ఆఘాతం అంటే ఏమిటి?
ఒక వ్యక్తి మానసికంగా లేదా భౌతికంగా హానికరమైన లేదా భయపెట్టే సంఘటనను అనుభవించడంవల్ల పొందిన ఓ (దయనీయమైన) స్థితి, దాన్నే “ఆఘాతం” (ట్రామా) అంటారు. వ్యక్తి అనుభవించిన ఆ సంఘటన పరిస్థితుల సమాహారం కావచ్చు. ఆ వ్యక్తి అనుభవించిన ఈ సంఘటన ఆ వ్యక్తి యొక్క సాంఘిక, భావోద్వేగ, భౌతిక పనితీరు మరియు శ్రేయస్సుపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఒక బాధాకరమైన లేదా ఆఘాతకర సంఘటనకు మానసిక ప్రతిస్పందనలు:
- తగ్గిన జ్ఞాపకశక్తి (మెమరీ) మరియు ఏకాగ్రత
- జరిగిన ఆ సంఘటన గురించి చెదిరిన ఆలోచనలు
- గందరగోళం
- పునరావృతంగా మనస్సులో ఆడుతున్న సంఘటన యొక్క భాగాలు
- బాధాకరమైన ఆ సంఘటన యొక్క భాగాలు మనసులో పునరావృతంగా గుర్తుకొస్తుంటాయి.
ఓ బాధాకరమైన సంఘటనకు భౌతిక స్పందనలు:
- చెదిరిన నిద్ర క్రమాలు
- మైకము, వికారం మరియు వాంతులు
- తలనొప్పి
- విపరీతంగా చెమట పట్టడం
- పెరిగిన హృదయ స్పందన రేటు
బాధాకరమైన సంఘటనకు ప్రవర్తనా ప్రతిస్పందనలు:
- ఆకలి మార్పులు
- సాధారణ నిత్యకృత్యాల నుండి దూరంగా జరిగిపోవడం
- నిద్ర సమస్యలు
- చేతరించుకునేందుకు (రికవరీకి) సంబంధించిన విధుల్లో నిమగ్నమవడం
- సిగరెట్, మద్యం (ఆల్కాహాల్) మరియు కాఫీ సేవనం యొక్క అలవాట్లు చేసుకుంటారు
- ఆ సంఘటన గురించిన ఆలోఛన్లను ఆపడానికి అసమర్థత
- ఆ సంఘటనతో సంబంధం ఉన్న ఏ జ్ఞాపకాలను అయినా నిరోధించడం
బాధాకరమైన సంఘటనకు భావోద్వేగ స్పందనలు:
- భయం, ఆందోళన, మరియు భయం
- భావోద్వేగ భావన లేకుండడం
- ఆఘాతం లేక దిగ్భ్రాంతి స్థితి
- గందరగోళం మరియు వేరుచేయబడిన భావన
- సహచరుల నుండి దూరంగా ఉండటం మరియు వారితో కలిసుండాలని కోరుకోకపోవడం
- ఆ సంఘటన ఇంకా ఇప్పటికీ జరుగుతోంది మరియు చుట్టూ ప్రమాదం ఉందన్న భావన
- ఆ సంఘటన ముగిసిన తర్వాత అలసట యొక్క భావం కల్గడం
- ఆ సంఘటన ముగిసిన తర్వాత మానసికంగా న్యూనతకు గురవడం
- న్యూనతకు గురైనదశలో అపరాధ భావం, నిరాశ, తప్పించుకుతిరగడం మరియు అతి సున్నితత్వం వంటి భావాలను అనుభవిస్తారు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఈ కింది సంఘటనలను అనుభవించడం ఒక వ్యక్తిలో ఒక బాధాకరమైన స్పందనను ప్రేరేపిస్తుంది:
- నష్టం
- భౌతిక మరియు లైంగిక వేధింపు
- సాంఘికపరమైన, కౌటుంబిక (domestic), కార్యాలయ హింస
- క్రైమ్
- ప్రకృతి వైపరీత్యాలు
- లేమి యొక్క భావం (Feeling of deprivation)
- బాధాకరమైన దుఃఖం
- వైద్య విధానాలు, గాయం లేదా అనారోగ్యం
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
నెల కన్నా ఎక్కువ కాలం పాటు వయోజనుడైన వ్యక్తి పేర్కొన్న ఈ లక్షణాలను కలిగి ఉన్నప్పుడు ఆఘాతం యొక్క వ్యాధి నిర్ధారణను చేస్తారు:
- కనీసం రెండు ప్రతిచర్యశీలత మరియు ప్రేరేపక లక్షణాలు
- తిరిగి ఎదుర్కొంటున్న వ్యాధిలక్షణాల్లో కనీసం ఒకటి
- కనీసం రెండు మానసిక (మూడ్) మరియు జ్ఞానసంబంధ (cognition) వ్యాధిలక్షణాలు
- కనీసం (avoidance symptom) ఒక ఎగవేత లక్షణం
కిందివాటిని ఉపయోగించి ఆఘాతాన్ని నిర్ధారిస్తారు:
- బుద్ధికి సంబంధించిన నడవడిక చికిత్స(కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ)
- ఎక్స్పోజర్ థెరపీ (ఆందోళన రుగ్మతలకు చేసే చికిత్స)
- కాగ్నిటివ్ రీస్ట్రుక్చరింగ్ (మేధావికాస పునర్నిర్మాణం)
- సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్ (ఓ పధ్ధతి ప్రకారం గ్రాహకతను తగ్గించడం)
- ఆందోళన నిర్వహణ
- ఒత్తిడి తగ్గించే చికిత్స
- ఐ మూవ్మెంట్ డీసెన్సిటైజేషన్ మరియు రీప్రోసెసింగ్ (కంటి కదలికల గ్రాహకతను తగ్గించడం మరియు రేప్రొసెస్సింగ్
- కుంగుబాటు నివారణా మందులు (యాంటిడిప్రెసెంట్స్) మరియు ఇతర మందులు.