ఆత్మహత్య ధోరణి అంటే ఏమిటి?
ఆత్మహత్య అంటే వ్యక్తి తన ప్రాణాన్ని తీసుకునే చర్య. ఆత్మహత్య కోరికలు లేదా భావనాల వైపు వ్యక్తి యొక్క ఆలోచనలు ఉంటే దానిని ఆత్మహత్య ధోరణి అని పిలుస్తారు.
దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఒక వ్యక్తిని చూసి అతనికి ఆత్మహత్య ధోరణి ఉందని చెప్పే ప్రత్యక్ష మార్గం ఏది లేనప్పటికీ, వ్యక్తిని గమనిస్తే అతనిలో కొన్ని హెచ్చరిక సంకేతాలు చూడవచ్చు:
- వ్యక్తి తన చుట్టూ ఉండే వాళ్ళ (కుటుంబసభ్యులు,స్నేహితులు) నుండి దూరంగా/వేరుగా ఉంటాడు, తన రోజువారీ పనుల మీద కూడా అసంతృప్తి వ్యక్తం చేయవచ్చు.
- ఒంటరి, నిస్సహాయ భావనను కలిగి ఉంటాడు మరియు వారి జీవితంపట్ల సంతోషంగా ఉండటానికి వారికి ఎటువంటి కారణం కనిపించదు.
- తరచూ మానసిక మార్పులు (mood swings) కలిగి ఉండడం కూడా ఒక సంకేతం.
- మరణం/చావు గురించి తరచూ మాట్లాడవచ్చు, మరియు దాని కోసం సిద్ధం అవుతున్నట్లు లేదా దాన్ని ప్లాన్ చేస్తున్నట్లు అనిపించవచ్చు.
- ఆత్మహత్య ఆలోచనలు కలిగిన వ్యక్తి మాదక ద్రవ్యాలు, మద్యం లేదా ఇతర వ్యసనాలను కలిగి ఉండవచ్చు.
- అపరాధభావం, నిస్సహాయత మరియు విలువలేని భావాలు సాధారణంగా ఆత్మహత్య ధోరణి ఉన్న వ్యక్తులలో గమనించవచ్చు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఎవరైనా తమ ప్రాణాన్ని ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారో అని ఒకే సాధారణ కారణాన్ని చెప్పడం కష్టం. అయితే, హెచ్చరిక చిహ్నాలుగా, ఒక వ్యక్తికి అలాంటి ఆలోచనలు వచ్చే కొన్ని ప్రమాద కారకాలు ఉన్నాయి, అవి.
- ఏదైనా భారీ నష్టం, భౌతిక గాయం లేదా ఆకస్మిక మానసిక గాయం వంటివి ఆత్మహత్య ఆలోచనలు ప్రేరేపించగలదు.
- ఆర్థిక సమస్యలు, వృత్తిపరమైన సంతృప్తి లేకపోవటం లేదా పని సంబంధిత సమస్యలు కూడా ఒక వ్యక్తిలో ఆత్మహత్య ధోరణులను పెంచవచ్చు.
- ఒక పెద్ద శారీరక లేదా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నా లేదా సుదీర్ఘమైన నయంకానీ ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే కూడా ఆత్మహత్య ఆలోచనలు కలుగవచ్చు.
- కుటుంబ వివాదాలు, గృహహింస సమస్యలు, లేదా ప్రియమైన వారితో గొడవలు ఒక వ్యక్తికి నిస్సహాయ భావన కలిగించవచ్చు మరియు ఆత్మహత్య ఆలోచనలు కలుగవచ్చు.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వ్యక్తి యొక్క ప్రవర్తన, చరిత్ర మరియు వైఖరి ఆధారంగా, ఒక నిపుణుడు వ్యక్తి యొక్క ఆత్మహత్య ధోరణిని నిర్దారించవచ్చు. వారు వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితం, ఆరోగ్య సమస్యలు, అతను ఉపయోగించిన మందుల చరిత్ర మరియు ఇతర సంబంధిత సమాచారం గురించిన వివరణాత్మక చరిత్రను తెలుసుకుంటారు.
- ఆత్మహత్య ధోరణికి చికిత్స చేయడం అంటే అటువంటి ఆలోచనలకు దారితీసే కారణానికి చికిత్స చెయ్యడాన్ని సూచిస్తుంది.
- ఇది వివిధ రకాల చికిత్స ద్వారా చేయబడుతుంది మరియు కొన్నిసార్లు మందులు కూడా అవసరమవుతాయి.
- సైకోథెరపీ (Psychotherapy) మరియు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (cognitive behavioural therapy) అనేవి సహాయపడే చికిత్సా విధానాలు.
- అంతర్లీన భౌతిక అనారోగ్యం గురించి కూడా జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం.
- అవసరమైతే యాంటీ డిప్రెసెంట్స్ (anti- depressants) వంటి మందులు సూచించబడవచ్చు.
- ఒక వ్యక్తి పాజిటివ్గా ఉండే జీవనశైలి మార్పులను చేసుకోవాలి, తమని బాధపెట్టే విషయాల గురించి ఎక్కువగా ఆలోచించరాదు, మరియు వారి అభిరుచిని బట్టి పనులు చేసుకోవడం, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం వంటి తమ మనసుకు సంతోషం కలిగించే పనులను చెయ్యాలి.