ప్లూరల్ ఎఫ్యూషన్ అంటే ఏమిటి?
ఊపిరితిత్తుల యొక్క పొరల మధ్య స్థలంలో ద్రవం చేరే ఒక ఆరోగ్య పరిస్థితిని ప్లూరల్ ఎఫ్యూషన్ అని పిలుస్తారు. ఈ భాగాన్ని, ప్లూరల్ స్పేస్ (pleural space) అని అంటారు, ఇది సహజంగానే కొంచెం ద్రవాన్ని కలిగి ఉంటుంది, శ్వాస ప్రక్రియలో ఊపిరితిత్తుల సంకోచ వ్యాకోచ సమయంలో రాపిడిని నిరోధించడానికి ఇది సహాయపడుతుంది. ప్లూరల్ ఎఫ్యూషన్తో బాధపడుతున్న వ్యక్తిలో ప్లూరల్ ప్రదేశంలో ద్రవం అధికంగా చేరుతుంది మరియు తీవ్రమైన ఛాతీ నొప్పి ఉంటుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ప్లూరల్ ఎఫ్యూషన్ యొక్క లక్షణాలు ప్లూరల్ స్పేస్ లో ద్రవం అధికంగా చేరడం ప్రారంభమైనప్పుడు గమనింపబడతాయి. లక్షణాలు ఈ విధంగా ఉంటాయి:
- నిరంతరమైన పొడి దగ్గు.
- శ్వాస తీసుకోవడంలో సమస్య.
- ఛాతి నొప్పి.
- జ్వరం.
- వెక్కిళ్లు (Hiccups).
- శ్వాస వేగవంతం అవడం.
కొంతమంది వ్యక్తులలో, ప్లూరల్ ఎఫ్యూషన్ చివరి దశల వరకు ఎటువంటి లక్షణాలను చూపించకపోవచ్చు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ప్లూరల్ ఎఫ్యూషన్ యొక్క కారణాలు క్రింది వాటివలన కావచ్చు:
- గుండె వైఫల్యం.
- ఊపిరితిత్తుల సంక్రమణం.
- ఊపిరితిత్తుల క్యాన్సర్.
- కాలేయ వైఫల్యం.
- మూత్రపిండాల వ్యాధులు.
- ఛాతీ మరియు ఊపిరితిత్తులకు గాయం.
మద్యం యొక్క అధిక వినియోగం మరియు ధూమపానం ప్లూరల్ ఎఫ్యూషన్ ప్రమాదాన్ని పెంచుతాయి. కొన్ని సందర్భాల్లో, శస్త్రచికిత్స సమయంలో గాయం కూడా ప్లూరల్ ఎఫ్యూషన్కు దారి తీయవచ్చు.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
సాధారణంగా, ప్లూరల్ ఎఫెక్షన్ యొక్క రోగ నిర్ధారణ భౌతిక లక్షణాల పరీక్షతో ప్రారంభమవుతుంది. ఇతర నిర్దారణ పరీక్షలలో ఇవి ఉంటాయి:
- ఛాతి యొక్క సిటి స్కాన్.
- ఛాతీ ఎక్స్-రే.
- రక్త పరీక్షలు.
- ఊపిరితిత్తుల జీవాణుపరీక్ష (బయాప్సీ).
- ప్లూరల్ ఫ్లూయిడ్ (ద్రవం) యొక్క ప్రయోగశాల (ల్యాబ్) పరీక్ష.
ఈ పరిస్థితి నిర్ధారణ తర్వాత, వైద్యులు అధిక ద్రవాన్ని తీసివేసి, ఆపై ద్రవాన్ని మళ్ళి తిరిగి చేరకుండా నిరోధించడానికి చికిత్సను ప్రారంభిస్తారు. పునరావృతమయ్యే అవకాశాన్ని నిరోధించడానికి ప్యూరల్ ఎఫ్యూషన్ యొక్క ఖచ్చితమైన కారణాన్ని కూడా వైద్యులు గుర్తిస్తారు.
ద్రవం చేరడానికి గుండె వైఫల్యం కారణమైతే, డైయూరేటిక్స్ (diuretics) సూచించబడవచ్చు. ప్యూరల్ ఎఫ్యూషన్కు అంటువ్యాధులు కారణమైతే చికిత్స కోసం యాంటీబయాటిక్స్ను సూచిస్తారు.
ప్లూరల్ స్పేస్ నుండి ద్రవాన్ని తీసివేయడం కోసం ఛాతీ ట్యూబ్ను (chest tube) ఉపయోగించవచ్చు.
ప్లూరల్ ఎఫ్యూషన్ అనేది ఒక తీవ్రమైన పరిస్థితి మరియు చికిత్స చేయకుండా వదిలేస్తే అది తీవ్ర సమస్యలకు దారితీస్తుంది.