ప్రీఎక్లంప్సియా మరియు ఎక్లంప్సియా అంటే ఏమిటి?
ప్రీఎక్లంప్సియా అనేది గర్భధారణ సమయంలో కొంతమంది మహిళల్లో పెరిగిపోయిన రక్తపోటువల్ల వచ్చే రుగ్మత. ఈ రుగ్మత గతంలో రక్తపోటు సమస్యలు లేని మహిళలకు సంభవించినపుడు అది (వారికి) విలక్షణమైనదిగా ఉంటుంది. ఎక్లంప్సియా (eclampsia) అని పిలువబడే మరింత తీవ్రమైన జబ్బు విషయంలో ప్రతి 200 మంది ప్రీఎక్లంప్సియా కల్గిన మహిళలలో ఒకరికి సంభవిస్తుంటుంది. ఈ ఎక్లంప్సియా జబ్బులో పెరిగిపోయిన రక్తపోటు ఫలితంగా స్త్రీలు మూర్ఛను అనుభవించడం ప్రారంభిస్తారు.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
వ్యాధి లక్షణాలు వ్యాధి పరిస్థితిని బట్టి వ్యక్తి నుండి వ్యక్తికీ వేరుగా ఉంటాయి. అయితే, విస్తృతంగా ఈ రుగ్మతకు గురైన వ్యక్తి కింది లక్షణాలను కలిగి ఉండవచ్చు:
- ప్రీఎక్లంప్సియా: బరువు పెరుగుట, తలనొప్పి, దృష్టిలో మార్పు, వికారం, పొత్తికడుపు నొప్పి మరియు తగ్గిన మూత్ర ఉత్పత్తి అనే వ్యాధి లక్షణాలు శరీరంలో ద్రవం యొక్క నిలుపుదల కారణంగా కలుగుతాయి.
- ఎక్లంప్సియా: ముఖం మరియు చేతుల్లో వాపు , అస్పష్టమైన దృష్టి, స్థితిభ్రాంతి, దృష్టి నిష్ఫల కదలికలు మరియు స్పృహ కోల్పోవడం
ప్రధాన కారణాలు ఏమిటి?
ప్రీఎక్లంప్సియా యొక్క ఖచ్చితమైన కారణాన్ని అంచనా వేయడం చాలా కష్టం, అయినప్పటికీ తగినంతగా ఆహారం తీసుకోకపోవడం లేదా పేలవమైన ఆహారం తినడం, గర్భాశయానికి రక్త ప్రసరణ లేకపోవడం లేదా తగ్గడం లేదా కొన్ని జన్యుపరమైన కారణాలు ఈ దోహదం చేస్తాయని సూచిస్తున్నాయి. ప్రీఎక్లంప్సియా విషయంలో, అండ సంయోగస్థానం లేదా మావి (placenta) కి చెందిన అసాధారణతలు లేదా ఎక్కువైన ప్రోటీన్ స్థాయిలు, స్పష్టమైన అధిక రక్త పీడనంవంటివి ఈ రుగ్మతకు దారి తీస్తాయని వైద్యులు ఎక్కువగా విశ్వసిస్తారు.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
ప్రీఎక్లంప్సియా మరియు ఎక్లంప్సియా వ్యాధి నిర్ధారణలో, వైద్యులు మొదట రక్తపోటు స్థాయిలను పరిశీలించి, కొంత కాలం పాటు వాటిని పర్యవేక్షిస్తారు. రక్తగణన కోసం, రక్తంగడ్డకట్టేందుకుపకరించే ప్లేట్లెట్ల పరిశీలనకు, మూత్రపిండాలు మరియు కాలేయ పనితీరు కోసం వైద్యులు రక్తం నమూనాలను తీసుకోవచ్చు. అదనంగా, మూత్ర ప్రోటీన్ స్థాయిలను పరిశీలించవచ్చు మరియు క్రియాటినిన్ తనిఖీలను కూడా వైద్యులు నిర్వహించబడవచ్చు.
ఎక్లెంప్సియా మరియు ప్రీఎక్లంప్సియాకు సరైన చికిత్స శిశువును ప్రసవించడమే, ఇది గర్భస్థ శిశువు యొక్క అభివృద్ధి మరియు తల్లి యొక్క పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. రుగ్మత పరిస్థితి తేలికపాటి పరిస్థితులతో కూడిఉంటే, వైద్యులు మంచం విశ్రాంతిని సూచిస్తారు. ఇంకా, రక్తపోటుకు మందులు సూచిస్తారు మరియు సాధారణ రక్త పరీక్షలను చేయించామని సలహానిస్తారు. కొన్ని సంక్లిష్ట సందర్భాలలో, వైద్యులు గర్భిణిని ఆస్పత్రిలో చేర్పించమని కూడా సిఫారసు చేయవచ్చు. వ్యక్తి ఎక్లంపియాసియాను కలిగి ఉంటే, మూర్ఛల్ని నివారించడానికి వైద్యులు యాంటీ కన్వొల్సెంట్లను కూడా సూచించవచ్చు. ప్రీఎక్లంప్సియా లేదా ఎక్లంప్సియా యొక్క అన్ని సంకేతాలు, లక్షణాలు ప్రశస్తమైన 6 వారాల తర్వాత మాయమైపోతాయని ఆశించొచ్చు.