“పార్కిన్సన్స్ వ్యాధి” అంటే ఏమిటి?
“వణుకుడు రోగం” లేక “పార్కిన్సన్స్ వ్యాధి” నాడీ కణాలను (నరాల కణాల్ని) దెబ్బ తీయడం ద్వారా ప్రగతిశీల మెదడు దెబ్బకు దారితీస్తుంది. ‘డోపమైన్’ అని పిలవబడే న్యూరోట్రాన్స్మిటర్ ద్వారా మెదడు అంతటా సంకేతాలు ప్రసరించే బాధ్యత ఈ నాడీ కణాలదే. సాధారణ పరిస్థితులలో, మృదువైన, సమతుల్య కండరాల సమన్వయాన్ని డోపమైన్ సహాయంతో సాధించవచ్చు. ఈ డోపామైన్ అనే ఈ న్యూరోట్రాన్స్మిటర్ లేకపోవడం మూలంగానే “పార్కిన్సన్స్ వ్యాధి” లేక వణుకుడు రోగం మనుషుల్లో సంభవిస్తుంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
పార్కిన్సన్స్ వ్యాధి యొక్క ప్రారంభ మరియు అత్యంత సాధారణ లక్షణాలు శరీరంలోని అవయవాల్లోని ఎదో ఒక భాగంలో, అంటే చేతులు లేదా కాళ్ళు లేదా దవడ లోనైనా, వణుకుడు రావడం. చేయి విశ్రాంతి దశలో ఉన్నప్పుడు ప్రకంపన లేదా వణుకు సాధారణంగా గుర్తించబడుతుంది, సాధారణంగా చూపుడు వేలుకు వ్యతిరేకంగా బొటనవేలు యొక్క కదలికను చూడవచ్చు.
దీని రెండవ లక్షణం సాధారణంగా కండరాల పెడసరం లేదా కండరాలు బిగదీయడం. మనిషి స్వేచ్చా చలనవలయాల్ని కుంటుపరుస్తూ (పరిమితం చేస్తూ) అనియంత్రితమైన కండరాల పెడసరం లేక కండరాలు పట్టేయడమనేది వణుకుడు వ్యాధి లక్షణం. వ్యాధికి గురైన వ్యక్తులు చేపట్టిన ఏధైనా పనియొక్క వేగంలో క్రమమైన తగ్గుదలను చూపుతారు. స్నానం లేదా తినడం వంటి సాధారణ కార్యకలాపాల్ని పూర్తి చేయడంలో కూడా వీళ్ళు అసాధారణంగా ఎక్కువసేపు తీసుకోవాల్సి వస్తుంది.
వ్యాధి యొక్క తరువాతి దశలలో సంభవించే లక్షణాలు ఏవంటే సంతులనంలో నష్టం, నిరాశ, ముఖంలో వెలువడే భావాల్ని ముసుగులో దాచిన వైనం (a masked expression) మరియు ఒక గూని భంగిమ రావడం.
సాపేక్షంగా అరుదుగా ఉండే లక్షణాలలో భయము, చొంగ కార్చడం, చర్మ సమస్యలు, మూత్ర సమస్యలు మరియు లైంగిక అసమర్థత ఉంటాయి. వ్యాధి బాధితుడి వణుకుడు గణనీయంగా సదరు వ్యక్తి మాటల్ని మరియు చేతివ్రాతను దెబ్బ తీస్తుంది.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
వణుకుడు రోగానికి సంభావ్య కారణాలను గుర్తించడానికి పరిశోధన కొనసాగుతున్నప్పటికీ, అదిప్పటికీ తెలియదు. జన్యు కారకాలు మరియు కొన్ని పర్యావరణ పరిస్థితుల్ని వణుకుడు జబ్బుకు ప్రమాద కారకాలుగా భావిస్తారు.
పార్కిన్సన్స్ వ్యాధిని అభివృద్ధి చేయడంలో జన్యుపరివర్తనలు (gene mutations) ప్రమాద కారకంగా గుర్తించబడ్డాయి, అయితే ఖచ్చితమైన గ్రహణశీలత స్పష్టంగా లేదు.
వ్యవసాయంలో ఉపయోగించే పురుగుమందులకు గురికావడమనేది ఈ వ్యాధికి దోహదపడే పర్యావరణ ప్రమాద కారకం. అరుదైన ఇతర కారణాలు కొన్ని ఏవంటే యాంటిసైకోటిక్ ఔషధాలను సేవించే వ్యక్తులు లేదా మెదడు అనారోగ్యంతో బాధపడుతున్నవారిలో లేదా గతంలో స్ట్రోక్ లకు గురై బాధపడుతున్న వ్యక్తులకు వణుకుడురోగం సంభవించవచ్చునని భావించబడుతోంది.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
పరిస్థితిని నిర్ధారించడానికి నిర్దిష్ట రక్తం లేదా ప్రయోగశాల పరిశోధన లేనందున పార్కిన్సన్స్ వ్యాధి నిర్ధారణను గందరగోళంగా చెప్పవచ్చు. అంతేకాకుండా, లక్షణాలు తరచూ కీళ్ళ అసాధారణతలు లేదా విటమిన్ లోపాల వంటి ఇతర రుగ్మతల్ని అనుకరిస్తాయి.
అందువల్ల గతంలో ఉపయోగించిన ఔషధాల చరిత్రతో పాటు విస్తృతమైన వ్యకి వైద్య చరిత్ర సరిగ్గా రాబట్టబడుతుంది. ఒక సిటి(CT) స్కాన్ లేదా ఎంఆర్ఐ (MRI) స్కాన్ మెదడు మీద మొత్తం ప్రభావాలు చూసేందుకు తీసుకోవచ్చు. ఒక అర్హత కలిగిన న్యూరాలజిస్ట్ తో సలహా-సంప్రదింపులు తీసుకోమని సూచించడమైంది, ఈ న్యూరాలజిస్ట్ కొంతకాలం పాటు లక్షణాలను పర్యవేక్షించగలరు మరియు వ్యాధి పురోగతిని ఆపడమే లేక నియంత్రించడమో చేయగలరు.
చికిత్సకు సంబంధించినంత వరకు, ‘డోపమైన్’ లోపపరిస్థితికి వివిధ రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ మందులు వ్యాధికి గురైన మెదడు బాగాలను ప్రేరేపించడం ద్వారా పని చేస్తాయి. అయితే, దీర్ఘకాలికదశలో, ఈ మందులు దుష్ప్రభావాలను చూపుతాయి.
మందులు వ్యాధిలక్షణాలను నియంత్రించలేకుంటే, శస్త్రచికిత్స ఐచ్ఛికాలు పరిగణించబడతాయి. మెదడును ప్రేరేపించటానికి ఎలక్ట్రోడ్లు ఉపయోగించడం ఇందులో జరుగుతుంది, ఇలా చేయడంద్వారా వణుకుడ్ని ప్రేరేపించడానికి దారితీసేప్రేరణల్ని అడ్డుకోవడం జరుగుతుంది.
పార్కిన్సన్స్ వ్యాధి ఒక ప్రగతిశీల రుగ్మత. ఈ రుగ్మతకు ఖచ్చితమైన నివారణ లేదు; అయినప్పటికీ, మానసిక ఆరోగ్యాన్ని మరియు శారీరక చర్యల్ని చేపట్టే సామర్త్యాన్ని కాపాడుకోవడమే ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తుల దీర్ఘకాలిక లక్ష్యాలుగా ఉండాలి.