నల్ల జిలకరను (నల్ల జిలకర లేదా నిగెల్ల సీడ్) ప్రపంచవ్యాప్తంగా వివిధ పేర్లతో పిలుస్తారు. ఆంగ్లంలో దీన్ని “సమల్ ఫెన్నెల్” (samal fennel) అంటారు. అనేక భారతీయ భాషల్లో నల్ల జిలకరకు అనేక పేర్లున్నాయి. నల్ల జిలకరను మలయాళంలో ఎల్ (ell) లేదా కరుణ్ జీరగం అంటారు. గుజరాతీలో నల్ల జిలకరను కలోంజీ (kalonji) అని, బెంగాలీలో మొగ్రెల్ (Mogrel) అని మరియు మరాఠీలో కాలే తిల్ (kaale thil) అని అంటారు.
నల్ల జిలకర వృక్షశాస్త్రం (బొటానికల్) పేరు “నిగెల్లా సాటివా” ( Nigella sativa) మరియు రణన్కులాసెయే (Ranunculaceae) కుటుంబానికి చెందిన సతత హరిత మొక్క నుండి వచ్చిందిది. అత్యంత విలువైన ఔషధ విత్తనాలలో ఒకటి నల్లజిలకర, దీన్నివంటలలో సువాసనను కల్పించే ఏజెంట్ గా కూడా వాడతారు. కూర మసాలా మరియు గరం మసాలా యొక్క చాలా ముఖ్యమైన భాగం ఈ నల్లజిలకర. భారతీయ ఊరగాయల యొక్క రుచి, సువాసనల్లో ఒకింత చేదురుచినిచ్చే రుచి కూడా ఉండేందుకు కారణం ఈ నల్ల జిలకర విత్తనాలను వాటిల్లో వాడటం వల్లనే. ఇది ఖాడీ , సమోసా , కచోరి వంటి అనేక ప్రముఖ భారతీయ వంటలలో సువాసన కోసం ఉపయోగించబడుతుంది .
నల్ల జిలకరను వివిధ రూపాల్లో, అంటే నల్ల జిలకరనూనె, వేయించిన నల్లజిలకర విత్తనాలు, ముడి నల్లజిలకర విత్తనాలుగా, వాడుకోవచ్చు. నల్ల జిలకరను పచ్చివిగానే నమిలినా, తిన్నా రుచికి చేదుగా అనిపించినా, దాన్ని వంటలో చేర్చినప్పుడు ఆ వంట రుచిని మరింత పెంచుతుంది. నల్ల జిలకరకు ఒక పదునైన మరియు కొద్దిగా చేదు రుచి, మరియు మసాలా కారం-తీపి కలిసిన సువాసనాభరిత రుచిని కలిగి ఉంటుంది. ఇది మూడు రంగులలో లభిస్తుంది. అనగా పసుపు-నారింజ కలగలిసిన రంగు, తెలుపు మరియు నలుపు రంగుల్లో నల్ల జిలకర లభిస్తుంది.
దక్షిణ ఐరోపా, ఉత్తర ఆఫ్రికా మరియు నైరుతి ఆసియా ప్రాంతాలకు చెందిన నల్ల జిలకరను మధ్య ప్రాచ్యం, మధ్యధరా ప్రాంతం, దక్షిణ ఐరోపా, భారతదేశం, పాకిస్తాన్, సిరియా, టర్కీ మరియు సౌదీ అరేబియా వంటి ప్రపంచంలోని అనేక దేశాలలో సాగు చేస్తారు.
యునాని మరియు ఆయుర్వేదం వంటి భారతీయ సాంప్రదాయ వైద్య వ్యవస్థలలో నల్ల జిలకర గింజలు మరియు నల్ల జిలకర నూనెను శతాబ్దాలుగా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు మరియు”టిబ్-ఇ-నవాబి (ప్రవచనాత్మక వైద్యంలో) కూడా సిఫార్సు చేయబడింది. నల్ల జిలకరను రక్తంలో ఎక్కువగా కొవ్వు చేరే రుగ్మత ‘కొలెస్టెరాల్’ ను తగ్గించడంలో చాలా సహాయకారిగా ఉంటుంది, శరీర అమరికను ఉంచడంలో ఇది సహాయపడుతుంది. అదనంగా, అధిక రక్తపోటును తగ్గించడం, గుండె సమస్యలు మరియు చర్మ సమస్యలు మరియు అలెర్జీలను కూడా నయం చేయడం వంటి పలు ఆరోగ్య సమస్యలకు నల్ల జిలకర ఒక సహజ చికిత్సగా పనిచేస్తుంది.
నల్ల జిలకర గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు:
- శాస్త్రీయ నామం: నిగెల్లా సాటివా (Nigella Sativa)
- కుటుంబము: రణన్కులాసెయే
- సాధారణ పేరు: నల్ల జిలకర, కలోంజి, బ్లాక్ కరవే, నిగెల్లా
- సంస్కృతం పేరు: కృష్ణ జీరా
- ఉపయోగించే భాగాలు: నిగెల్ల సాటివా మొక్క యొక్క పండ్లు చాలా విత్తనాలను కలిగి ఉంటాయి, వీటినే సాధారణంగా మసాలాగా వాడతారు.
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: నల్ల జిలకర గురించిన సమాచారం తగినంతగా లేకపోయినా ఈజిప్టు మరియు టర్కీలలోని పురాతన ప్రదేశాలలో జరిపిన త్రవ్వకాలలో నల్ల జిలకర విత్తనాల గురించిన జాడలు దొరికాయి. ఈ పంటను ఐరోపాలో, భారతదేశం మరియు ఉత్తర ఆఫ్రికా వంటి సౌత్ వెస్ట్ ఆసియా దేశాలలో సాగు చేయబడుతుంది.
- ఆసక్తికరమైన నిజాలు: ప్రఖ్యాత ముస్లిం పండితుడు అల్ బుఖారీ, నల్లజిలకరను 'ఆశీర్వదించబడింది' అనే అర్ధం స్ఫురించే విధంగా “హబ్బత్ అల్ బరకా” అని కొనియాడినాడు. అతని ప్రకారం, ప్రవక్తలలో ఒకరు ఒక్క మృత్యువును మినహాయించి అన్ని వ్యాధులను నయం చేయగల మందుగా నల్ల జిలకర ను పేర్కొన్నారు.