కృష్ణపటలశోథ (యువెటిస్) అంటే ఏమిటి?
కంటిలోని కృష్ణపటలం లేక నల్లగుడ్డు (Uvea) వాపెక్కి మంట కలగడం మరియు దాని పరిసరభాగంలోని కణజాలం కూడా వాపుదేలడం, మంట పెట్టడాన్నే “కృష్ణపటల శోథ” (Uveitis)గా పిలుస్తారు. ఈ రుగ్మత ఒక కన్ను లేదా రెండు కళ్ళనూ దెబ్బ తీయొచ్చు. సరైన సమయంలో చికిత్స చేయకపోతే ఇది అంధత్వానికి దారితీస్తుంది. కృష్ణపటలశోథ (నల్ల కనుగుడ్లు వాపు) ఏర్పడ్డ భాగాన్నిబట్టి ఈ రుగ్మత మూడు రకాలు- ముందుభాగం (anterior), మధ్యభాగం (intermediate) మరియు వెనుకభాగం (posterior) ఉంటాయి. కొన్ని సందర్భాల్లో, కంటి నల్లగుడ్డులోని ఈ మూడు పొరలు (అంటే ముందు, మధ్య, వెనుకభాగం) కూడా రుగ్మతకు గురవుతాయి. ఈ కంటి రుగ్మత ఆకస్మికంగా సంభవించొచ్చు మరియు స్వల్పకాలికమైందిగా, తీవ్రమైనదిగా లేదా దీర్ఘకాలికమైన కంటిజబ్బుగా కూడా కొనసాగుతుంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
దీని సాధారణ చిహ్నాలు మరియు లక్షణాలు కొన్ని:
- తగ్గిన దృష్టి
- అస్పష్టమైన లేదా మసకబారిన దృష్టి
- మచ్చలు నల్లగా కనిపిస్తాయి మరియు కంటిచూపులో ద్యోతకమవుతూ ఉంటాయి
- కాంతికి సున్నితత్వం లేదా ఫోటోఫోబియా
- కన్ను ఎరుపెక్కడం మరియు నొప్పి పెట్టడం
- తలనొప్పి
- చిన్న కనుపాపలు (small pupil)
- నల్లకనుగుడ్డు (Iris) యొక్క రంగు మారుతుంది
- కళ్ళలో నీరు కారడం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
కృష్ణపటలశోథ (యువెటిస్) యొక్క ఖచ్చితమైన కారణం తెలియదు. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ కళ్ళతో సహా వివిధ కణజాలాలపై దాడి చేసే స్వయం ప్రతిరక్షక పరిస్థితుల్లో సాధారణంగా ఈ కంటిరుగ్మత కనిపిస్తుంది. దీనికి కొన్ని కారణాలు క్రింది విధంగా ఉన్నాయి:
- క్రోన్స్ వ్యాధి
- అల్సరేటివ్ కొలిటిస్
- ఎయిడ్స్ లేదా హెచ్ఐవి సంక్రమణ
- హెర్పెస్
- లైమ్ వ్యాధి
- సిఫిలిస్
- క్షయ
- రుమటాయిడ్ ఆర్థరైటిస్
- సోరియాసిస్
- జువెనైల్ ఆర్థరైటిస్
- కంటికి గాయం
- విషపదార్థానికి కన్ను బహిర్గతమవ్వడం, ఆ విషం కాంతిలోనికి చొచ్చుకుని పోవడం
- ధూమపానం
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
డాక్టర్ కంటిని భౌతికంగా తనిఖీ చేస్తారు, వ్యక్తి పొగమంచుకమ్మినట్లుండే దృష్టిని కల్గి ఉన్నారా లేదా స్పష్టమైన దృష్టిని కలిగిఉన్నారా అనేదాన్ని పరిశీలిస్తారు. కొన్ని పరీక్షలు కూడా నిర్వహిస్తారు, అవి:
- సాధారణ రక్త పరీక్షలు ద్వారా తెల్ల రక్త కణాలు లెక్కింపు మరియు ప్రోటీన్ స్థాయిలు తనిఖీ
- వివరణాత్మక శారీరక పరీక్షతోపాటు పూర్తి వైద్య చరిత్రను గుర్తించడం
- స్కిన్ పరీక్షలు
- కంటి ద్రవాల పరీక్ష
రోగనిర్ధారణ తరువాత, రోగిని వివిధ పద్ధతుల ద్వారా చికిత్స చేస్తారు, ఆ పద్ధతులివి:
- కార్టికోస్టెరాయిడ్ మందులు వాపు తగ్గించడంలో సహాయపడతాయి.
- మిడ్రియాటిక్ ఐ డ్రాప్స్ మందును కనుపాపను విస్తరించేందుకు ఉపయోగిస్తారు.
- సంక్రమణ విషయంలో, యాంటీబయాటిక్స్ ను వ్యాధిని నియంత్రించడానికి ఇస్తారు.
- దృష్టి కోల్పోయే ప్రమాదం ఉన్నట్లయితే, ఇమ్యునోస్ప్రెసెంట్స్ సూచించబడవచ్చు.
- నల్ల కల్లద్దాలను కాంతి సున్నితత్వానికిగాను వాడవచ్చు.