గర్భధారణ అనేది చాలామంది మహిళలకు ఒక జీవితం మార్పు చెందే అనుభవం. గర్భధారణ సమయంలో ఒక మహిళ తన ఆహారాన్ని విధానాన్ని జాగ్రత్తగా ప్రణాళిక చేసుకుంటుంది. అలాగే, ప్రసవం తర్వాత కూడా ఆరోగ్యకరమైన ఆహార విధానం పాటించడం కూడా అంతే అవసరం. నిజానికి, ప్రసవం తరువాత అనుసరించవలసిన ఆహార విధానంపై, ఇంకా ఎక్కువ శ్రద్ధ అవసరం ఎందుకంటే తల్లి శిశువుకి చనుబాలు ఇవ్వవలిసిన బాధ్యత కలిగి ఉంటుంది. అంతేకాక, ఆమె రోజువారీ కార్యకలాపాలకు బలం మరియు శక్తి కూడా అవసరమవుతుంది, అందువల్ల అన్ని అవసరమైన పోషకాలను కలిగి ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవడం సహాయకరముగా ఉంటుంది.
గర్భధారణ సమయంలో తల్లులు చాలామంది బరువు పెరగవచ్చు. సాధారణంగా ప్రసవం తర్వాత తల్లులు అదనపు బరువును తగ్గించుకోవడానికి చర్యలు తీసుకోవాలని కోరుకుంటారు. పోషకరమైన ఆహారం దానిని సాధించడంలో కూడా సహాయపడుతుంది.
ప్రసవం తరువాత, స్త్రీలో పాలిచ్చే సమయం ప్రారంభమవుతుంది కాబట్టి ఆమె శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు జరుగుతాయి. ప్రసవం తర్వాత తీసుకునే ఆహారం సరిగ్గా చనుబాలివ్వడానికి సహాయాన్ని అందించే పోషకాలను కలిగి ఉండాలి, ఎందుకంటే ఇది నవజాత శిశువుకు పోషకాహారం అందే ఒకే ఒక మార్గం. ఈ వ్యాసం తల్లి మరియు శిశువులకు ఉపయోగకరంగా ఉండే ఆహారపదార్దాలు మరియు పోషకాల గురించి వివరిస్తుంది.