గజ్జి అంటే ఏమిటి?
చిన్నచిన్న దురద పురుగుల (ఎనిమిది కాళ్ళ నల్లులు) వలన అధికంగా వ్యాపించే సంక్రమణ/ఇన్ఫెక్షన్ను గజ్జి అని అంటారు. ఈ వ్యాధికారక పరాన్నజీవులు (పురుగులు) కంటికి కనిపించవు, కానీ చర్మాన్ని వాటి పెంపకానికి నెలవుగా తయారు చేసుకుంటాయి. చర్మం కింద పురుగులు నిలయమేర్పరచుకుని గుడ్లు పెడుతూ ఉంటే రోగనిరోధక వ్యవస్థ తీవ్రమైన దురద లక్షణాలతో స్పందిస్తుంది. సాధారణంగా రాత్రిపూట ఈ దురద లేదా గజ్జి మరింత పెరుగుతుంది. చిన్నపిల్లలు మరియు వృద్ధులు ఈ పురుగుల ముట్టడికి గురవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా, వేడి వాతావరణం కూడా పరిస్థితిని ప్రేరేపిస్తుంది. ఇది బాక్టీరియల్ సంక్రమణ ద్వారా సంక్లిష్టమవుతుంది, ఇది చర్మం పుళ్ళు, గుండె జబ్బులు, సెప్టిసిమియా (రక్తప్రవాహంలోకి ప్రవేశించే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్) మరియు మూత్రపిండ వ్యాధికి కూడా కారణమవుతుంది.
తగిన చికిత్సతో, దురద పురుగులు చనిపోతాయి మరియు సంక్రమణ పూర్తిగా నయమైపోతుంది. ఏమైనప్పటికీ, చికిత్స చేయకుండా వదిలేస్తే, ఈ రుగ్మత పురుగుల పునరుత్పత్తి పెరిగి రుగ్మత మరింత విషమించవచ్చు.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఈ రుగ్మత సంకేతాలు మరియు లక్షణాలు:
- నిరంతర దురద
- దద్దుర్లు (రాషెష్) లేదా పొలుసులుదేలిన చర్మం
- చర్మంపై పుళ్ళు
చర్మంపై ఎక్కడైనా గజ్జి రావచ్చు; అయితే, క్రింది భాగాల్లో గజ్జి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది:
- చేతులు, ప్రత్యేకించి గోర్లు మరియు వేళ్ళ మధ్య (వేళ్ల మధ్య చర్మం)
- చంకలు, మోచేతులు మరియు మణికట్లు
- చనుమొనలు
- గజ్జలు (గ్రోయిన్) లేక మొలభాగంలో
వ్యాధి యొక్క పొదుగుదల కాలం (అంటే వ్యాధి సోకింతర్వాత తొలి వ్యాధిలక్షణాలు కనబడ్డానికి మధ్య ఉండే సమయం) 8 వారాలు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
దురద పురుగులు ఒక వ్యక్తి నుండి మరొకరికి నేరుగా ప్రత్యక్ష చర్మ సంబంధాల ద్వారా, అలాగే పరుపు, బట్టలు మరియు ఫర్నిచర్ పంచుకోవడం ద్వారా అంటుకొంటాయి. అదేవిధంగా, ఇది తల్లి నుండి శిశువుకు ప్రసారం చేయబడుతుంది. అతిథేయి లేకుండా, ఈ గజ్జికారక పురుగు జీవితకాలం కేవలం 3-4 రోజులు మాత్రమే ఉంటుంది.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
గజ్జి రుగ్మత యొక్క నిర్ధారణ ఛాతీ మరియు జననేంద్రియ ప్రాంతం చుట్టూ దీర్ఘకాలంపాటు బాధించే గడ్డల్లాంటి పుండ్ల ద్వారా చేయబడుతుంది. చర్మం మీద వచ్చే గజ్జి గోకుళ్ళు (స్క్రాపింగ్స్) ద్వారా వచ్చే పుండుపదార్థాన్నిసూక్ష్మదర్శిని కింద విశ్లేషణ నిర్ధారణకు ఉపయోగపడుతుంది.
తగిన క్రీము మందుల్ని, లోషన్లు లేక మాత్రలు ఉపయోగించడంవల్ల గజ్జి బాధను నివారించవచ్చు. సంక్రమణ చికిత్స కోసం పైపూత ఔషధాలు మరియు లోషన్లు, క్రీములను మెడ నుండి కిందిభాగం శరీరానికి పూసేందుకు వైద్యుడిచే అందించబడతాయి.
ఇలాంటి చికిత్సే ఈ అంటువ్యాధిసోకిన వ్యక్తి యొక్క అందరు గృహ సభ్యులకు మరియు లైంగిక భాగస్వాములకు ఇవ్వబడుతుంది. చికిత్సను (మధ్య) విరమించి తరువాత దురద, గజ్జి తిరిగి బాధిస్తుండడం గమనించినట్లయితే తిరిగి చికిత్స అవసరమవుతుంది.
ఈ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు:
- శుభ్రంగా ఉండే పరుపు మరియు దుస్తులను ఉపయోగించండి.
- దుస్తులను 50 సెల్సియస్ మరియు అంతకు పైన ఉష్ణోగ్రతలో ఉతకడం.