థ్రోంబోఫ్లీబైటిస్ అంటే ఏమిటి?
థ్రోంబోఫ్లీబైటిస్ అంటే శరీరంలోని కొన్ని భాగాలలో, సాధారణంగా కాళ్లలో, రక్తం గడ్డకట్టడం వలన వెయిన్స్ (సిర) యొక్క వాపు సంభవించే ఒక పరిస్థితి. రక్తం గడ్డకట్టడం వలన శరీరంలోని రక్త గడ్డ ఉన్న భాగంలో రక్త ప్రసరణ తగ్గిపోతుంది మరియు క్రమంగా అనేక సమస్యలకు దారితీస్తుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
రక్తం గడ్డకట్టడం మరియు శరీరంలోని ప్రభావిత భాగానికి రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల ప్రభావితమయిన భాగాల్లో వాపు వృద్ధి చెందుతుంది. థ్రోంబోఫ్లీబైటిస్ యొక్క ఇతర సంకేతాలు:
- వాపు ప్రాంతం చుట్టూ నొప్పి.
- శరీరంలో మిగిలిన భాగాలతో పోలిస్తే ప్రభావిత భాగం వెచ్చగా ఉంటుంది.
- వాపు ఉన్న ప్రాంతం సున్నితంగా మరియు ఎరుపు రంగులోకి మారుతుంది.
- ప్రభావిత భాగం నుండి వీనస్ రక్తం (venous blood) సరిగ్గా తొలగని కారణంగా చర్మం పొడిగా మారవచ్చు మరియు ఎక్జిమా (గజ్జి) కలుగవచ్చు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
అనేక కారణాల వలన వెయిన్స్ లో (సిరల్లో) రక్తం గడ్డకట్టడం జరుగుతుంది . సుదీర్ఘకాలం పాటు మంచం మీద విశ్రాంతి తీసుకోవడం లేదా ఒకే స్థితిలో కూర్చొని ఉండడం వల్ల ఇది ఏర్పడవచ్చు. ఈ పరిస్థితికి కారణమయ్యే ఇతర కారణాలు :
- పేస్ మేకర్ (గతి ప్రేరేపకం) కలిగి ఉండడం
- క్యాన్సర్
- ఊబకాయం
- గర్భం
- జనన నియంత్రణ మాత్రలు తీసుకోవడం
- తుంటి, కటి భాగం లేదా కాళ్ళ యొక్క ఇటీవల శస్త్రచికిత్స లేదా ఫ్రాక్చర్
- ఉబ్బిన (Varicose) సిరలు (వెయిన్స్)
- థ్రోంబోఫ్లీబైటిస్ యొక్క కుటుంబ చరిత్ర కలిగి ఉండడం
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
థ్రోంబోఫ్లీబైటిస్ ను సులభంగా వివరణాత్మక ఆరోగ్య చరిత్ర మరియు భౌతిక పరీక్ష ద్వారా గుర్తించవచ్చు; అయితే, రక్త గడ్డ (blood clot) ఉనికిని నిర్ధారించడానికి, వైద్యులు ఆల్ట్రాసౌండ్ (ultrasound), సిటి (CT) స్కాన్ లేదా ఎంఆర్ఐ (MRI) స్కాన్లను ఆదేశించవచ్చు. ఒక డాప్లర్ స్టడీ (doppler study) కూడా గడ్డ యొక్క ఖచ్చితమైన స్థానాన్ని మరియు తీవ్రతను గుర్తించడానికి సూచించబడుతుంది.
పరిస్థితి చిన్నగా ఉంటే (తీవ్ర అధికంగా లేకపోతే), వైద్యుడు మందులను మరియు ఉపశమనం కోసం కొన్ని సరళమైన పద్ధతులను సూచిస్తారు, అవి వీటిని కలిగి ఉంటాయి:
- వాపు నిరోధక మందులు
- మద్దతు/సహాయంగా ఉండే మేజోళ్ళు (stockings) ధరించడం
- ప్రభావిత ప్రాంతం మీద వేడిని వర్తింపచేయడం
- ప్రభావితమైన భాగానికి విశ్రాంతి కల్పించడం. అది ప్రభావితమయిన భాగం కాలు ఐతే, దానిని పైకి మరియు నిటారుగా ఉంచాలి.
అయినప్పటికీ, తీవ్రమైన మరియు ఘాడమైన థ్రోంబోఫ్లీబైటిస్ విషయంలో, రక్తాన్ని పల్చబరచే (blood thinners) మందులు సూచించబడవచ్చు మరియు వైద్యులు రక్త ప్రసరణను సరిచేసేందుకు వెయిన్లోని (సిరలోని) ప్రభావిత ప్రదేశానికి శస్త్రచికిత్స చేసి తొలగించవలసి ఉంటుంది.