సారాంశం
గొంతు మంట అనేది, పిల్లలలో అదే విధంగా పెద్దలలో కనిపించే ఒక లక్షణము. ఇది, ఔట్ పేషెంట్ విభాగాలలో డాక్టర్లు చికిత్స చేసే అత్యంత సర్వ సాధారణమైన స్థితులలో ఒకటి. బ్యాక్టీరియా మరియు వైరస్ లతో పాటుగా గొంతుమంటను కలిగించగలవి దాదాపు 200 కు పైగా సూక్ష్మజీవులు ఉన్నాయి. అతిగా జనం నివసించే ప్రదేశాలు మరియు పేదరిక జీవన పరిస్థితులు ఉన్న ప్రదేశాలు వంటి వ్యాధి సంక్రమణ లేదా పునఃసంక్రమణ ప్రమాదము అధికంగా ఉండే చోట్లలో నివసిస్తున్న పిల్లలలో తీవ్రమైన గొంతుమంట అనేది సర్వసాధారణం. గొంతుమంటకు అత్యంత సామాన్య కారణాలలో ఫ్లూ జ్వరం లేదా ఒక సాధారణ జలుబు ఒకటి. వైరల్ మరియు బ్యాక్టీరియా సంబంధిత ఇన్ఫెక్షన్లు ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి గాలి ద్వారా, అత్యంత సాధారణంగా ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి నుండి ముక్కు ద్వారా లేదా లాలాజల స్రావముల ద్వారా వ్యాపిస్తాయి. జనసమ్మర్దం ఉన్న చోట్లు, అపరిశుభ్రత, ఆహారాన్ని అనారోగ్యకరంగా చేపట్టుట, రసాయనాలు, పొగ మరియు దురద కలిగించేవాటికి గురి అగుట వంటివి గొంతుమంటను ప్రేరేపించవచ్చు. మ్రింగడానికి కష్టంగా ఉండటంతో పాటుగా, జ్వరము, చారికలు లేదా తలనొప్పి వంటి ఇతర లక్షణాలను అది తోడుగా కలిగియుండవచ్చు.
అది అనేక రకాల జబ్బుల కారణంగా ఏర్పడగలదు కాబట్టి, గొంతుమంటకు ఖచ్చితమైన కారణాన్ని మదింపు చేయడానికి ఒక వివరమైన వైద్య చరిత్ర అవసరమవుతుంది. గొంతుమంట యొక్క అత్యధిక కేసులు ఎటువంటి మందులు లేకుండానే నయమవుతాయి, అయితే అనేకమంది వ్యక్తులకు ఒక యాంటీబయాటిక్ కోర్సు అవసరమవుతుంది. స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియా వల్ల కలిగే గొంతుమంటకు తదుపరి సమస్యలు నివారించడానికి గాను తగిన విధంగా యాంటీబయాటిక్స్ తో చికిత్స చేయాల్సి ఉంటుంది. గొంతుమంట యొక్క ఇతర కారణాలకు మరింత క్లిష్టమైన మరియు వ్యాధి-నిర్దిష్ట చికిత్స అవసరం కావచ్చు. రోగి తక్షణ లేదా ఆలస్యమైన యాంటీబయాటిక్ కోర్సు తీసుకున్నదానితో నిమిత్తం లేకుండా 1% కేసులలో గొంతుమంట యొక్క సంక్లిష్ట సమస్యలను చూడవచ్చు.