవాతానికి గల అంతర్లీన కారణాలు చాలా ఉంటాయి మరియు అవి తాత్కాలికమైనవిగా ఉండవచ్చు లేదా జీవితకాలం పాటు ఉండవచ్చు. ప్రధాన కారణాలు వీటిని కలిగి ఉంటాయి:
- శరీరంలో ఒక వైపున ఆకస్మిక బలహీనత (స్ట్రోక్ లేదా తాత్కాలిక ఇస్చెమిక్ దాడి).
- నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత లేదా నిద్రపోయే ముందు కొంచెం సమయం పాటు పక్షవాతం (నిద్ర పక్షవాతం).
- ఒక ప్రమాదం కారణంగా, నరాల నష్టం లేదా మెదడుకు గాయం.
- మెదడులోని గాయాలు కారణంగా ముఖ పక్షవాతం (బెల్స్ పాల్సీ).
పక్షవాతానికి సంబంధించిన కొన్ని సాధారణ కారణాలు:
- మెదడు లేదా వెన్నుముక కు గాయం.
- స్ట్రోక్.
- మల్టిపుల్ స్క్లేరోసిస్.
- పోలియో.
- మస్తిష్క పక్షవాతము (cerebral palsy).
- మెదడు లేదా వెన్నుముక యొక్క కణితి.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
పక్షవాతం ప్రాధమికంగా లక్షణాల ద్వారా నిర్ధారణ చేయబడుతుంది. భౌతిక పరీక్ష ఆధారంగా, వైద్యులు పక్షవాతం యొక్క రకాన్ని కూడా నిర్ధారించవచ్చు. ఎంఆర్ఐ (MRI) మరియు సిటి (CT) స్కాన్ వంటి ఇమేజింగ్ పరీక్షలు, మెదడు మరియు వెన్నెముక యొక్క వివరణాత్మక చిత్రాలను పొందటానికి ఉపయోగించబడతాయి మరియు నరాల ప్రసరణ (nerve conduction) ను విశ్లేషించడానికి కూడా పరీక్షలను నిర్వహించవచ్చు.
నిర్దిష్ట మందులు లేవు. సాధారణంగా పక్షవాతం యొక్క నిర్వహణ అంతర్లీన కారణం మీద ఆధారపడి ఉంటుంది. నాన్-డ్రగ్ (మందులు లేని) పద్ధతులు:
- ఫిజియోథెరపీ: బలాన్ని మరియు కండర ద్రవ్యరాశి (muscular mass)ని పెంచుతుంది
- కదలడానికి ఉపయోగించే సహాయకాలు (Moving aids): చక్రాల కుర్చీలు మరియు బ్రెసెస్ (సహాయకాలు) రోగి సులభంగా కదలడానికి సహాయం చేయగలవు
- వృత్తి చికిత్స (Occupational therapy): రోజువారీ పనులకు సహాయం చేస్తుంది
పక్షవాతం అనేది జీవన నాణ్యతను మరియు వ్యక్తి యొక్క స్వీయ-గౌరవాన్ని తగ్గించే వ్యాధి. అందువల్ల దీనికి సరైన సంరక్షణ మరియు సహకారం అవసరం.