పక్కటెముకల నొప్పి అంటే ఏమిటి?
“పక్కటెముకల నొప్పి” అనే రుగ్మతలో పక్కటెముకల ఒకపక్క లేదా రెండు వైపులా నొప్పి కలగడం సంభవిస్తుంది. ఒకే సమయంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పక్కటెముకలలో నొప్పి సంభవించవచ్చు.
దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఛాతీలో సాధారణ నొప్పి కాకుండా, పక్కటెముకల నొప్పి కింద సూచించినటువంటి నిర్దిష్ట లక్షణాలను కలిగి ఉండవచ్చు:
- చాతీ గోడనొప్పి (costochondritis) విషయంలో, పక్కటెముక మృదులాస్థి మంటకలగడమో లేదా వాపుదేలడమో జరుగుతుంది మరియు ఛాతీ ప్రాంతంలో సున్నితత్వం కలగడం గుర్తించబడింది. ఈ నొప్పి ఎగువ పక్కటెముకలలో కనబడుతుంది మరియు ఈ నొప్పి ఉరోస్థికి (లేక రొమ్ముటెముక కు) దగ్గరగా ఉంటుంది. అయితే, ఈ నొప్పి తీవ్రమైన రూపందాల్చినపుడు, వ్యాధి లక్షణాలు మరింత తీవ్రమై శరీరం దిగువ భాగంలో పునరావృత నొప్పిని కలుగజేస్తాయి. అలాంటి సందర్భంలో, వైద్యసహాయాన్ని తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది..
- అదేవిధంగా, ప్లేయూర (pleura) లేదా శ్లేష్మస్తరం (ఛాతీ గోడను మరియు ఊపిరితిత్తులను కప్పివుంచే పోర) యొక్క వాపు (pleurisy) ఉంటుంది. ఈ రుగ్మత యొక్క సాధారణ లక్షణం నొప్పి. సాధారణంగా, ఈ రుగ్మత దానంతట అదే నయమైపోతుంది, కానీ కొన్ని సందర్భాల్లో, యాంటిబయోటిక్ థెరపీని సిఫారసు చేయబడుతుంది. ఇంకా, బ్రాంఖైటిస్, అంటే వాయుమార్గాల వాపు, కూడా పక్కటెముకభాగం చుట్టూ నొప్పి రావడానికి కారణం కావచ్చు.
- ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా పక్కటెముక లేదా ఛాతీ ప్రాంతాల్లో నొప్పిని కలిగిస్తుంది, ఇది నవ్వినప్పుడు లేదా దగ్గినపుడు మరింత తీవ్రమవుతుంది. ఇలా తీవ్రమైన పక్కటెముకల నొప్పి శ్వాస-సంబంధ సమస్యకు (wheezing), కఫము తయారవడానికి, ఊపిరాడకపోవడం అనే సమస్యలకు దారి తీయవచ్చు.
- ఫైబ్రోమైయాల్జియా విషయంలో, నొప్పి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే రొమ్ములో మండుతున్నట్లుంటుంది (బర్నింగ్), కత్తితో పోట్లు పొడిచినట్లుండే నొప్పి లేదా సలుకు, పోటువంటి బాధాకరంగా ఉండే నొప్పి ఉంటుంది.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
పక్కటెముక నొప్పి యొక్క కారణాలు సాధారణ కారణాల నుండి అరుదైన పరిస్థితులు ఉంటాయి, ఈ పరిస్థితులు ఛాతీ నొప్పిని పెంచుతాయి మరియు కడుపు నొప్పి మరియు జ్వరంతో కలిపి కూడా ఉండవచ్చు.
సాధారణ కారణాలు:
- ఛాతి మృదులాస్థుల యొక్క వాపు, నొప్పి. ఛాతీ గోడల నొప్పి అని కూడా అంటారు దీన్ని.
- థొరాసిక్ వెన్నెముకలో నొప్పి.
- స్టెర్నాలిస్ రుగ్మత (Sternalis syndrome) - ఛాతీ గోడలో నొప్పి వల్ల కలిగిన అరుదైన రుగ్మత.
- గాయం, క్రీడలు, ప్రమాదం, దాడి లేదా పడటం కారణంగా పక్కటెముకలు విరగడం.
అరుదైన కారణాలు:
- ఒత్తిడితో కూడిన పగుళ్లు (Stress fractures).
- రుమటాయిడ్ (ఎముక మరియు కీళ్ళలో వాపు లేదా నొప్పి) కారకాలు.
- ఫైబ్రోమైయాల్జియా - కండరాల నొప్పి మరియు పెడసరం, కీళ్ల నొప్పి కూడా ఉంటుంది.
- సికిల్ సెల్ అనీమియా - కొడవలి (సికిల్)-ఆకారంలో ఉండే ఎర్ర రక్త కణాల వలన రక్తానికి ఆక్సిజన్ ను మోసే సామర్ధ్యం తగ్గడం.
- పాలీకోండ్రిటిస్ - కార్టిలేజ్ (మృదులాస్థి) యొక్క వాప.
- బోలు ఎముకల వ్యాధి - ఋతుక్రమం ఆగిపోయిన దశలో ఎముక సాంద్రతలో తగ్గుదల.
- ల్యూపస్ ఎరిథెమాటోసస్ - ఇదిఒక ఆటో ఇమ్యూన్ పరిస్థితి.
- వ్రేలాడే పక్కటెముకల రుగ్మత - అరుదైన పరిస్థితి ఇది, ఇక్కడ దిగువ ఎముకలలోని మృదులాస్థి జారుతుంది, తద్వారా నొప్పిని కలిగిస్తుంది.
- ట్యూమర్స్.
- పిత్తాశయ రాళ్లు.
- రొమ్ము నొప్పి, పార్శ్వశూల.
- పల్మోనరీ ఎంబోలిజం.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
పైన పేర్కొన్నపరిస్థితుల్ని వ్యాధిలక్షణాల నుండి ఊహించవచ్చు.చెస్ట్ ఎక్స్-రే, CT స్కాన్, MRI లేదా సి-రియాక్టివ్ ప్రోటీన్ స్థాయిలు వంటి వివిధ పరీక్షలు చేయటానికి డాక్టర్ మీకు సలహా ఇస్తారు.
వీటితో పాటు వైద్యుడు కింది చికిత్సల్ని కూడా సిఫారసు చేయవచ్చు:
- అనాల్జేసిక్ లేదా నొప్పినివారణ (పెయిన్‌కిల్లర్) మందులు.
- భౌతిక ఒత్తిడిని తాత్కాలికంగా నిరోధించడం.
- వేడి కాపడాలు/చల్లని ప్యాక్ ల చికిత్స.
- ఫిజియోథెరపీ.
- కార్టికోస్టెరాయిడ్ థెరపీ.
తీవ్రమైన సందర్భాల్లో, క్యాన్సర్ మరియు విరిగిన పక్కటెముకలు వంటి తీవ్ర పరిస్థితులకు వైద్యుడు నిర్దిష్ట చికిత్సలను నిర్వహించవచ్చు.