చర్మ అంటువ్యాధులు అంటే ఏమిటి?
శరీరం మొత్తానికి చర్మం ఒక బయటి రక్షణ పొరను ఏర్పరుస్తుంది. దీని అర్ధం చుట్టూ ఉన్న పరిసరాలలో ఉన్న అన్ని ఎజెంట్లకు/పరిస్థితులకు చర్మం గురవుతుంది- రసాయనాలు, బ్యాక్టీరియా మరియు అనేక ఇతర పదార్దాలు వాటిలో ఉంటాయి. కొన్నిసార్లు, ప్రతికూల పరిస్థితుల కారణంగా చర్మానికి ఇన్ఫెక్షన్/అంటువ్యాధులు సంభవించవచ్చు.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
లక్షణాలు కారణం మీద ఆధారపడి ఉన్నపటికీ, చర్మ ఇన్ఫెక్షన్లకు కొన్ని సాధారణ సంకేతాలు ఉన్నాయి: అవి
- వాపు వలన ఎరుపుదనం మరియు దురద
- చర్మం సున్నితంగా మరియు పొడిగా మారవచ్చు
- తీవ్రమైన సందర్భాలలో చర్మం నుండి రక్తస్రావం లేదా చీము స్రవించడం కూడా జరుగుతుంది.
- ఇన్ఫెక్షన్ వృద్ధి చెందితే, చర్మం పై చిన్న బొబ్బలు లేదా పైకి ఉబ్బినట్టు ఉండే గడ్డలు/బొబ్బలు కూడా ఏర్పడవచ్చు
- క్రమంగా, చర్మం చిన్న సన్నని పొరలగా రాలిపోతుంది/ఊడిపోతుంది, లోపలి పొరలను బయటకు కనిపించేలా చేస్తుంది దాని వల్ల చర్మం రంగు మారిపోయినట్టు కనిపిస్తుంది
- కొన్ని రకాల ఇన్ఫెక్షన్లలో చర్మం పొలుసులుగా మారవచ్చు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
చర్మపు అంటువ్యాధులు బాక్టీరియా, వైరస్ లేదా ఫంగస్ వంటి సూక్ష్మజీవుల వలన సంభవిస్తాయి;
- హెర్పిస్ జోస్టర్ వైరస్ వంటి వైరస్లు చర్మ ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయి, ఉదా: చికెన్ పాక్స్ (అమ్మవారు/పొంగు) మరియు షింగల్స్. హ్యూమన్ పాపిల్లోమావైరస్ (Human papillomavirus) కూడా పొక్కుల వంటి చర్మ అంటువ్యాధులు కారణమవుతుంది.
- బాక్టీరియా పొక్కులు (గుల్లలు) మరియు కురుపులు వంటి చర్మ ఇన్ఫెక్షన్లను లేదా సెల్యులైటిస్ మరియు కుష్టు రోగం (లెప్రసి) వంటి తీవ్రమైన అంటువ్యాధులు కారణం కావచ్చు. స్టెఫైలోకోకస్ (Staphylococcus) అనే బాక్టీరియం, సాధారణంగా చర్మపు ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది.
- ఫంగల్ చర్మ అంటువ్యాధులు తామర, కాన్డిడియాసిస్ మరియు అథ్లెట్స్ ఫుట్ వంటి వాటిని కలిగి ఉంటాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్లు సాధారణంగా వేళ్ళ గోరరుల మరియు గోళ్ళ మొదలు (బేస్) మీద ప్రభావం చూపుతాయి.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
- ప్రతి సంక్రమణకు/ఇన్ఫెక్షన్ కు ఒక నిర్దిష్టమైన చర్మసంబంధ రూపం ఉంటుంది, ఇది చాలా వరకు రోగ నిర్ధారణకు సహాయం చేస్తుంది.
- శారీరక పరీక్ష తరువాత, చర్మపు గాయం/పుండు యొక్క నమూనాను సేకరించి మైక్రోస్కోప్ ద్వారా పరిశీలన చేస్తారు.
- శరీరంలోని ఇన్ఫెక్షన్ను నిర్దారించడానికి రక్త పరీక్షలు కూడా నిర్వహిస్తారు.
చికిత్స
- చిన్న/తేలికపాటి చర్మ ఇన్ఫెక్షన్లు సాధారణంగా కొన్ని వారాలలో సహజంగానే వాటికవే తగ్గిపోతాయి.
- బ్యాక్టీరియా చర్మ ఇన్ఫెక్షన్ల చికిత్సకు యాంటీబయాటిక్స్ ను ఉపయోగిస్తారు. ఇవి సమయోచితంగా, నోటి ద్వారా లేదా తీవ్రమైన సందర్భాల్లో ఇంట్రావీనస్ (నరాలలో ఎక్కించడం) గా కూడా ఉపయోగించవచ్చు.
- అదేవిధంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ల కోసం యాంటీ ఫంగల్ మందులను స్ప్రేలు, జెల్లు, క్రీమ్లు లేదా మాత్రల రూపంలో ఉపయోగించవచ్చు.
- వాపు తగ్గించడానికి, వాపు నిరోధక మందులు ఇవ్వబడతాయి.
- సంక్రమణ/ఇన్ఫెక్షన్ వ్యాప్తిని నివారించడానికి రోగిని ఇతరులకి దూరంగా ఉండాలని సూచిస్తారు, అలాగే మంచి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని కూడా సలహా ఇవ్వబడుతుంది.