టార్డివ్ డిస్కినేసియా అంటే ఏమిటి?
కుంగుబాటు, స్కిజోఫ్రెనియా వంటి మానసిక రోగాల చికిత్సకు ఉపయోగించే యాంటిసైకోటిక్ ఔషధాలసేవనం కారణంగా శరీరంలో ఏర్పడే కండరాల అసంకల్పిత కుదుపు (jerks) కదలికలవల్ల వచ్చే అరుదైన వ్యాధి టార్డివ్ డిస్కినేసియా (TD). ఈ వ్యాధి ముఖం, శరీరం యొక్క ఎగువ అవయవాలు మరియు కొన్నిసార్లు, శరీరం దిగువ అవయవాల కండరాలను దెబ్బ తీస్తుంది. ఒకసారి ఈ టార్డివ్ డిస్కినేసియా సంభవించి శరీరంలో పాతుకుపోయింది అంటే అదింక శాశ్వతంగా ఉండిపోవచ్చు, కానీ దాని తీవ్రతను యాంటిసైకోటిక్ ఔషధాల యొక్క తక్కువస్థాయి మందుల రకాలను సేవించడం ద్వారా తగ్గించవచ్చు.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
టార్డివ్ డిస్కినేసియా సాధారణంగా ఈడ్పుల్లాంటి కదలికల అభివృద్ధిలో ప్రభావితమైన కండరాల యొక్క పేదసారంతో పాటు వస్తుంది. దీనిఇతర లక్షణాలు:
- నోటి పైకప్పుకు నాలుకను పెట్టుకోవడం
- కళ్ళు వేగంగా కొట్టుకోవడం
- నాలుకతో పెదవుల్ని (నాకడం) స్పర్శించడం (స్మాకింగ్) లేదా పెదవుల్ని గుండ్రంగా మడత పెట్టడం
- కనుబొమలు ముడిపెట్టడం
- నాలుక కొట్టుకోవడం (tongue thrusting)
- బుగ్గలు నిండా గాలి ఊడడం (puffing of cheeks)
- హార్మొనీపై వేళ్ళ కదపకం (పియానో-ప్లే కదలికలు-వేళ్ల కదలికలు)
- పాదాలతో తాళం వేయడం (పాదాల్ని లయబద్దంగా నేలకేసి తాపడం)
- వేళ్లను మూడవడం (Wiggling of fingers)
- పక్కకి వంగడం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
మన మెదడులో నాడీ కణాల మధ్య సమాచార మార్పిడి కోసం డోపమైన్ అనే న్యూరోట్రాన్స్మిటర్ విడుదల చేయబడుతుంది. ఈ నాడీ కణాలలో డోపమైన్ స్థాయిలు తగ్గిపోయినప్పుడు, చేతుల్లో ఈడ్పుల్లాంటి కదలికలు కలగడం జరుగుతుంది. సాధారణంగా, స్కిజోఫ్రెనియా, సైకోసిస్, బైపోలార్ రుగ్మతలు మరియు ఇతర వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందులు మెదడులోని డోపమైన్ స్థాయిలను తగ్గించగలవు. మూడు నెలల కంటే ఎక్కువ కాలంపాటు ఈ యాంటి-సైకోటిక్ మందుల వాడకం వలన డోపామైన్ సెన్సిటివిటీ పెరుగుతుంది, తద్వారా ఈ టార్డివ్ డిస్కినేసియా (TD) ఈడ్పుల వ్యాధి సంభవించొచ్చు.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
సాపేక్షికంగా, టార్డివ్ డిస్కినేసియా నిర్ధారించడం కష్టం, ఎందుకంటే దీని లక్షణాలు క్రమంగా ప్రారంభమవడం, ఇంకా కొన్నిసార్లు ఔషధాలను ఆపేసింతర్వాత వ్యాధి లక్షణాలు క్రమంగా ప్రారంభమవడం జరుగుతుంది గనుక. రెగ్యులర్ చెక్-అప్స్ మరియు శారీరక పరీక్ష, యాంటీ-సైకోటిక్ మందుల్ని తీసుకుంటున్నప్పుడు, ఈ జబ్బు యొక్క లక్షణాలను ముందుగా గుర్తించడానికి వీలవుతుంది. కొన్ని రక్త పరిశోధనలైన విటమిన్ B12 స్థాయిల మూల్యాంకనం, హోమోసిస్టీన్ స్థాయిల మూల్యాంకనం మొదలైనవి, సిటి (CT) మరియు ఎంఆర్ఐ (MRI) స్కాన్లతో ఇటువంటి కుదుపులాంటి (జెర్కీ) కదలికలకు కారణమయ్యే ఇతర వ్యాధులను తోసిపుచ్చవచ్చు.
సాధారణంగా, టార్డివ్ డిస్కినేసియా వ్యాధిలక్షణాలు మనిషిలో ఒకసారి కనిపించాక, ఈ లక్షణాల్ని ఇక తిప్పికొట్టడం కానీ లేదా ఈ అసంకల్పిత కుదుపుల్లాంటి కదలికల్ని ఆపడం చాలా కష్టం. అయితే, ఈవ్యాధిని మొదట్లోనే గుర్తించినట్లయితే, యాంటిసైకోటిక్స్ను మందుల్ని ఆపడం లేదా వాటి మోతాదును తగ్గించడం వంటి చర్యల ద్వారా వ్యాధి లక్షణాలు తీవ్రతను తగ్గించడంలో సహాయపడతాయి. దీనికి రెండు ఎఫ్ డి ఏ (FDA)- ఆమోదించబడిన మందులైన వాళ్బెనజినె (valbenazine) మరియు డ్యూటెట్రాబెనజిన్ (deutetrabenazine) మెదడులోని డోపామైన్ స్థాయిలు మరియు కదలికలను తగ్గించడంలో సహాయపడతాయి. తీవ్ర సందర్భాల్లో, ఈడ్పుల్ని లేదా కదలికలను నియంత్రించడానికి లోతైన మెదడు ఉద్దీపన (deep brain stimulation-DBS)ను ప్రయత్నించవచ్చు.