రుబెల్లా (జర్మన్ మీసల్స్) - Rubella (German Measles) in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

January 05, 2019

July 31, 2020

రుబెల్లా
రుబెల్లా

రుబెల్లా (జర్మన్ మీసల్స్) అంటే ఏమిటి?

రుబెల్లా లేదా జర్మన్ మీసల్స్ వ్యాధి అనేది రబ్బల్లా వైరస్ వలన సంక్రమించే వ్యాధి. ఈ వైరస్ కారణంగా పిల్లలలో జ్వరం మరియు దద్దుర్లు సంభవిస్తాయి. గర్భిణీ స్త్రీలు ఈ వైరస్ వలన ప్రభావితం ఐతే, అది గర్భస్రావం, మృతపిండం జన్మించడం లేదా పుట్టుకతో బిడ్డకు రుబెల్లా సిండ్రోమ్ సంక్రమించడం వంటి తీవ్ర వైద్య అత్యవసర పరిస్థితితులకి దారితీయవచ్చు.

తేలికగా సంక్రమించే దాని స్వభావం కారణంగా, తుమ్ములు మరియు దగ్గు వంటి వాటి ద్వారా కూడా ఇది సులభంగా వ్యాపిస్తుంది. ఈ సంక్రమణకు మానవులు మాత్రమే ఒకే హోస్ట్ (host) గా ఉన్నారు. అయితే, ఒక వ్యక్తికి ఒకసారి ఈ వైరస్ సోకినట్లయితే, అతని రోగనిరోధక వ్యవస్థ అటువంటి సంక్రమణలు మళ్ళి వృద్ధి చెందకుండా అణిచివేస్తుంది.

దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

రుబెల్లా సంక్రమణ/ఇన్ఫెక్షన్ యొక్క సాధారణ లక్షణాలు

  • ముఖం మీద దద్దుర్లు ఏర్పడతాయి, అవి శరీర ఇతర భాగాలకు కూడా వ్యాపిస్తాయి
  • జ్వరం
  • శోషరస కణుపుల వాపు (లింఫ్ నోడ్ల) వాపు
  • యుక్త వయసు స్త్రీలలో కీళ్ళ నొప్పులు

తీవ్రమైన సందర్భాల్లో, పరిస్థితి ఇటువంటి సమస్యలను కలిగించవచ్చు

  • ఋతుక్రమ సమస్యలు
  • ఆర్థరైటిస్
  • మెదడుకి ఇన్ఫెక్షన్  వ్యాపించడం (బ్రెయిన్ ఇన్ఫెక్షన్)

పిల్లలలో, ఇన్ఫెక్షన్ ఈ క్రింది లక్షణాలను కలిగిస్తుంది

  • 39°C కంటే తక్కువ ఉండే తేలికపాటి జ్వరం
  • కండ్లకలక
  • వికారం
  • శోషరస కణుపుల వాపు (లింఫ్ నోడ్ల) వాపు

వైరస్ ఒక వారంలో శరీరం అంత వ్యాపిస్తుంది మరియు లక్షణాలు రెండవ వారం చివరలో కనిపించడం మొదలవుతాయి.

మొదటి త్రైమాసికంలో ఉన్న గర్భిణీ స్త్రీకి రుబెల్లా సంక్రమణం చాలా ప్రమాదకరమైనది. అది పుట్టుకతో వచ్చే రుబెల్లా సిండ్రోమ్ (congenital rubella syndrome)కు దారి తీస్తుంది, మరియు ఇది శిశివు జన్మించిన ఒక సంవత్సరం వరకు వైరస్ యొక్క విసర్జనకు కారణమవుతుంది. అదేవిధంగా, పిండానికి (కడుపు శిశువుకు) సంభవించే ఇతర లోపాలు

  • గుండె అసాధారణతలు
  • దృష్టి నష్టం
  • ప్లీహము (Spleen) లేదా కాలేయానికి హాని/నష్టం
  • మేధో వైకల్యం

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

అన్ని ఇతర వైరల్ సంక్రమణాల మాదిరిగానే, రబ్బల్లా వైరస్ కూడా దగ్గు మరియు తుమ్ములు నుండి వచ్చిన కలుషిత (వ్యాధి సోకిన) బిందువుల ద్వారా వ్యాపిస్తుంది. వైరస్ యొక్క ఇంక్యూబేషన్ వ్యవధి అధికంగా ఉంటుంది మరియు లక్షణాలు కనిపించడానికి కనీసం 10 రోజుల సమయం పడుతుంది. రోగనిరోధక శక్తి  తక్కువగా ఉన్న వ్యక్తులలో, సంక్రమణను నివారించడానికి ఒక ఎయిర్ మాస్క్ సూచించబడుతుంది. ముఖ్యంగా పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలు ఈ సంక్రమణకు గురవుతారు మరియు వారికి వైరస్ కు వ్యతిరేకంగా టీకాలు (vaccine) వేయాలి.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

రోబెల్లా సంక్రమణ యొక్క లక్షణాలు వైరల్ దద్దుర్లకు చాలా దగ్గరగా ఉంటాయి. అందువల్ల, సంక్రమణ/ఇన్ఫెక్షన్ యొక్క ఉనికిని గుర్తించేందుకు వివిధ రకాల ప్రయోగశాల ఆధారిత పరీక్షలు నిర్వహించబడవచ్చు. వైరస్ సాగు (virus culture) లేదా రక్త పరీక్ష ద్వారా రక్తప్రవాహంలో రుబెల్లా వైరస్ యొక్క యాంటీబాడీలను గుర్తించవచ్చు తద్వారా ఈ సంక్రమణను ధ్రువీకరించవచ్చు.

రుబెల్లాకు ప్రత్యేకమైన చికిత్స ఏది లేదు. చికిత్స లక్షణాలను నియంత్రించడానికి చేయబడుతుంది జ్వరం తగ్గించడానికి యాంటిపైరెటిక్లను (antipyretics) మరియు దురదను తగ్గించడానికి యాంటిహిస్టామైన్ల (anti-histamines)ను సూచిస్తారు. గర్భిణీ స్త్రీల విషయంలో అత్యవసర చికిత్స అవసరం.

మీసల్స్, గవదబిళ్ళలు (mumps), మరియు రుబెల్లా నుండి రక్షణ కొరకు, ఎంఎంఆర్ (MMR) అని పిలవబడే ఒక కలయిక టీకా (combination vaccine) సాధారణంగా నివారణ చర్యగా ఇవ్వబడుతుంది. ఎంఎంఆర్ టీకా (MMR vaccine) చాలా సురక్షితమైనది మరియు సమర్థవంతమైనది.

రబ్బెల్ను నిరోధించేందుకు రెండు టీకాలు ఉన్నాయి:

  • ఎంఎంఆర్ టీకా రబ్బల్లా మీసల్స్ మరియు గవదబిళ్ళ నుండి పిల్లలు మరియు పెద్దలను రక్షిస్తుంది
  • ఎంఎంఆర్ వి టీకా (MMRV vaccine) పిల్లలను  రుబెల్లా, మీసల్స్ , గవదబిళ్ళ, మరియు పొంగు చూపడం/అమ్మవారు (chickenpox) నుండి రక్షిస్తుంది.



వనరులు

  1. World Health Organization [Internet]. Geneva (SUI): World Health Organization; Rubella.
  2. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Rubella
  3. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Rubella: Make Sure Your Child Gets Vaccinated
  4. Office of Infectious Disease. Rubella (German Measles). U.S. Department of Health and Human Services [Internet]
  5. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Rubella