టెంకాయ లోని కొబ్బరి నుండి తీసేదే కొబ్బరి నూనె. పండిన టెంకాయలో లభించే కండ లేక గుజ్జు వంటి రుచికరమైన మరియు మనం తినదగిన భాగమే కొబ్బరి. మార్కెట్లో వివిధ రకాల కొబ్బరి నూనెలు లభిస్తాయి, కొబ్బరి నుండి నూనెను సేకరించేందుకు చేపట్టే పధ్ధతిని బట్టి కొబ్బరి నూనె రకాలుంటాయి. కొబ్బరి నూనెలో సాధారణ రకాలు శుద్ధి చేసిన కొబ్బరి నూనె మరియు శుద్ధి చేయని (unrefined) కొబ్బరి నూనె అనే రకాలు ఉంటాయి.
కొబ్బరి నూనె గది ఉష్ణోగ్రత వద్ద సాధారణంగా గడ్డ కట్టి ఉంటుంది, ఎందుకంటే దాని అధిక ద్రవీభవన ఉష్ణోగ్రతా స్థానం - 76 ఫారిన్ హీట్ డిగ్రీలు. సరి అయిన రీతిలో భద్రపరిస్తే కొబ్బరి నూనె ఒక స్థిరమైన నిల్వ సామర్థ్యం (షెల్ఫ్ లైఫ్) కల్గి ఉంటుంది. కొబ్బరి నూనె కొవ్వు ఆమ్లాల ప్రత్యేకమైన సమ్మేళనం మరియు మానవ శరీరంలో సానుకూల ప్రభావాలను కలిగిస్తుంది. అందువల్ల, ఈ నూనె వంటల్లో (తినడానికి) వాడటం కోసం బాగా అనుకూలంగా ఉంటుంది మరియు చర్మం మరియు జుట్టుకు తేమను కల్గించే ఏజెంట్ గా కూడా ఉపయోగపడుతుంది.
కొబ్బరి నూనె గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు:
- కొబ్బరికాయ (టెంకాయ) శాస్త్రీయనామం: కొబ్బరి నూనెను కొబ్బరి నుండి సేకరించబడుతుంది. కొబ్బరి శాస్త్రీయ నామం కోకోస్ న్యూసిఫెరా (Cocos Nucifera).
- కుటుంబం పేరు: కొబ్బరి చెట్టు అరెకాసియా అని పిలువబడే తాటి చెట్టు కుటుంబానికి చెందినది.
- సామాన్యమైన పేరు: హిందీలో నారియల్ తేల్ (Nariyal tel), కొబ్బరి నూనె
- స్థానిక ప్రాంతం: ప్రపంచంలోని 90 కంటే ఎక్కువ దేశాలు కొబ్బరి చెట్లను పెంచుతున్నాయి. ప్రపంచంలో కొబ్బరి నూనెను ఉత్పత్తి చేసే అతిపెద్ద ఉత్పత్తిదారు ఫిలిప్పీన్స్ దేశం, తరువాత ఇండోనేషియా మరియు భారతదేశం కొబ్బరినూనె ఉత్పత్తిలో వరుసగా రెండు, మూడో స్థానాల్ని ఆక్రమిస్తాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, కర్నాటక, గోవా, ఆంధ్రప్రదేశ్ మొదలైనవి భారతదేశంలో కొబ్బరి చెట్లని పెంచే కొన్ని రాష్ట్రాలు. కోకోనట్ డెవెలప్మెంట్ బోర్డ్ అఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి 2014-15 గణాంకాల ప్రకారం, దక్షిణ భారతదేశంలో కేవలం 4 రాష్ట్రాలు భారతదేశంలో మొత్తం కొబ్బరి ఉత్పత్తిలో 90% వాటాని కలిగివున్నాయి. కోయంబత్తూర్ మరియు తిరుపూర్ లు భారతదేశంలో అతి పెద్ద కొబ్బరి ఉత్పత్తిదారులు.
- కొబ్బరిని గురించిన కొన్ని ఆసక్తికరమైన నిజాలు: కొబ్బరికాయ (coconut) యొక్క పుట్టుక (మూలం) గురించి సమాచారం తెలియదు, కానీ శాస్త్రవేత్తల ప్రకారం, కొబ్బరి అనేది దక్షిణ పసిఫిక్ నుండి వచ్చిన ఒక చరిత్రపూర్వకాలపు మొక్క. వాస్కో డా గామా యొక్క ఓడలో ఉన్న నావికులు కొబ్బరిచెట్టుకు దానికా పేరును (కోకోనట్) పెట్టి ఉంటారని నమ్ముతారు.