ఏలకికాయ (ఏలకులు లేక యాలకలు-బహువచనం) అని పిలువబడే ఈ ఆకుపచ్చని చిన్న (బుడ్డవంటి) కాయలో నల్లని విత్తనాలుంటాయి, అవే యాలకలు. ఇది ఒక సుగంధద్రవ్యం లేక మసాలా దినుసు. ఈ పురాతన సుగంధ ద్రవ్యం దక్షిణ భారతదేశంలోని పశ్చిమ కనుమలలో పుట్టింది. నేటి ఆధునిక కాలంలో దీని ఉత్పత్తి ఇండో చైనా ప్రాంతం దేశాలు, టాంజానియా, గ్వాటెమాల మరియు శ్రీలంక వంటి దేశాలకు వ్యాపించింది. పురాతనకాలంలో యాలకల్ని పలురకాలుగా ఉపయోగించారు. యాలకల్ని ఈజిప్షియన్లు పండ్లను శుభ్రపరిచేందుకు ఉంపయోగించగా, గ్రీకులు మరియు రోమన్లు దీన్నిసుగంధ ద్రవ్యంగా ఉపయోగించేవారు. ఇలా పురాతనకాలంలోనే దీని ఉపయోగాలు పలు విధాలుగా ఉండేవి.
కుంకుమపువ్వు మరియు వనిల్లా తరువాత ఏలకికాయ (యాలకలు) అత్యంత ఖరీదైన మసాలా. నేడు నేపాల్ ఏలకులు, సియామ్ కార్డమమ్, బాస్టర్డ్ కార్డమమ్ మరియు వింగ్డ్ జావా కార్డమమ్ వంటి తక్కువరకం ప్రత్యామ్నాయాలు యాలకలతో సమానంగా మార్కెట్లో లభిస్తున్నాయి. అయితే, ఎలెట్టేరియా ఏలకులు ఏలకుల ఏకైక నిజమైన రూపం, అంటే నిజమైన యాలకలుగా పరిగణించబడుతాయి. భారతదేశంలో మలబార్ ఎడారి యాలకలు మరియు మైసూర్ యాలకులు అని రెండు ప్రధాన రకాలైన యాలకలున్నాయి.
ప్రపంచంలోనే గ్వాటెమాల యాలకల్ని అతి హెచ్చు ప్రమాణంలో ఉత్పత్తి మరియు ఎగుమతి చేసే దేశం. గ్వాటెమాల తరువాత, భారతదేశం మరియు శ్రీలంకలు యాలకల్ని హెచ్చు ప్రమాణంలో ఉత్పత్తి చేసి ఎగుమతి చేసే దేశాలు. భారతదేశంలో పెద్ద మొత్తంలో యాలకుల (కార్డమమ్స్)ను ఉత్పత్తి చేసే రాష్ట్రం కేరళ, మొత్తం భారత దేశం యొక్క యాలకల ఉత్పత్తిలో 70% వాటా కేరళదే. కేరళ తరువాత కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాలు యాలకల ఉత్పత్తి రాష్ట్రాలుగా పేరుకెక్కాయి.
యాలకలు మధుర సువాసనను కలిగి ఉంటుంది, అందువల్లనే ఇది చాలా సంప్రదాయ భారతీయ వంటకాలతో విడదీయరాని బంధాన్ని ముడివేసుకుని ఉంది. యాలకల్ని ప్రధానంగా కూరలు మరియు బియ్యంతో వండే వంటలలో భారతీయులు వాడుతున్నారు. చాలా రకాల భారతీయ వంటకాల్లో యాలకల సువాసన అనేది అత్యంత సాధారణమైంది. అదే సమయంలో, రుచిపరంగా, భారతీయులు యాలకల్ని ఓ 'పండుగ' మసాలాగా భావిస్తారు. కొన్ని భారతీయ తీపి పానీయాల్లో యాలకుల్ని ఒక నిర్ణీత సువాసననిచ్చే ద్రవ్యంగా వాడబడుతోంది.
భారతీయ భోజనంలో, యాలకల్ని వాటిపై ఉండే తోలును తీసేసి విత్తనాల్ని మాత్రమే సాధారణంగా వాడటం జరుగుతుంది. యాలకుల కాయలు రుచిలో తటస్థంగా ఉంటాయి మరియు ఈ యాలకల్ని వాటిపై ఉండే తోలును తొలగించకుండా అలాగే వంటలో వేస్తే అవి ఆ వంటకు తినేటపుడు అసౌకర్యాన్ని కల్గిస్తాయి.
ఏలకులు గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు:
- శాస్త్రీయ (సైంటిఫిక్) నామం: ఎలెట్టేరియా కార్డమం మాటోన్ (Elettaria cardamomum Maton)
- కుటుంబం: జిన్గీబెర్సీఎ (Zingiberaceae)
- సాధారణ పేరు: యాలకులు, ఇలాచి
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: దక్షిణ భారతదేశంలోని పశ్చిమ కనుమలలో ఉన్న సతత హరితమైన అడవులలో యాలకల్ని ఎక్కువగా సాగు చేస్తారు. భారతదేశంతో పాటు, యాలకులు, గ్వాటెమాల, టాంజానియా, ఎల్ సాల్వడార్, వియత్నాం, లావోస్, కంబోడియా మొదలైన దేశాల్లో వాణిజ్యపరంగా సాగు చేయబడుతోంది. తూర్పు నేపాల్, డార్జిలింగ్, సిక్కిం మరియు దక్షిణ భూటాన్లో కూడా యాలకల్ని ఓ ప్రధానమైన పంటగా సాగు చేస్తున్నారు.