టాన్సిలైటిస్ అంటే ఏమిటి?
టాన్సిలైటిస్ లేక ‘గవదకాయనొప్పి’ అంటే గొంతులో నాలుక మూలమందుండే గవదల (tonsils) యొక్క సంక్రమణ (అంటువ్యాధి). (గొంతు వెనుక వైపున ఇరువైపులా ఉండే గ్రంధుల్నే గవదలు లేక టాన్సిల్స్ అంటారు). టాన్సిలిటీస్నే ‘గళగుటికశోథ’ అని కూడా అంటారు. గవదలు లేక టోన్సీల్స్ అనేవి శోషరస వ్యవస్థలో (lymphatic system) ఒక భాగం, ఇవి మన శరీరరోగనిరోధకతను కాపాడటానికి బాధ్యత వహిస్తాయి. ఈ గ్రంధుల వాపు “గవాడకాయ నొప్పి” లేదా టాన్సలిటిస్ యొక్క వ్యాధి లక్షణాలకు దారితీస్తుంది. ఈ సంక్రమణం పిల్లల్లో సాధారణంగా ఉంటుంది, కానీ పెద్దలక్కూడా ఈ వ్యాధి వస్తుంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
టాన్సిలైటిస్ యొక్క లక్షణాలు క్రింది విధంగా ఉండవచ్చు:
- గొంతు మంట
- మెడ నొప్పి
- ఆహారాన్ని మింగడానికి ప్రయత్నించినప్పుడు నొప్పి
- జ్వరం
- గవదల్లో (టాన్సిల్స్ లో) వాపు
- చెడు శ్వాస
- గవదల పైన టాన్సిల్స్ పైన పసుపు లేదా తెలుపు రంగు పూత ఉంటుంది
- తలనొప్పి
లక్షణాలు తరచుగా బాధాకరమైనవిగా ఉంటాయి మరియు గొప్ప అసౌకర్యానికి దారితీయవచ్చు. చిన్నపిల్లలు వికారం మరియు కడుపు నొప్పి వంటి ఇతర సహలక్షణాలను అనుభవించవచ్చు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
టాన్సిలైటిస్ ఒక వైరల్ లేదా బ్యాక్టీరియల్ సంక్రమణ మరియు తరచూ ఒక జలుబు తర్వాత సంభవిస్తూ ఉంటుంది. అందువల్ల, సాధారణ జలుబు లక్షణాలైన ముక్కు కారడం, దగ్గు మరియు జ్వరం వంటివి నెమ్మదిగా మరింత తీవ్రంగా మారి టాన్సిలైటిస్ యొక్క లక్షణాలుగా మార్పు చెందుతాయి.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
గవదకాయ నొప్పికి (టాన్సిలైటిస్కు) రోగనిరోధకత (immunisation) సాధ్యం కాదు, అందువల్ల, దీన్ని అంత సులభంగా నిరోధించడం వీలు కాదు. ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఒకసారి కంటే ఎక్కువ సార్లు గవదకాయ నొప్పి (టాన్సిల్లిటిస్)తో బాధపడవచ్చు.
టాన్సిలైటిస్ యొక్క రోగ నిర్ధారణను లక్షణాల పరీక్ష ద్వారా మరియు వ్యాధికారక సూక్ష్మజీవిని గుర్తించడానికి గొంతుతేమ నమూనా లేక “త్రోట్ శ్వాబ్” యొక్క ప్రయోగశాల విశ్లేషణ ద్వారా చేయవచ్చు.
గవదకాయ నొప్పి (టాన్సిలైటిస్) బాక్టీరియా వలన సంభవించినట్లయితే, యాంటీబయాటిక్స్ తీసుకోవడం అనేది చికిత్స యొక్క అత్యంత ప్రభావవంతమైన రూపం. అయినప్పటికీ, వైరస్ (అతిసూక్ష్మజీవులు) వలన టాన్సిల్స్లిటిస్ సంభవించినప్పుడు, రోగకారకాల్ని తొలగించటానికి మందులు సహాయపడవు. ఈ లక్షణాలను తగ్గించడానికి క్రింది చర్యలు తీసుకోవచ్చు:
- జ్వరం తగ్గించడానికి పారాసెటమాల్ తీసుకోవడం
- పుష్కలంగా విశ్రాంతి పొందడం
- తగినంతగా ద్రవాలు సేవించడం
- మృదువైన ఆహారాలు తినడం
- ఉప్పు నీటితో పుక్కిలింత (గార్గ్ లింగ్) [ఎత్తడం
- నొప్పి నివారణ మందులను ఉపయోగించడం (డాక్టర్ని సంప్రదించిన తర్వాత మాత్రమే).