మెనోపాజ్ తర్వాత ఆస్టియోపొరోసిస్ అంటే ఏమిటి?
ఆస్టియోపొరోసిస్ అనేది ఎముకలను బలహీనంగా మరియు పెళుసుగా మార్చే వ్యాధి తద్వారా అది ఫ్రాక్చర్లు చాలా సులభంగా సంభవించేలా చేస్తుంది. సాధారణంగా 45-52 సంవత్సరాల వయసులో మహిళల్లో మెనోపాజ్ (రుతువిరతి) జరుగుతుంది మరియు అది అనేక హార్మోన్ల మార్పులతో ముడి పడి ఉంటుంది. ఈ హార్మోన్ల మార్పులు, ఎముకలలో కాల్షియం శోషణ (absorption)తో సహా అనేక శారీరక మార్పులకు దారితీస్తాయి. మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ యొక్క ఎముకలను రక్షించే చర్య తగ్గిపోవడం/కోల్పోవడం వలన స్త్రీలు ఆస్టియోపొరోసిస్ గురవుతారు.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఫ్రాక్చర్ సంభవించే వరకు లేదా కొన్ని ఇతర ప్రయోజనాల కోసం నిర్వహించిన ఎక్స్- రే లేదా శరీర స్కాన్లో గుర్తించబడేంతవరకు ఈ వ్యాధి ఎక్కువగా బయటకు తెలియదు. మరింత చెడ్డ విషయం ఏమిటంటే, కొన్ని హెయిర్లైన్ (సన్నని) ఫ్రాక్చర్లు అసలు గుర్తించబడవు. వీటికి ఒక ప్రామాణిక ఉదాహరణ వెన్నుపూస ఫ్రాక్చర్, దీనిలో కదులుతున్నపుడు కొద్దిగా మొద్దుబారినట్టు ఉండే నొప్పి (dull pain) తప్ప ఇంకా ఏ విధమైన లక్షణాలు కనిపించవు. తేలిక పాటి గాయాలు/దెబ్బలకు కూడా ఫ్రాక్చర్లు సంభవిస్తాయి. వీటిని ఫ్రేగిలిటీ ఫ్రాక్చర్లు (పెళుసుదనం వాల్ల విరిగిపోవడం) అని అంటారు.తరువాతి దశలలో, రోగుల వెన్నుపూసలలో అనేక ఫ్రాక్చర్ల కారణంగా వారి ఎత్తు కూడా తగ్గిపోవచ్చు. బలహీనమైన ఎముకలకు కారణంగా మహిళలతో వారి భంగిమ కూడా మారిపోయి గూని ఏర్పడుతుంది.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
మెనోపాజ్ (రుతువిరతి)కు ముందు అండాశయాలు ఉత్పత్తి చేసే హార్మోన్లు ఎముక నిర్మాణం మరియు పునశ్శోషణ (resorption) యొక్క సమతుల్యతను నిర్వహించడానికి సహాయం చేస్తాయి కానీ అండాశయ పనితీరు మరియు హార్మోన్లు వయస్సు పెరగడంతో పాటు క్షీణిస్తాయి. అండాశయ హార్మోన్లు తక్కువ స్థాయిలో ఉండడం ఎముక పునశ్శోషణ (resorption) అధికమవుతుంది కానీ ఎముకల నిర్మాణం (i.e., deposition) తగ్గిపోతుంది తద్వారా అది ఎముకల బలహీనతకు దారితీస్తుంది. అందువల్ల మెనోపాజ్ తర్వాత మొదటి కొన్ని సంవత్సరాలలో ఎముకలు పెళుసుగా మారుతాయి మరియు ఎముకల బలం గణనీయంగా తగ్గిపోతుంది.
శరీర భంగిమను (posture) మరియు సంతులనాన్ని (balance) నిర్వహించడంలో కష్టపడటం వలన కింద పడిపోయే అవకాశం అధికమవుతుంది అందువలన రోగులలో ఫ్రాక్చర్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. శారీరక శ్రమ లేకపోవడం కూడా ఎముకలు పెళుసుబారే ప్రమాదానికి దారితీస్తుంది. మద్యపానం మరియు ధూమపానం కూడా అదనపు ప్రమాద కారకాలు.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
రక్తంలో కాల్షియం మరియు మెగ్నీషియం స్థాయిల మార్పులు, రక్తహీనత, థైరాయిడ్ గ్రంధి సరిగ్గా పనిచేయకపోవడం, విటమిన్ డి లోపం మరియు మద్యపాన దుర్వినియోగం వలన కాలేయంపై ప్రభావం వంటి కారణాల వలన ఆస్టియోపొరోసిస్ సంభవించవచ్చు. అందువలన, థైరాయిడ్ ఫంక్షన్ పరీక్ష, మరియు కాల్షియం, విటమిన్ డి మరియు మెగ్నీషియం యొక్క సీరం స్థాయిల అంచనా కోసం రక్త పరీక్షలు నిర్వహిస్తారు. ఫ్రాక్చర్ అనుమానం ఉన్న రోగులలో ఎక్స్-రే నిర్వహించడం తప్పనిసరి. 1.5 అంగుళాలకు పైగా ఎత్తు తగ్గిపోవడం కూడా ఎక్స్- రే ఇమేజింగ్ పరీక్ష యొక్క అవసరాన్ని సూచిస్తుంది.
ఎముక సాంద్రత స్కాన్ (bone density scan) లేదా డేక్స (DEXA) స్కాన్ అని పిలిచే ఇమేజింగ్ పరీక్ష ఆస్టియోపొరోసిస్ కలిగి ఉన్న ఎముకలను మరియు దాని తీవ్రతను గుర్తించడానికి సహాయపడుతుంది.
చికిత్సలో ఎముకలను బలపర్చేందుకు ఉపయోగపడే మందులను సూచిస్తారు- కాల్షియం మరియు విటమిన్ డి సప్లిమెంట్స్ మరియు ఎముకలు పునశ్శోషణ (resorption) తగ్గించే కొన్ని మందులు ఇస్తారు. హార్మోన్ పునఃస్థాపన (Hormone replacement) కూడా ఉంటుంది, అయితే దీనిని సాధారణంగా సలహా ఇవ్వరు. ఎముక ఖనిజ సాంద్రత (Bone mineral density) ను నిరంతరాయంగా పర్యవేక్షించవలసి ఉంటుంది, మరియు ఫ్రాక్చర్లను మరియు గాయాలను నివారించడానికి రోగి జాగ్రత్త వహించాలని సలహా ఇస్తారు.