రావి చెట్టును భారతదేశంలో పవిత్రమైందిగా భావిస్తారు. దీన్నే వృక్షశాస్త్రంలో ‘ఫెకస్ రిలిజియోసా’ అంటారు. ఇది భారతదేశ సంస్కృతిలో లోతుగా వేళ్లను పాతుకుని ఉంది, ఎందుకంటే ఈ చెట్టు కిందనే బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్లు నమ్మడం జరుగుతోంది. కాబట్టి, దీనిని తరచుగా 'బోధి చెట్టు' గా సూచిస్తారు. సంప్రదాయ భారతీయ సాహిత్యం రావి వృక్షాన్ని 'అశ్వత్త' వృక్షంగా వర్ణిస్తుంది, అంటే దీనర్థం, రావి చెట్టు 'జీవితం యొక్క చెట్టు' కు చిహ్నం అని.
ఫికస్ రిలిజియోసాను సాధారణంగా పవిత్రమైన అశ్వత్థము (the sacred fig) అని పిలుస్తారు, ఇది ఆసియా, ముఖ్యంగా భారతదేశం మరియు చైనా, యొక్క ఉష్ణమండల భాగాలకు చెందినది. ఇది విస్తృతమైన కాండంతో (ట్రీ -ట్రంక్) పెద్దది గా ఉండే చెట్టుగా ఉంటుంది, దీని యొక్క వ్యాసం 3 మీటర్లు వరకు ఉంటుంది. చెట్టు యొక్క ఆకులు హృదయం ఆకారంలో ఉంటాయి మరియు విలక్షణమైన ఆకుచివరను (tip) ను కల్గి ఉంటుంది. చెట్టు యొక్క పండ్లు సాధారణంగా చిన్న చిన్న అత్తి పండ్లను లేదా చిన్న మేడిపండ్లను పోలి నేతగా ఉన్నపుడు ఆకుపచ్చగా మరియు మాగి పండైనపుడు ఊదా రంగులోకి మారుతాయి.
రావిచెట్టు యొక్క జీవిత కాలం సాధారణంగా 900 నుండి 1500 సంవత్సరాల వరకు ఉంటుంది. శ్రీలంకలోని “జయ శ్రీ మహా బోధి” రావిచెట్టు, మత ప్రాముఖ్యత కలిగిన అతిపురాతనమైన చారిత్రక చెట్టు' అని చెప్పబడింది. వాస్తవానికి దీని వయస్సు 2250 సంవత్సరాల కంటే ఎక్కువ అని, ఇది ప్రపంచంలోనే పురాతనమైన చెట్టు అని చెప్పబడుతోంది.
రావి చెట్టు గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు
- వృక్షశాస్త్రం (బొటానికల్) పేరు: ఫికస్ రిలిజియోసా (Ficus religiosa)
- కుటుంబం: మోరసీయే (Moraceae)
- సాధారణ పేరు: పవిత్రమైన అత్తి, బోధి చెట్టు, రావిచెట్టు, పీపల్ చెట్టు
- సంస్కృత పేరు: అశ్వత్త , పిప్పల
- రావి చెట్టు యొక్క ఉపయోగించే భాగాలు: ఆకులు, శాఖలు, పువ్వులు, పండ్లు, బెరడు
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: ఉష్ణమండల ఆసియాకు చెందినది ప్రత్యేకించి, భారతదేశం మరియు చైనాల్లో ఎక్కువగా కనబడుతుంది.