రోటా వైరస్ అంటే ఏమిటి?
వాంతులు మరియు అతిసారంతో కూడిన అంటువ్యాధి “రోటా వైరస్.” జీర్ణాశయానికి ‘రోటావైరస్’ సూక్ష్మజీవి అంటు సోకడంవల్ల ఈ రోటా వైరస్ వ్యాధి సంభవిస్తుంది. సామాన్యంగా, ఈ రుగ్మత చిన్న పిల్లలు మరియు శిశువులకు వస్తూ ఉంటుంది. అయినప్పటికీ, రోగ నిరోధకమందుల (immunisation) సేవనం మరియు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా రోటా వైరస్ వాంతి-భేదుల వ్యాధిని నివారించవచ్చు. చిన్నపిల్లల కడుపునొప్పికి అతిసాధారణ కారణాలలో ఈ రోటావైరస్ సూక్ష్మజీవితో కూడిన ఈ అంటువ్యాధి ఒకటి.
దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
రోటవైరస్ సంక్రమణ యొక్క లక్షణాలు కలుషిత ఆహారం తినడం లేదా కలుషిత నీరు త్రాగటం జరిగిన రెండు రోజుల తర్వాత పిల్లలలో (వ్యక్తుల్లో) కనిపిస్తాయి. ఆ లక్షణాలు కిందివిధంగా ఉంటాయి:
- జ్వరం
- విరేచనాలు
- వాంతులు
- పొత్తి కడుపు నొప్పి
- ఆకలి యొక్క నష్టం
- దేహ్యాడ్రేషన్ (నిర్జలీకరణము)
- తగ్గిన మూత్రవిసర్జన
- నోరు మరియు గొంతు పొడిబారిపోవడం
- మైకము
- ఎక్కువ మారాం చేయడం (fussiness) చిరాకు (irritability) స్వభావం
ఈ సూక్ష్మజీవి (వైరస్) నుండి రోగనిరోధక రక్షణ లేనందున రుగ్మత యొక్క చరిత్ర కలిగిన పిల్లలు “రోటా వైరస్” వ్యాధి లక్షణాన్ని కూడా పొంద వచ్చు. అయితే, ఈ వైరస్ యొక్క మొట్టమొదటి సంక్రమణ చాలా తీవ్రంగా ఉంటుంది.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
రోటా వైరస్ (Rotavirus) అనేది ఒక అంటువ్యాధి, ఇది కిందివిధంగా వ్యాపిస్తుంది:
- రోటా వైరస్ వ్యాధి సోకిన శిశువు యొక్క మలంతో ప్రత్యక్ష సంబంధం.
- ఈ వ్యాధి సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉండడంవల్ల.
- వ్యాధి సోకిన వ్యక్తి యొక్క టాయిలెట్ వస్తువులు, పరుపు మరియు ఆహారంతో సంబంధంవల్ల.
- వ్యక్తిగత పరిశుభ్రతను పాటించకపోవడంవల్ల.
రోటావైరస్ వ్యాధి అంటువ్యాధి కాబట్టి, ఇది కుటుంబం, పాఠశాల మరియు ఇతర సార్వత్రిక సంస్థలైనటువంటి ప్రభుత్వ సంస్థల్లో ఒకరి నుండి ఒకరికి త్వరగా వ్యాపిస్తుంది.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
రోటావైరస్ వ్యాధి తీవ్రంగా ఉన్నపుడు ఇది నిర్జలీకరణ-సంబంధిత రుగ్మతలకు దారి తీస్తుంది. వ్యక్తి మలంలో ఈ వ్యాధికారక సూక్ష్మజీవిని (వైరస్) గుర్తించడంపై వ్యాధినిర్ధారణ ఆధారపడి ఉంటుంది. ఈ రుగ్మతను నిర్ధారించేందుకు వైద్యుడు మలపరీక్ష(స్టూల్ పరీక్ష) ను నిర్వహించవచ్చు. ఎంజైమ్ ఇమ్మ్యునోయస్సే మరియు రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ పాలిమరెస్ చైన్ రియాక్షన్ (పిసిఆర్) అని పిలవబడే పరీక్షలు రోటావైరస్ రోగనిర్ధారణలో ఉపకరిస్తాయి.
చికిత్స:
రోటావైరస్ అంటురోగాల విషయంలో నివారణ మాన్పడం కంటే ఉత్తమం (prevention is better than cure). అందువలన, బహిరంగ స్థలాలకు వెళ్లకుండా ఉండడం మరియు వ్యక్తిగత పరిశుభ్రత యొక్క నిర్వహణ సిఫార్సు చేయబడుతుంది. అలాగే, వ్యాధి సోకిన వ్యక్తి పరుపును మరియు రోగి యొక్క బట్టల్ని తాకకుండా ఉండడంవల్ల ఈ వ్యాధి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.
వ్యాధి కారణంగా కోల్పోయిన ఉప్పు మరియు ద్రవాలను భర్తీ చేయడానికి ఇంట్లో నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు, చక్కెరనీళ్ల షెర్బత్ (చక్కెర 6 టీస్పూన్లు మరియు అయోడైజ్డ్ ఉప్పును అరస్పూను ను ఒక లీటరు వేడిచేసి తాగునీటిలో వేసి కలిపి తయారు చేయబడుతుంది) వంటి రీహైడ్రేషన్ ద్రవాహారాల్ని సిద్ధంగా ఉంచుకుని సేవించడం ఉపయోగకరం. సంపూర్ణముగా చేతరించుకుని తిరిగి సంపూర్ణ ఆరోగ్యం పొందేవరకూ బయటి ఆహారాల్ని (outside foods) సేవించకపోవడం చాలా ముఖ్యం.
రోటవైరస్ సంక్రమణకు చికిత్స సాధారణంగా వ్యాధిలక్షణాల ఆధారంగా ఉంటుంది మరియు వైద్యుడు రోగికి పూర్తిగా మంచంపట్టునే ఉండి విశ్రాంతి తీసుకోమని సలహా ఇవ్వవచ్చు. మీరు బాగా ఉడకని ఆహారాన్ని తినకపోవడం, నీటిని ఎక్కువగా తాగటం చాలా ముఖ్యం.
అదేవిధంగా, ఈ సూక్ష్మజీవి విరుద్ధంగా సరైన రక్షణ పొందడానికి రెండు టీకా మందులను శిశువులకు ఇవ్వవచ్చు.
- రోటాటెక్ [Rota Teq] (RV5) 2,4 మరియు 6 నెలల వయస్సులో శిశువులకు ఇవ్వాలి.
- రొటారిక్స్ [Rotarix] (RV1) 2 మరియు 4 నెలల శిశువులకు ఇవ్వాలి.