సారాంశం
కడుపు గోడల (లైనింగ్) యొక్క మూడు పొరల్లో ఏదో ఒక పొరలో అసాధారణ కణాలు అనియంత్రితంగా పెరిగినప్పుడు కడుపు క్యాన్సర్ (గ్యాస్ట్రిక్ క్యాన్సర్) సంభవిస్తుంది. కడుపు (గ్యాస్ట్రిక్) క్యాన్సర్ సాధారణంగా కడుపు లోపలి పొరలో మొదలై బాహ్య (బయట) పొరలకు వ్యాపిస్తుంది. ఇది దగ్గరలోని అవయవాలు లేదా శరీరం యొక్క సుదూర భాగాలకు కూడా వ్యాప్తి చెందుతుంది. కడుపులో అనేక రకాలైన క్యాన్సర్లు సంభవించవచ్చు, వీటిలో సర్వసాధారణమైన అడెనోకార్సినోమా (adenocarcinoma). క్యాన్సర్ యొక్క కుటుంబ చరిత్ర కలిగి ఉండడం మరియు కడుపుకి సంబంధించిన ఆరోగ్య పరిస్థితులు కాకుండా, కొన్ని జీవనశైలి మరియు ఆహార ఎంపికలు కూడా వ్యక్తిని గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ప్రమాదానికి గురిచేయగలవు. ప్రారంభ దశల్లో, కడుపు (గ్యాస్ట్రిక్) క్యాన్సర్ రోగికి ఎటువంటి లక్షణాలు ఉండకపోవచ్చు లేదా అర్థంకాని బరువు తగ్గుదల లేదా అజీర్ణం వంటి లక్షణాలు ఉంటాయి. తర్వాతి (చివరి) దశల్లో బరువు పూర్తిగా కోల్పోవడం, ఆకలిలేమి లేదా అనియంత్రితమైన వాంతులు వంటి మరింత తీవ్రమైన లక్షణాలు అభివృద్ధి చెందుతాయి.
చికిత్స ఆరోగ్య చరిత్ర, వ్యాధి యొక్క పురోగతి మరియు వ్యక్తి యొక్క పూర్తి ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. క్యాన్సర్ కాలేయానికి వ్యాపించి చర్మం పసుపు రంగులోకి మారడం (కామెర్లు), కణితి కారణంగా కడుపు ద్వారముకు అడ్డంకి ఏర్పడడం, కడుపులో రక్తస్రావం, పొత్తికడుపు లేదా ఊపిరితిత్తుల చుట్టూ ద్రవం నిలిచిపోవడం (పెరిటోనియల్ మరియు ప్లూరల్ ఎఫ్యూషన్లు) అలాగే ఆకలిలేమి కారణంగా తిండి సరిపోకపోవడం వలన బలహీనత మరియు అలసట సంభవించడం. మొదట రోగ నిర్ధారణ జరిగిన సమయంలో ఉన్న వ్యాధి వ్యాప్తి పై ఆధారపడి కడుపు క్యాన్సర్ యొక్క పరిణామాలు ఉంటాయి. కడుపు క్యాన్సర్ సంభవించిన ఎవరైనా ఇద్దరు వ్యక్తులు భిన్నంగా ఉంటారు మరియు చికిత్సకు ప్రతిస్పందన ఒకవ్యక్తి నుండి మరొక వ్యక్తికి మారుతూ ఉంటుంది. సాధారణంగా, ముందుగా వ్యాధి గుర్తించబడితే, నయమయ్యే అవకాశాలు ఎక్కవగా ఉంటాయి.