వగరుగా, తియ్యగా మరియు కొద్దిగా పుల్లగా ఉండే నేరుడు పళ్ళు అంటే చాలా మందికి ఇష్టం. ఈ పండు అండాకారంలో దీర్ఘచతురస్రాకారంగా ఉంటుంది మరియు పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉంటుంది మరియు పండిన తర్వాత ఊదా రంగులోకి మారుతుంది. రుచిలో గొప్పగా ఉండటమే కాకుండా, నేరుడు పండు అనేక ఔషధ లక్షణాల కేంద్రంగా కూడా ఉంటుంది. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన వేసవిలో కాసే పండు. నేరుడు చెట్టు సాధారణంగా 60 నుండి 100 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది మరియు ప్రతి ఏటా పండ్లను కలిగి ఉంటుంది. పువ్వులు 5 మిమీ వ్యాసం కలిగి ఉంటాయి మరియు చాలా సువాసనను కూడా కలిగి ఉంటాయి.
ఈ పండ్లలోని వివిధ భాగాలు రక్తస్రావ లోపాలు మరియు ఇతర వ్యాధుల చికిత్సకు ఉపయోగపడతాయని ఆయుర్వేదంలో పేర్కొన్నారు. పళ్ళు తినడానికి ఉపయోగపడడంతో పాటు చెట్టు యొక్క అన్ని భాగాలు మరియు ప్రధానంగా విత్తనాలను అనేక రకాలైన వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. వివిధ సాంప్రదాయ వైద్య విధానాలలో ఉపయోగించే ఒక ముఖ్యమైన మొక్కగా ఇది గుర్తించబడింది. మధుమేహం, వాపు, అల్సర్తో పాటు అతిసారం చికిత్సలో నేరేడును ప్రధానంగా ఉపయోగిస్తారు.
నేరేడు పళ్ళతో అనేక ఆరోగ్య పానీయాలు (హెల్త్ డ్రింక్స్), స్క్వాష్‌లు, జామ్‌లు, జెల్లీలు, ఐస్‌క్రీమ్‌లు, స్మూతీలు మొదలైనవి తయారు చేస్తారు. పండని నేరేడు కాయలను వెనిగర్ లేదా వైన్ తయారీకి ఉపయోగిస్తారు. నేరేడు పళ్ళను నీరు మరియు చక్కెరతో పాటు కలిపి ఉడికించి నిల్వచేసుకోవచ్చు. ఎండబెట్టి పొడి చేసినప్పుడు నేరేడు పండు గుజ్జు ఔషధంగా మారుతుంది.
నేరేడు భారతదేశం, చైనా యొక్క ప్రక్కనే ఉన్న ప్రాంతాలు మరియు క్వీన్స్ ల్యాండ్ కు చెందిన చెట్టు. ఈ చెట్టును 1911 లో ఫ్లోరిడాకు పరిచయం చేశారు మరియు ఇప్పుడు గయానా, సురినామ్ మరియు ట్రినిడాడ్ మరియు టొబాగోలలో కూడా పండిస్తున్నారు.
నేరేడు చెట్టు గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు
- శాస్త్రీయ నామం: సిజిజియం క్యుమిని (Syzygium cumini)
- కుటుంబం: మైర్టేసి (Myrtaceae)
- సాధారణ నామం: నేరేడు పండు
- సంస్కృత నామం: జంబులా, జంబు ఫలం
- హిందీ పేరు: జమునా
- ఉపయోగించిన భాగాలు: పండు చర్మం, గుజ్జు మరియు విత్తనం
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: భారతదేశానికి చెందినది మరియు మడగాస్కర్, ఫిలిప్పీన్స్, ఇండీస్ మరియు థాయిలాండ్ వంటి కొన్ని ఇతర దేశాలలో కూడా చూడవచ్చు. ఇది గయానా, ట్రినిడాడ్ మరియు టొబాగో మరియు సురినామ్లలో కూడా పెరుగుతుంది.