గుమ్మడికాయ గింజలవల్ల మన శరీరానికి ఏమి ప్రయోజనం కల్గించగలవని ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతి భారతీయ వంటగదిలో ఒక సాధారణ కూరగాయ మరియు ఒక సాధారణ ఆహార పదార్ధం-గుమ్మడికాయ (కడ్డూ). కొంచెం తీపిగా లేదా ఒకింత కారంగా గుమ్మడికాయను వండుకోవాలనుకున్నారా? పండిన గుమ్మడికాయ గుజ్జు ఇందుకు బాగా పనికొస్తుంది. ఈ గుమ్మడి పండులోనిగుజ్జు మాత్రమే ఆరోగ్యకరమైన అంశం కాదు, పెద్ద గోళంవంటి గుమ్మడికాయ మధ్యలో ఉండే విత్తనాలు అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ముఖం అందాన్ని ఇనుమడింపజేసుకునేందుకు గుమ్మడికాయ గింజలతోఫేస్ మాస్క్ వేసుకోండి లేదా జుట్టు సమస్యలను నిర్వహించడానికి గుమ్మడిగింజల (సీడ్ ఆయిల్) నూనెను వాడండి. ఈ విత్తనాల పోషక పదార్ధాలు వ్యాధులతో పోరాడటానికి కూడా అనువైనవి.
కాబట్టి, గుమ్మడికాయ గింజల యొక్క ప్రయోజనాలు మరియు వాటిని ఎలా పొందాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి. దాని మితిమీరిన వినియోగానికి సంబంధించిన కొన్ని దుష్ప్రభావాలు కూడా ఇక్కడే చర్చించబడతాయి. మొదట, గుమ్మడికాయ విత్తనాల పోషక విలువలు మరియు దాని ప్రాథమిక అంశాలను పరిశీలిద్దాం.
గుమ్మడికాయ విత్తనాల గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు
గుమ్మడికాయ విత్తనాలు అనేక పోషకాలకు నిలయం. పొటాషియం, మెగ్నీషియం మరియు విటమిన్ ఎ యొక్క గొప్ప మూలం గుమ్మడి గింజలు. గుమ్మడి (పండు) యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి మరియు దాన్ని ఇష్టపడి ఆరగించే జనాభా గురించి తెలుసుకోవాలనుకుంటూ ఉండవచ్చు. ఆ వివరాలివిగో.
- శాస్త్రీయ నామం: కుకుర్బిటా మోస్చాటా (Cucurbita moschata)
- కుటుంబం పేరు: కుకుర్బిటేసియా
- సాధారణ పేరు: కడ్డూ, కడ్డూ కే బీజ్, స్క్వాష్, సఫేద్ కడ్డూ
- సంస్కృత నామం: కర్కరు, కుర్కరు, కర్లారు, కాఖారు
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: పశ్చిమ దేశాలకు చెందిన గుమ్మడికాయల్ని వివిధ కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా పండిస్తారు. భారతదేశం, యునైటెడ్ స్టేట్స్, మెక్సికో మరియు చైనా గుమ్మడికాయను ఎక్కువగా పండించే దేశాలు. భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన గుమ్మడికాయ రకాలు యునైటెడ్ స్టేట్స్లో హాలోవీన్ పండుగ కోసం ఉత్పత్తి చేయబడే దిగ్గజం లాంటి, నారింజరకం గుమ్మడికి భిన్నంగా ఉంటాయి. గుమ్మడికాయ గింజలు చిన్నవిగా, సదరంగా (flat) తినదగిన విత్తనాలు. సాధారణంగా గుమ్మడి గింజలు ఊకతో కప్పబడి ఉంటాయి.