మనలో ప్రతి ఒక్కరం కనీసం ఒకసారయినా ప్లేట్ నిండా తియ్య-తియ్యని జామపండ్లపై ఉప్పు-కారం (లేక చాట్ మసాలాను) జల్లుకుని వాటిని మనసారా తిని ఆస్వాదించి ఉండమా? జామను తింటున్నప్పుడు మత్తెక్కించే దాని మధురమైన రుచి మరే ఇతర పండూ దానికి సాటి రాదనుకుంటాం. జామపండుతో చేసిన అనేక ఇతర పదార్థాలైన తియ్యని జామ్లు, జెల్లీలు, ప్యూర్లు, మకరందాలు, జామ కేకులు, రసాలు, మరియు మురబ్బాలు జామ లక్షణాలను కలిగి తీపి మరియు సువాసనతో కూడి రుచులూరిస్తాయి.
హిందీలో జామపండును ‘అమౄద్’ గా కూడా పిలుస్తారు.జామపండ్లు మధ్యలో కొద్దిగా కఠినమైన విత్తనాలను కలిగి ఉంటాయి. వాస్తవానికి, జామ విత్తనాలు పంటి కింద పడి కారకరలాడకపోతే జామపళ్ల రుచి మనకు పూర్తి తెలియకపోవచ్చు. జామ ఒక ఉష్ణమండల పండు మరియు ఇది ఉపఉష్ణమండల పరిస్థితులకు బాగా పెరుగుతుంది. జామ పండు ఆవిర్భావం మధ్య అమెరికాలో జరిగిందంటారు, ఇక్కడ దీనిని "స్యాండ్ ప్లం" అని పిలుస్తారు. ప్రారంభ స్పానిష్ మరియు పోర్చుగీసు వలసదార్లు దీన్ని ప్రంపంచంలో కొత్తప్రాంతాలకు పరిచయం చేశారు. ఆ విధంగా, ఈస్ట్ ఇండీస్ మరియు గుయాం ప్రాంతాలకు జామ పండు దిగుమతి అయింది. ఇది తరువాత ఆసియాలో మరియు ఆఫ్రికా యొక్క ఉష్ణ మండలాలలో ఓ పంటగా ఆమోదించబడింది మరియు ప్రస్తుతం జామను ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండలాలలో విస్తృతంగా పండిస్తున్నారు.
అనానస్ (పైనాపిల్ను) పండును ‘పండ్లలో రాజు’ అని పిలిస్తే జామను ‘పండ్లలో రాణి’ అని పిలుస్తారు. పసుపు, గులాబీ మరియు ఎరుపు రంగుల్లో చిన్నవిగా, గోళాకారంగా లేదా అండాకారంలో (ఓవల్) జామపండ్లు మెత్తని గుజ్జుతో తియ్యగా సువాసనాభరితంగా తినడానికెంతో బాగుంటాయి. జామపండు యొక్క వైవిధ్యతే దానికి లెక్కింపును గుర్తింపును తెస్తోంది. ఇది భారతదేశం యొక్క మొట్టమొదటి సాధారణ మరియు ముఖ్యమైన పండ్లలో ఒకటి. మామిడి, నిమ్మజాతి పండ్లు (సిట్రస్), అరటి మరియు ఆపిల్ తర్వాత భారతదేశంలోని ఐదవ అతి ముఖ్యమైన పండుగా జామ పరిగణించబడుతుంది. కేవలం చిరుతిండి కోసం ముక్కలుగా చేసి తిన్నా లేదా సలాడ్లకు జోడించి తిన్నా జామపండ్లు రుచిలో అద్భుతమైనవి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో, జామ ఒక చీజ్ లాగా సృష్టించబడిన ఒక మందపాటి, సువాసనాభరితమైన (flavourful) పేస్ట్ గా ప్రసిద్ధి చెందింది. సహజమైన మరియు తాజా జామ రసం హవాయి దేశంలో సాధారణంగా ఉంటుంది. ఫిజీ దేశంలో, జామపండ్లను రుచికరమైన జెల్లీని తయారు చేయడానికి ఉపయోగిస్తారు.
జామ దాని విలక్షణ రుచి మరియు సువాసనకు ప్రసిద్ధి చెందింది. అంతేగాక, ఈ పండులో ఉన్న వివిధ ఆరోగ్య ప్రయోజనాల కారణంగా, జామ పండు కూడా సూపర్ ఫ్రూట్లలో ఒకటిగా పరిగణించబడింది. ఈ సున్నితమైన పండు చర్మం యొక్క ఆరోగ్యానికి మరియు రోగనిరోధకతకు సహాయపడుతుంది, ఎందుకంటే దీనికో అస్కొర్బిక్ ఆమ్లం, లైకోపీన్ మరియు అనామ్లజనకాలు వంటివి సమృద్ధిగా ఉంటాయి. వాస్తవానికి, జామ పండులో అత్యధికంగా ఉండే విటమిన్ సి మరియు ఖనిజాల కారణంగా దీన్ని ఉష్ణమండల ఆపిల్ పండుగా పరిగణించబడుతోంది. జామపండ్లు పోషకాలకు మరియు మాంగనీసుల గొప్ప నిలయం. దీనిలోని ఈ మాంగనీసు మనం తినే ఆహారం నుండి పొందే వివిధ కీలక పోషకాలను శరీరంలో కలిసిపోయేలా చేయడంలో సహాయపడుతుంది. జామపండులో “ఫెలేట్” అనే ఖనిజం పుష్కలంగా ఉంటుంది, ఇది సంతానోత్పత్తిని ప్రోత్సహించే ఒక ఖనిజము. కనుక, లైంగికపరంగా జామవల్ల సిద్దించే ఆరోగ్యప్రయోజనాల్ని అందులోని ఫెలేట్ కారణంగానేనని చెప్పవచ్చు. ఇంకా, జామలో ఉన్న పొటాషియం రక్తపోటు స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఆసక్తికరంగా, అరటి మరియు జామ-ఈ రెండు పండ్లలోనూ పొటాషియం దాదాపు ఒకే ప్రమాణంలో ఉంటుంది.
అనేక పర్యావరణ పరిస్థితులు మరియు పండే నేల పరిస్థితులకు తట్టుకునే మంచి సామర్ధ్యం కలిగిన చవకైన పోషక ఫలంగా జామ అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఖచ్చితంగా పండించేందుకు ఓ అనువైన పంట. జామ గట్టిగా ఉండే పండే గాక పండుశాతాన్ని (కండరభాగం) బాగా కల్గిన ఓ మంచి ప్రతిఫలకరమైన పండు. జామ పంట దాన్ని పండించే ప్రతి యూనిట్ ప్రాంతానికి మంచి రాబడిని అందిస్తుంది మరియు దేశమంతటా దీన్ని పండించొచ్చు. వ్యవసాయపరంగా, బావులు, బోరుబావులకు దగ్గరగా జామను ఓ వాణిజ్యపంటగా ప్రతిచోటా పండించొచ్చు.
జామ గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు:
- శాస్త్రీయనామం: సిడియం గువాజావా ఎల్. (Psidium guajava L)
- కుటుంబం: మిర్టెసియే
- సాధారణ పేరు (లు): గువాయాబో (స్పానిష్), గోయాబీరా (పోర్చుగీస్), రెడ్ గువా, గువావా, కువావా, గువా (ఆంగ్లం)
- జాతి: సిడియం (Psidium)
- సంస్కృతం పేరు: పెరుకా
- హిందీ పేరు: అమౄద్ జామ ( Amrood )
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: దక్షిణ అమెరికా మరియు మెక్సికో యొక్క ఉష్ణమండల ప్రాంతాల్లో జామచెట్టు పుట్టింది. భారత్ తో పాటు థాయ్లాండ్, ఇండోనేషియా, చైనా, మెక్సికో, బ్రెజిల్, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్ మరియు ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ నైజీరియా జామను పండించే దేశాల్లో ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద జామాపండ్ల ఉత్పత్తిదారుగా భారత్ ఉంది. దేశ జామపండ్ల ఉత్పత్తిలో మహారాష్ట్ర రాష్ట్రంలో 12.8 శాతం పండుతున్నాయి. కాగా, మధ్యప్రదేశ్ (10.2 శాతం), ఉత్తరప్రదేశ్ (10.0 శాతం), బీహార్ రాష్ట్ర (9.76 శాతం) జామను పండించే రాష్ట్రాల్లో ప్రముఖంగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ఉత్తమ నాణ్యమైన జామపండ్లు పండుతాయి. ఆసక్తికరంగా, యు.పి.లోని అలహాబాదు జిల్లా భారతదేశంలోనే కాక, ప్రపంచంలోనే అతి నాణ్యమైన జామ పండ్లు పండుతాయని కీర్తిని సంపాదించింది.
- సరదా వాస్తవాలు:
జామపండ్ల యొక్క ప్రత్యేకమైన రకాలు ఉన్నాయి కానీ అవి ఏ ఒక్క జాతి కిందికీ రావు. అవి సాధారణంగా ప్రత్యామ్నాయ జాతులకి చెందినవి. ఒక ఉదాహరణగా, అక్కా సెల్లోవియానా(Acca Sellowiana)ను పేర్కొనవచ్చు, ఇది అనానస్ జామ శాస్త్రీయనామం.
జామరకాల్లో మొట్టమొదటిది మరియు ఎలాంటి రిమార్కులు లేకుండా అందరిచేతా ఆనందంగా తినబడే జామరకాన్ని "ఆపిల్ జామ" అని పిలుస్తారు.