కరివేపాకు చెట్టు ప్రధానంగా ఉష్ణమండం నుండి ఉపఉష్ణమండల ప్రాంతాల చెట్టు. శ్రీలంక మరియు భారతదేశానికి చెందినడి, ఇది రుటాసియే కుటుంబానికి చెందినది, సదాపచెట్టు, సాటిన్వుడ్ మరియు నిమ్మజాతి మొక్కలు కూడా ఈ కుటుంబానికి చెందుతాయి. 4-6 మీటర్ల పొడవు పెరిగే ఒక చిన్న చెట్టు ఇది, దీని కాండము సుమారు 40 సెంమీ వ్యాసం కలిగి ఉంటుంది. వాసనతో కూడిన కరివేపాకులు, కరివేపాకు చెట్ల కొమ్మలపై జంటలుగా అమర్చబడి ఉంటాయి. ప్రతి రెమ్మ 11-21 ఆకులను కలిగి ఉంటుంది. కరివేపాకు మొక్క స్వీయ పరాగసంపర్కం చేసుకునే చిన్న తెలుపు పువ్వులు కలిగి ఉంటాయి. కూర మొక్క యొక్క పండు ఒక చిన్నగా మరియు మెరిసే-ముదురు రంగులో ఉంటుంది. ఈ పండులో ఒకే పెద్ద విత్తనం ఉంటుంది. ఈ పండు యొక్క గుజ్జును తినవచ్చు. ఇది తీపి రుచితో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. సాధారణంగా, పండు గుజ్జును లేదా విత్తనాన్ని వంట కోసం ఉపయోగించరు.
మసాలాలలో ఉపయోగించే ప్రధాన భాగం కావడంతో, కరివేపాకులను భారత దేశపు దక్షిణ మరియు పశ్చిమ తీర ప్రాంతాలలోని అత్యంత ముఖ్యముగా ఉపయోగిస్తారు . వండినప్పుడు, కరివేపాకులు ప్రత్యేకమైన వాసనను కలిగిస్తాయి, మరియు వంటకానికి ప్రత్యేక రుచిని అందిస్తాయి. ఇది భారతదేశం, శ్రీలంక మరియు సమీపంలోని దేశాల్లో చాలా సాధారణమైనది. శ్రీలంక వంటలలో, వంట మొదలు పెట్టె ముందు, ముందుగా ఈ ఆకులను, కొన్ని ఆవాలను మరియు కొన్ని చిన్న ముక్కలుగా ఉల్లిపాయను కలిపి వేయిస్తారు. కరివేపాకులను సాంబార్, రసం, వడ వంటి అనేక దక్షిణాది భారతీయ వంటకాలలో కూడా వాడతారు. ఉత్తర భారత వంటకం అయిన కఢీ తయారీలో వీటిని కూడా ఉపయోగిస్తారు.
వీటిని కూరల తయారీలో ప్రధానంగా ఉపయోగిస్తారు కాబట్టి కరివేపాకులకు ఆ పేరు వచ్చి ఉండవచ్చు. పలు భారతీయ భాషలలో వీటిని 'తీపి వేప ఆకులు' అని కూడా పిలుస్తారు. వేపాకులు మేలియాసీఏ (Meliaceae) కుటుంబానికి చెందినవి మరియు సాధారణంగా చేదుగా ఉంటాయి అయితే, కరివేపాకు మొక్క రుటాసియే కుటుంబానికి చెందినది.
ఇది ప్రధానంగా వంటకాలలో ఉపయోగించినప్పటికీ, ఆయుర్వేద మరియు సిద్ధ వైద్య విధానాలలో కరివేపాకులను వాటి చెక్కెర వ్యాధి వ్యతిరేక (యాంటీడైయాబెటిక్) లక్షణాల కోసం విస్తృతంగా ఉపయోగిస్తారు. అయినప్పటికీ, దీనికి అధారాలు ధృడంగా లేకపోవడం వలన దీని పై మరింత పరిశోధన అవసరం. తులసి ఆకులకు ప్రత్యామ్నాయంగా ఆచారాలు మరియు పూజలలో కూడా వీటిని ఉపయోగిస్తారు.
కరివేపాకు (మొక్క) గురించి ప్రాథమిక వాస్తవాలు:
- శాస్త్రీయ నామం: ముర్రయ కోయినిగి (Murraya koenigii)
- కుటుంబం: రూటేసియే (Rutaceae)
- సాధారణ నామం: కర్రీ లీవ్స్, హిందీలో కడిపత్త
- సంస్కృత నామం: గిరినిమ్బా
- ఉపయోగించిన భాగాలు: ఆకులు
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: ఈ ఆకులను ప్రధానంగా భారతదేశం యొక్క పశ్చిమ మరియు దక్షిణ భాగాలలో విస్తృతంగా ఉపయోగిస్తారు. భారతదేశంనుండి వలస వెళ్లిన వారు ఆసియాలోని వివిధ దేశాలలో కరివేపాకులను ఒక ఇంట్లో పెంచుకునే మొక్కగా పరిచయం చేసారు. ఈ రోజుల్లో, భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఫిజీ, బర్మా, మలేషియా, యూరప్, దక్షిణాఫ్రికా మరియు యునైటెడ్ స్టేట్స్లలో కూరగాయల మార్కెట్లలో మరియు దుకాణాలలో తాజా కరివేపాకులను సులభంగా కనుగొనవచ్చు.