సారాంశం
పురుషులు ఎదుర్కొంటున్న ప్రధానమైన లైంగిక సమస్యలలో శీఘ్ర స్ఖలనం ఒకటి. ఇది హెచ్చు శాతం మందిని మానసికంగా కృంగదీస్తున్నది. పురుషుడు సంభోగం సందర్భంగా అంగస్తంభనను నిలుపకోలేకపోవడం ఈ సమస్యకు కారణం. ఉద్వేగం పొందడానికి మునుపే స్ఖలనం జరగడం శీఘ్రస్ఖలనంగా చెప్పబడుతుంది. రతి ప్రారంభించిన నిమిషం లోపుగా వీర్య స్ఖలనం జరిగితే దానిని శీఘ్ర స్కలనం లేదా ప్రి-మెచ్యూర్ ఎజాక్యులేషన్ – ( పి ఐ) అంటారు. ఈ దుస్థితి పురుషునికి మానసికంగా ఇబ్బంది కలిగించి తన లైంగిక భాగస్వామితో సంబంధాలను త్రుంచివేస్తుంది శీఘ్ర స్ఖలనం ప్రాథమిక (యావజ్జీవ ప్రాతిపదిక ) స్థాయిలో లేదా సెకండరీ స్థాయిలో ( తెచ్చుకొన్నది) ఉంటుంది. ఈ దుస్థితికి కారణం శారీరక , మానసిక లేదా జన్యుపమైనది కావచ్చు. మానసిక ఒత్తిడి నిర్వహణ, ఔషధాల వాడకం, మానసిక వైద్య నిపుణుని సలహాలు మరియు సముచిత వ్యాయామం తో కూడిన విభిన్న చికిత్సలు పరిస్థితిని చక్కదిద్దుతాయి. శీఘ్రస్ఖలనం సమస్య హెచ్చు మోతాదులో ఉన్నప్పుడు, చికిత్స లోపం మానసిక ఒత్తిడిని మరింత తీవ్రం చేస్తుంది.. కొన్ని సందర్భాలలో , ఇది పుంస్త్వం/ పుంసకత్వం సమస్యకు దారితీస్తుంది. ఎందుకంటే వీర్యం యోనిలో ప్రవేశించడంలో విఫలమవుతుంది. ఎక్కువ మంది పురుషులలో శీఘ్ర స్ఖలనం సమస్యను వైద్య సహాయంతో నయం చేయవచ్చు.