టెటనస్ అంటే ఏమిటి?
టెటనస్ లేదా ధనుర్వాతం (lockjaw) అనేది నాడీవ్యవస్థ సంబంధించిన ఒక పరిస్థితి. ఇది కొత్తగా తగిలిన గాయానికి లేదా బహిరంగ/తెరిచివున్న పుండుకి క్లోస్ట్రిడియం టెటాని (Clostridium tetani) అని పిలవబడే బాక్టీరియా సోకినప్పుడు తీవ్ర ఇన్ఫెక్షన్ గా అభివృద్ధి చెందే ఒక సమస్య.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
టెటనస్ యొక్క ప్రధాన సంకేతం దవడ కండరాలు బిగుతుగా లేదా ధృడంగా మారడం, అందుకే దీనికి లాక్ జా (lockjaw) అనే పేరు వచ్చింది. ప్రభావిత గాయం మరియు కండరాల చుట్టూ నొప్పిని కూడా గమనించవచ్చు. టెటనస్ యొక్క ఇతర ప్రధాన లక్షణాలు:
- అతిసారం
- అధిక శరీర ఉష్ణోగ్రత
- తలనొప్పి మరియు చెమటలు
- కండరాలు మెలిపెట్టుట మరియు గుంజుట
- మింగడం లో కఠినత
- అధిక రక్త పోటు
- హృదయ స్పందన రేటు పెరిగడం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
క్లోస్ట్రిడియం టెటని బాక్టీరియా విషాన్ని (టాక్సిన్లను) విడుదల చేయడం వల్ల టెటనస్ సంభవిస్తుంది. ఈ బ్యాక్టీరియాలు సుదీర్ఘకాలం పాటు హోస్ట్ యొక్క శరీరం వెలుపల కూడా దాని మనుగడ సాగించగలదు. ఇవి మట్టి లేదా జంతువుల యొక్క ఎరువుల (manure) లో నివసిస్తాయి. ఈ బ్యాక్టీరియా మానవ శరీరరంలోకి ఏదైనా తెగిన గాయం లేదా పుండు ద్వారా ప్రవేశిస్తుంది మరియు చాలా వేగవంతంగా సాధారణంగా, 3 నుంచి 21 రోజులలోనే వృద్ధి చెందుతుంది. ఇవి నరాలను ప్రభావితం చేసే ఒక రకమైన టాక్సిన్ ను విడుదల చేస్తాయి.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
ఒక వ్యక్తిలో పైన పేర్కొన్న లక్షణాల వంటి లక్షణాలను అభివృద్ధి చెందితే లేదా కొత్తగా (ఇటీవలి) తెగిన గాయం లేదా కాలిన గాయాల తర్వాత ఆకస్మికంగా కండరాల నొప్పి సంభవించినట్లయితే, వైద్యులు దానిని టెటానస్ గా పరిగణించవచ్చు. వైద్యులు రోగి టెటానస్ టీకాని వేయించుకున్నాడో లేదో అడుగుతారు లేదా బూస్టర్ షాట్ (booster shot) తీసుకునే సమయం దాటిపోయిందా అనే విషయాన్నీ గురించి తెలుసుకుంటారు. టోటనస్ నిర్ధారణను ధృవీకరించగల ఖచ్చితమైన పరీక్షలు అందుబాటులో లేనందున, చికిత్స లక్షణాలు మరియు వ్యక్తి యొక్క రోగనిరోధకత చరిత్రపై ఆధారపడి ఉంటుంది.
ఒక సంక్రమణ/ఇన్ఫెక్షన్ యొక్క అభివృద్ధిని నివారించడానికి గాయానికి తగినంత సంరక్షణ చెయ్యడం మరియు టెటనస్ టీకాను పొందడం వంటి నివారణ చర్యలు పాటించాలి. టెటనస్ అనేది తక్షణ మరియు అత్యవసర వైద్య చికిత్స అవసరమయ్యే ఒక అత్యవసర వైద్య పరిస్థితి (medical emergency). ఒక వ్యక్తికి ఈ బాక్టీరియా సోకినట్లయితే, టెటానస్ ఇమ్మ్యునోగ్లోబులిన్ (బ్యాక్టీరియాను చంపే యాంటీబాడీలు),పెన్సిలిన్ వంటి యాంటీబయాటిక్స్ మరియు కండరాల సడలింపు మందుల (muscle relaxants) ద్వారా చికిత్స చెయ్యడం జరుగుతుంది. తీవ్రమైన ఇన్ఫెక్షన్ విషయంలో, వ్యక్తి శ్వాస అందించడం కోసం వెంటిలేటర్ సహాయం కూడా అవసరమవుతుంది.