అన్ని రకాల ఔషధ మరియు కలినరీ డిలైట్స్ లను ప్రకృతి మానవజాతికి అందించింది. మన యొక్క పెరటిలో కనిపించే అనేక కలుపు మొక్కలు వాస్తవంగా ఔషధ అద్భుతాలని  తెలుసుకున్నప్పుడు మనం ఆశ్చర్యపడతాము. పునర్నవ అటువంటి ఒక ఔషధ మొక్క. ఒక సంవత్సరంలోని వర్షాకాల నెలల్లో ఎక్కువ ఉష్ణమండల ప్రాంతాల యొక్క పెరటిలలో ఇది ఒక సాలెగూడు వలె వ్యాపిస్తుంది. పశ్చిమ బెంగాల్ మరియు అస్సాంలను కలుపుకొని భారతదేశంలోని కొన్ని భాగాల్లో కలినరీ మొక్కగా పునర్నవ ఉపయోగంలో ఉంది.             

ఈ ఔషధ మొక్క సంప్రదాయ వంటగదికి మాత్రమే పరిమితం కాలేదు. పునర్నవను ఒక అద్భుతమైన అడాప్టోజెన్ (ఒత్తిడి-తగ్గించే కారకం), ఒక రసాయన (నూతన బలాన్ని ఇచ్చేది) మరియు ఒక హెపటోప్రొటెక్టివ్ (కాలేయమును రక్షించేది) మొక్కగా ఆయుర్వేదిక్ మెడిసిన్ గుర్తించింది. వాస్తవంగా, పునర్నవ అనగా “తిరిగి లేవడం” అంటే అర్థము. పునర్నవ యొక్క అనేక వైద్య ప్రయోజనాల నుండి ఈ అనువాదం వచ్చిందని నమ్ముతున్నారు. కిడ్నీలో రాళ్లు, పచ్చకామెర్లు, మధుమేహం, మరియు క్యాన్సర్ వంటి వివిధ రకాల మానవ పరిస్థితుల యొక్క ఉపశమనంలో పునర్నవ యొక్క చికిత్సా సామర్థ్యాన్ని నిర్ధారించేందుకు అనేక పరిశోధనలు కొనసాగుతున్నాయి.          

పునర్నవ కాండాలు ఊదా రంగు ఛాయలో సాధారణంగా పెరుగుతాయి. ఇవి వుడీ లేదా రసభరితంగా ఉంటాయి మరియు వాటి ఉపరితలం‌పై వెంట్రుకల వంటి పెరుగుదలను కలిగిఉంటాయి. పునర్నవ యొక్క వెంట్రుకల వంటి ఆకులు ఒకవైపు కాంతివంతమైన ఆకుపచ్చ రంగు మరియు మరొక వైపు తెలుపు రంగు కలిగిఉంటాయి. అవి కాండం పైన ఒకదానికొకటి వ్యతిరేకంగా అమర్చబడి ఉంటాయి. పునర్నవ పుష్పాలు తెలుపు లేదా గులాబి/ఎరుపు రంగులో ఉంటాయి మరియు ఇవి ఈ చెట్టు యొక్క అధిక విభిన్నమైన ప్రత్యేకతను కలిగి ఉంటాయి. ఫార్మాస్యూటికల్, బయాలాజికల్, మరియు రసాయన శాస్త్రాలకు సంబంధించి రీసర్చ్ జనరల్‌లో ప్రచురితమైన ఒక రివ్యూ వ్యాసం ఆధారంగా తెల్లటి రంగు రకం మూడు ఆయుర్వేదిక్ దోషాలకు మంచిదని అదేవిధంగా గులాబి/ఎరుపు పునర్నవ పాసిఫై పిత్తాగా తెలుపబడింది.       

పునర్నవ గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు:

  • వృక్ష శాస్త్రీయ నామం: బొయెర్హావియా డిఫ్యూజా ఎల్.
  • జాతి: నిక్టేగినాసియే
  • వ్యవహారిక నామం: పునర్నవ, పిగ్‌వీడ్, ప్రాకే గలిజేరుపల్లిక, గలిజేరు పల్లిక, టార్ వీన్    
  • సంస్కృత నామం: రక్తకంద, షోతాగ్ని, వర్షభు
  • ఉపయోగించే భాగాలు: ఆకులు, వేర్లు, మరియు విత్తనాలు
  • జన్మించే ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: పునర్నవ విస్తృతంగా భారతదేశం, అమెరికా, మరియు ఆఫ్రికా యొక్క కొన్ని భాగాల్లో పెరుగుతుంది.
  • ఎనర్జటిక్స్: చల్లదనం ఇస్తుంది. 
  1. పునర్నవ ఆరోగ్య ప్రయోజనాలు - Punarnava health benefits in Telugu
  2. పునర్నవ ఉపయోగం - Punarnava use in Telugu
  3. పునర్నవ మోతాదు - Punarnava dosage in Telugu
  4. పునర్నవ దుష్ప్రభావాలు - Punarnava side effects in Telugu

పునర్నవ ప్రకృతి యొక్క ఒక అద్భుతమైన ఔషధ మొక్క, శరీరంలోని అవయవాల యొక్క ప్రతీ ముఖ్యమైన పనులకు ఇది చాలా ప్రయోజనకరమైనది. ఇది యాంటీమైక్రోబియల్, యాంటీఆక్సిడంట్ మరియు యాంటీఇన్‌ఫ్లమేటరీ ఔషధ మొక్క, అయితే మరింత ముఖ్యముగా ఇది ఒక రసాయన (నూతన బలాన్ని అందించేది). పునర్నవ యొక్క వినియోగం కొన్ని సాధారణ అంటువ్యాధుల యొక్క ప్రమాదం నుండి ఉపశమనం ఇవ్వడం మాత్రమే కాకుండా పునరుజ్జీవింపచేసే ఒక కారకంగా, మీరు ఆనందకరమైన మరియు ఆరోగ్యవంతమైన జీవితం జీవించేందుకు తప్పనిసరిగా తోడ్పడుతుంది.     

పునర్నవ యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి లోతైన విశ్లేషణను చూద్దాము. 

  • కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది: కాలేయ వ్యాధుల చికిత్సకు సంబంధించిన సంప్రదాయ చికిత్సలలో పునర్నవ ఒక ఉత్తమ సంప్రదాయ చికిత్స. మే నెలలో పంట దిగుబడి చేసినప్పుడు, ఈ ఔషధ మొక్కను కాలేయం దెబ్బతినకుండా నివారించేందుకు మరియు మునుపటిలా కాలేయం పనిచేసేందుకు దీనిని సూచిస్తారు.         
  • మూత్రపిండాల ఆరోగ్యమును వృద్ది చేస్తుంది: పునర్నవ మూత్రవర్థకం చర్యను కలిగిఉంటుంది, ఇది మూత్రపిండాల్లో రాళ్ళను నివారించేందుకు సహాయపడుతుంది. దీర్ఘకాల మూత్రపిండ వైఫల్యం ఏర్పడ్డ సందర్భంలో క్రమంతప్పకుండా పునర్నవాను ఉపయోగించడం వల్ల మూత్రపిండాల పనితీరును అది మెరుగుపరుస్తుందని క్లినికల్ అధ్యయనాలు కనుగొన్నాయి.   
  • రక్తహీనత లక్షణాలు తగ్గుటను మెరుగుపరుస్తుంది: పునర్నవాను మజ్జిగతో కలిపి ఇచ్చినప్పుడు, ఐరన్ స్థాయిలను పెంచుతుంది మరియు రక్తహీనత లక్షణాల్ని 90 రోజుల లోపల తగ్గిస్తుంది. 
  • రోగనిరోధకతను పెంచుతుంది: పునర్నవ కొన్ని బయాలాజికల్లీ ఉత్తేజిత అంశాలను కలిగిఉంటుంది, ఈ అంశాలు అశ్వగంధ వలె వ్యాధి నిరోధక శక్తి ప్రక్రియల్ని ఉత్తేజపరచుటను ప్రదర్శిస్తాయని కనుగొనబడింది.   
  • ఋతు సమస్యల్ని తగ్గిస్తుంది: పునర్నవ ఋతు సమయంలో వచ్చే తిమ్మిర్లు తగ్గడానికి సహాయం చేస్తుంది. గర్భాశయంలో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది మరియు వాపు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.   
  • చక్కెర వ్యాధిని తగ్గిస్తుంది: పునర్నవ హైపోగ్లైసెమిక్ ఏజెంట్ (చక్కెర వ్యాధిని తగ్గించుట) అని శాస్త్రీయంగా నిరూపించబడింది. ఇన్సులిన్ స్థాయిల్ని పెంచడం మరియు బీటా-కణాల్ని పునరుద్దరించడం ద్వారా చక్కెర వ్యాధిని పునర్నవ తగ్గిస్తుంది.    
  • బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది: పునర్నవ ఒక మంచి బరువు తగ్గించే ఏజెంట్ గా తెలుపబడింది, ఇది నీటి బరువును మాత్రమే తగ్గిస్తుంది మరియు ఇప్పటివరకూ ఏ విధమైన క్రొవ్వును తగ్గించే ప్రభావాలను కలిగిఉందని కనుగొనబడలేదు.  
  • డీలేస్ ఏజింగ్: పునర్నవ ఒక సహజమైన యాంటిఆక్సిడంట్ ఔషధ మొక్క, ఇది స్వేచ్చా రాడికల్ దెబ్బతినకుండా పోరాటం చేస్తుంది మరియు వృద్ధాప్య లక్షణాల పూర్వ ప్రారంభము అనగా ముడుతలు మరియు గీతలను నివారిస్తుంది. 

పునర్నవ యాంటీమైక్రోబయల్ ప్రయోజనాలు - Punarnava antimicrobial benefits in Telugu

పునర్నవ మొక్క యొక్క యాంటీమైక్రోబయల్ సామర్థ్యాన్ని అనేక ప్రయోగశాల-అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ఒక పునర్నవ మొక్క అధ్యయనంలో, పునర్నవ ఆకుల యొక్క వివిధ పదార్థాలు (ఏక్వియస్, ఇథనాల్, మిథనాల్, క్లోరోఫాం మొ.)అన్నవి ఎస్చెరిచియా కోలి, బాసిల్లస్ సబ్లిటిస్, స్టాపైలాకోకస్ ఆరియస్, సాల్మోనెల్లా టైఫి మొ.లగు విస్తృత శ్రేణి బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా సమర్థవంతంగా ఉన్నట్లు కనుగొన్నారు.       

పునర్నవ మొక్క యొక్క నీటి మరియు ఇథనాలిక్ పదార్థాలు అన్నవి ఎస్చెరిచియా కోలి, బాసిల్లస్ సబ్లిటిస్, సాల్మోనెల్లా టైఫిమరియం, నెసెరియా గనోరోహెయా, కొరిన్బాక్టీరియం డిఫ్థెరియా, షిగెల్లా డిసెంటెరీ, క్లోస్ట్రీడియం టెటానీ మొ.లగు వంటి బ్యాక్టీరియల్ వ్యాధికారకాలకు వ్యతిరేకంగా బలమైన యాంటీమైక్రోబయల్ చర్యను ప్రదర్శిస్తాయని మరొక అధ్యయనం సూచిస్తుంది. అయినప్పటికీ, మానవులలో పునర్నవ యొక్క యాంటీమైక్రోబయల్ కార్యకలాపాలకు సంబంధించి ఎటువంటి నిర్ధారణ సాక్ష్యం లేదు.          

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹712  ₹799  10% OFF
BUY NOW

పునర్నవ యాంటికేన్సర్ లక్షణాలు - Punarnava anticancer properties in Telugu

పునర్నవ యొక్క యాంటికే‌న్సర్ లక్షణాలు, లుకేమియా (ఒక రకమైన రక్త కే‌న్సర్), రొమ్ము కేన్సర్, చర్మ కే‌న్సర్, మరియు పెద్ద ప్రేగు కే‌న్సర్ యొక్క అణచివేత విస్తృత అధ్యయనం ద్వారా తెలుపబడ్డాయి. కే‌న్సర్ కణాలకు వ్యతిరేకంగా సమర్థవంతమైన యాంటిప్రొలిఫెరేటివ్ (వ్యాపించకుండా ఆపివేస్తుంది) చర్యను పునర్నవ కలిగిఉందని వివిధ ఇన్ విట్రో మరియు ఇన్ వివో అధ్యయనాలు సూచిస్తున్నాయి.    

కేన్సర్ లింపోసైట్ల యొక్క పెరుగుదలను పునర్నవ పదార్థాలు నిరోధిస్తాయని ప్రయోగశాల-ఆధారిత అధ్యయనాలు సూచిస్తున్నాయి. బొయెరావెనోన్ 1 మరియు 2 పేరు గల రెండు రసాయన సమ్మేళనాలను పునర్నవ కలిగిఉందని మరొక అధ్యయనం పేర్కొంది. వికిరణ-ప్రేరిత నష్టానికి వ్యతిరేకంగా పునర్నవ యొక్క సురక్షిత ప్రభావాన్ని ఇన్ వివో అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ, పునర్నవ యొక్క యాంటికే‌న్సర్ సామర్థ్యాన్ని అవగాహన చేసుకునేందుకు మరింత అధిక పరిశోధన ఇప్పటికీ అవసరమవుతుంది.       

చర్మం కోసం పునర్నవ ప్రయోజనాలు - Punarnava benefits for skin in Telugu

ఆయుర్వేదం మరియు నాటు వైద్యంలో, పునర్నవ దాని యొక్క చర్మ వైద్య ప్రయోజనాల వల్ల బాగా తెలియజేయబడింది.   

మధ్య భారతదేశం యొక్క గిరిజనుల ద్వారా పునర్నవ వేరు మరియు ఆకులు వివిధ చర్మ వ్యాధులకు సంబంధించిన చికిత్సలో ఉపయోగించబడ్డాయని ఎథ్నోఫార్మాకోలాజికల్ అధ్యయనాలు సూచిస్తున్నాయి.  

పునర్నవ ఒక అద్భుతమైన యాంటిఆక్సిడంట్, యాంటిబయాటిక్ మరియు యాంటి-ఇన్‌ఫ్లమేటరీ మూలికగా పేర్కొనబడింది. దీనితోపాటు, పునర్నవ ఒక అడాప్టోజెన్ మరియు రసాయనగా కూడా తెలుపబడింది. ఈ మూడు లక్షణాలను అన్నింటినీ కలిపి, చర్మం కోసం అన్ని వైద్యాలకు మరియు నూతన బలాన్ని అందించే ఒక మూలికగా పునర్నవ తయారుచేయబడింది. పునర్నవ యొక్క వినియోగం దురద, మరియు దద్దుర్లు వంటి సాధారణ చర్మ రోగాలను తగ్గించడంలో మాత్రమే సహాయం చేయదు, అయితే, చర్మం పై ఉండే ఏదైనా సంక్రమణ బ్యాక్టీరియాను నిర్మూలించడంలో కూడా ఇది పోరాడుతుంది.      

ఇంకా ఎక్కువగా, పునర్నవ యొక్క యాంటిఆక్సిడంట్ లక్షణాలు, నల్లని మచ్చలు మరియు డాగులు వంటి వాటితో ఏర్పడే వృద్దాప్యం యొక్క ప్రారంభ సంకేతాలతో కూడా పోరాడుతుంది అలాగే ఈ మూలిక యొక్క పోషకమైన లక్షణాలు మీ యొక్క చర్మం సానుకూలంగా ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా కనిపించేలా తయారుచేస్తుంది.       

బరువు తగ్గడం కోసం పునర్నవ - Punarnava for weight loss in Telugu

బరువు తగ్గించే ఏజెంట్‌గా పునర్నవ యొక్క సామర్థ్యం పైన ఏ విధమైన నిర్ధారణ పరిశోధనా లేదు, బరువు తగ్గించే సూత్రీకరణలో ఉపయోగించే అత్యున్నత ఆయుర్వేదిక మూలికలలో ఒకటిగా ఇది నిలిచిపోయింది. పునర్నవ, ఒక మూత్రవిసర్జన కారకంగా,శరీరం నుండి అదనపు ద్రవ బరువును తగ్గించడంలో సహాయపడవచ్చని ఒక సిద్దాంతము సూచిస్తుంది. అదనంగా, పునర్నవ ఒక తేలికపాటి భేది మందుగా కూడా తెలుపబడుతుంది.     

పునర్నవ, శరీరంలో ద్రవాలు నిలిచిపోవడాన్ని నిరోధిస్తుంది, అది పరోక్షంగా బరువును తగ్గించడంలో సహాయపడుతుందని మరింతగా సూచించబడింది.అయినప్పటికీ, అధికంగా బరువు తగ్గించే ప్రక్రియ అన్నది శరీరంలో ద్రవాల సమతుల్యత నుండి వచ్చినట్లు కనిపిస్తుంది మరియు కణజాలంలో కొవ్వు తగ్గించడంలో పునర్వన చర్య గురించి ఎక్కువగా నిర్ధారించబడలేదు. అయితే, క్రమమైన వ్యాయామంతో అనుబంధంగా ఇది ప్రయోజనకరమైనది కావచ్చు. ఏదైనా యాంటి-ఒబెసిటీ చికిత్సలో పునర్నవను ఉపయోగించేందుకు ముందుగా మీ డాక్టరుతో మీరు మాట్లాడడం మంచిది.      

(మరింత చదవండి: ఒబెసిటీ చికిత్స)

కళ్ల కోసం పునర్నవ - Punarnava for eyes in Telugu

వివిధ కంటి వ్యాధుల చికిత్స కోసం పునర్నవ ఆకు మరియు వేరు పదార్థాలు ఒక నాటు వైద్య చికిత్సగా వాడబడ్డాయని ఒక మానవ అధ్యయన ఆధారిత నివేదిక సూచించబడింది. పునర్నవ ఆకు రసం మరియు తేనెతో తయారుచేసిన ఒక కంటి చుక్కల మందు కండ్లకలక వంటి సాధారణ కంటి సమస్యల వల్ల ఏర్పడ్డ మంటను తగ్గిస్తాయి. పునర్నవ వేరు యొక్క రసం కూడా రేచీకటి కోసం చికిత్సగా నాటు వైద్యంలో ఉపయోగించబడింది.       

ఒక ఇన్ వివో అధ్యయనంలో, కంటి శుక్లం మరియు కండ్లకలక లక్షణాల నుండి ఉపశమనం కోసం పునర్నవ జెల్ మరియు కంటి చుక్కలు ఉపయోగకరమైనదిగా కనుగొనబడింది. పునర్నవ జెల్ లేదా కంటి చుక్కల యొక్క నిర్వహణ ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని కలిగియుండలేదని మరింతగా రిపోర్ట్ చేయబడింది.      

అయినప్పటికీ, క్లినికల్ ట్రయల్స్ లేని కారణంగా, ఏ విధమైన కంటి పరిస్థితికి సంబంధించి పునర్నవను ఉపయోగించేందుకు ముందుగా మీ యొక్క ఆయుర్వేద డాక్టరుతో మీరు మాట్లాడడం ఉత్తమమైనది.   

ఒత్తిడి తగ్గించడం కోసం పునర్నవ - Punarnava for stress in Telugu

ఆయుర్వేదంలో పునర్నవ ప్రాథమికంగా ఒక రసాయన (నూతన బలాన్ని అందించేది) గా తెలుపబడింది. ఆయిర్వేదిక డాక్టర్ల ప్రకారం, ప్రతీ రసాయన మూలిక ఒత్తిడి-ఉపశమన సామర్థ్యాన్ని కలిగిఉంటుంది. పునర్నవ పదార్థాలు మరియు పునర్నవ మండూర్ అనే ఆయుర్వేదిక సూత్రీకరణ వంటివి సమర్థవంతంగా ఒత్తిడిని తగ్గించే ఏజెంట్లని అధ్యయనాలు సూచిస్తున్నాయి.   

ఫార్మసీ మరియు ఫార్మాస్యూటికల్ సైన్సెస్ యొక్క అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురితమైన ఒక రివ్యూ వ్యాసం ప్రకారం, పునర్నవ మొక్కలో ఉండే ప్రధాన అడాప్టోజెనిక్ ఏజెంట్ బొయరోవెనోన్.    

(మరింత చదవండి: ఒత్తిడికి కారణాలు

మంటను తగ్గించడం కోసం పునర్నవ - Punarnava for inflammation in Telugu

అనేక నాటు సంప్రదాయాలు మరియు సంస్కృతుల ద్వారా పునర్నవ ఒక యాంటి-ఇన్‌ఫ్లమేటరీ ఔషధ మొక్కగా ఉపయోగంలో ఉంది. అనేక ఆయుర్వేదిక యాంటి-ఇన్‌ఫ్లమేటరీ సూత్రీకరణలు వాటి యొక్క ప్రధాన పదార్థాలలో ఒకటిగా పునర్నవను కలిగిఉన్నాయి. పునర్నవ ఆకులు కొంత యాంటి-ఇన్‌ఫ్లమేటరీ మరియు అనాల్జేసిక్ (నొప్పిని తగ్గించే) లక్షణాల్ని కలిగిఉన్నాయని ప్రి-క్లినికల్ అధ్యయనాలు సూచిస్తున్నాయి. వర్షాకాలం‌లో పునర్నవ యొక్క యాంటి-ఇన్‌ఫ్లమేటరీ సామర్థ్యం దాని యొక్క అధిక స్థాయిలో కలిగిఉంటుందని మరొక ప్రయోగశాల-అధ్యయనం జతచేయబడింది. అయినప్పటికీ, మానవ-ఆధారిత ఇన్‌ఫ్లమేటరీ పరిస్థితుల్లో ఇదే చర్యను నిర్ధారించేందుకు క్లినికల్ ట్రయల్స్ ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి.        

పునర్నవ యాంటిఆక్సిడంట్ లక్షణాలు - Punarnava antioxidant properties in Telugu

పునర్నవ ఒక అద్భుతమైన యాంటిఆక్సిడంట్ అని ఇన్ విట్రో (ప్రయోగశాల-ఆధారిత) మరియు ఇన్ వివో అధ్యయనాలు సూచిస్తున్నాయి. పునర్నవ యొక్క ఫినోలిక్ మరియు ఫ్లేవనోయిడ్ కంటెంట్ అన్నది దానియొక్క యాంటిఆక్సిడంట్ లక్షణాలకు అధిక బాధ్యత వహిస్తుందని ఫార్మాకోగ్నొసీ మరియు ఫైటోకెమికల్ పరిశోధనకు సంబంధించిన అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురితమైన ఒక ప్రయోగశాల-ఆధారిత అధ్యయనం సూచిస్తుంది.     

పునర్నవ యొక్క యాంటిఅక్సిడంట్ ప్రభావాలు, పునర్నవ యొక్క అధిక విటమిన్ సి మరియు పాలీఫినాల్ కంటెంట్‌కు భాగంగా ఆపాదించబడ్డాయని మరొక ఇన్ విట్రో అధ్యయనం పేర్కొంది.   

ఋతు సమస్యల కోసం పునర్నవ - Punarnava for menstrual problems in Telugu

సాంప్రదాయకంగా,  క్రమరహిత ఋతుస్రావం (ఋతుక్రమ లేమి) మరియు ఋతు సమయంలో వచ్చే నొప్పి (డిస్మెనోరియా) వంటి స్త్రీ సంబంధిత ఋతు రుగ్మతల యొక్క చికిత్స కోసం పునర్నవను ఉపయోగిస్తారు. పునర్నవ కొంత యాంటిఫైబ్రినోలిటిక్ సామర్థ్యాన్ని (క్లాట్ ఏర్పడుటను ఆపివేస్తుంది) కలిగి ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. పునర్నవ యొక్క వినియోగం ఋతుక్రమణ క్రమబద్దీకరణలో ఉపయోగపడుతుంది మరియు గర్భాశయం‌లో తిమ్మిర్లు, మంట, వాపు మొదలగు వంటి సాధారణ ఋతు సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుందని జంతు-ఆధారిత అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ, ఋతు పరిస్థితులకు సంబంధించిన చికిత్సలలో పునర్నవ యొక్క ఖచ్చితమైన మెకానిజం మరియు మోతాదును కనుగొనడానికి మరిన్ని అధ్యయనాలు ఇప్పటికీ అవసరం.      

రోగనిరోధక శక్తి కోసం పునర్నవ - Punarnava for immunity in Telugu

ఆయుర్వేదిక వైద్యుల ప్రకారం, పునర్నవ ఒక పోషకమైన మొక్క.  దీని అర్థం ఏమిటంటే, మన శరీర విధుల యొక్క మొత్తం అభివృద్ధికి పునర్నవ యొక్క వినియోగం  దారితీస్తుంది. రోగనిరోధక శక్తి అన్నది అంటువ్యాధులు మరియు వ్యాధుల నుండి మన శరీరాలను దూరంగా ఉంచడం కోసం బాధ్యత వహించే ఒక ప్రధాన శరీర క్రియ. ఆరోగ్యాన్ని పరిరక్షించే ఔషధ మొక్కగా పునర్నవ ఒక ఇమ్యునోమాడ్యులంట్‌గా పనిచేస్తుంది (రోగనిరోధక శక్రిని మెరుగుపరుస్తుంది) అది అనారోగ్యంతో మనం పడిపోకుండా మనల్ని ఉంచుతుంది. పునర్నవ పదార్థాలు లింపోసైట్స్ మీద స్టిములేటరీ ప్రభావం(తెల్ల రక్త కణాలు) కనుపరుస్తాయని ఇన్ వివో అధ్యయనాలు సూచిస్తున్నాయి మరియు పునర్నవ యొక్క అడాప్టోజెనిక్ (ఒత్తిడి తగ్గించే) ప్రభావాలు అశ్వగంధతో పోల్చదగినవని ఇతర రోగనిరోధక వ్యవస్థ కణాలు మరలా పేర్కొన్నాయి.                 

మైక్రోబయాలజీ, ఇమ్యునాలజీ మరియు ఇన్ఫెక్షన్ కు సంబంధించిన జర్నల్‌లో ప్రచురితమైన రివ్యూ వ్యాసం ప్రకారం, పునర్నవ యొక్క ఆల్కలాయిడ్ కంటెంట్ అన్నది దాని యొక్క రోగనిరోధక-ఉద్దీపన ప్రభావాలకు ప్రాథమిక బాధ్యత కలిగిఉంటుంది. అయినప్పటికీ, పునర్నవ యొక్క ఇథనాలిక్ వేరు పదార్థాలు ద్వారా సెలెక్టివ్ ఇమ్యునో-సప్రెసివ్ చర్యను అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి.         

అందువల్ల, మీ యొక్క రోగనిరోధక వ్యవస్థ పైన పునర్నవ చర్య యొక్క మెకానిజం గురించి మరింత ఎక్కువగా తెలుసుకునేందుకు ఒక ఆయుర్వేదిక డాక్టరును సంప్రదించడం ఉత్తమం.   

మధుమేహం కోసం పునర్నవ - Punarnava for diabetes in Telugu

పునర్నవ యొక్క ఆకు పదార్థం ఒక సమర్థవంతమైన హైపోగ్లైసెమిక్(చక్కెర వ్యాధి స్థాయిలను తగ్గిస్తుంది) అని ఇన్ వివో అధ్యయనాలు సూచిస్తున్నాయి. క్రమం తప్పకుండా పునర్నవ ఆకు పధార్థాన్ని వినియోగించడం వల్ల శరీరంలో ఇన్సులిన్ యొక్క స్థాయిని అది పెంచుతుందని, దానివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడానికి దారితీస్తుందని తర్వాత సూచించబడింది. క్లోమంలో బీటా కణాలను పునరుద్దరించడం (ఇన్సులిన్ స్రావానికి సంబంధించి కణాల బాధ్యత) ద్వారా పునర్నవ రక్తంలో చక్కెర స్థాయిల్ని తగ్గిస్తుందని మరొక అధ్యయనం సూచించింది. క్లినికల్ ట్రయల్స్ లేనప్పుడు, పునర్నవ యొక్క యాంటి-డయాబెటిక్ ప్రభావాల గురించి ఎక్కువగా తెలుసుకునేందుకు మీ ఆయుర్వేదిక డాక్టరుతో పరీక్ష చేయించుకోవడం మంచిది.        

(మరింత చదవండి: డయాబెటిస్ చికిత్స

ఉబ్బసం కోసం పునర్నవ - Punarnava for asthma in Telugu

ఔషధశాస్త్రం మరియు ఫైటోకెమిస్ట్రీ యొక్క జర్నల్‌లోని వ్యాసం ప్రకారం, శ్వాస మార్గము నుండి శ్లేష్మంను తొలగించడాన్ని పునర్నవ ప్రేరేపిస్తుంది. పునర్నవ ఆకు పదార్థాలు ముఖ్యమైన ట్రాకియోరెలాక్సంట్ ప్రభావాలను ప్రదర్శిస్తాయని ప్రీ-క్లినికల్ అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాబట్టి, యాంటి-ఆస్థమా చికిత్సలో భవిష్యత్తులో కొంతవరకూ పునర్నవ ఉపయోగపడుతుందని ఊహించబడింది. ఆస్థమా రోగుల కొరకు పునర్నవ యొక్క సాధ్యమైన ప్రయోజనాలు నిర్ధారించేందుకు ఇప్పటివరకూ ఏ విధమైన మానవ అధ్యయనాలు అందుబాటులో లేవు.         

రక్తహీనత కోసం పునర్నవ - Punarnava for anemia in Telugu

ఆయుర్వేదం ప్రకారం,  శరీరంలో ఐరన్ లోపాలను సరిచేయడానికి పునర్నవ అద్భుతమైన ఏజెంట్‌గా పనిచేస్తుంది. పునర్నవ మండూర్, అనే ఒక ఆయుర్వేదిక సూత్రీకరణ, భారత దేశంలో జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకము ద్వారా యాంటీ-ఎనామిక్ ఏజెంట్‌గా ఉపయోగించబడుతుంది.   

పునర్నవ మండూర్‌ను సాధారణంగా మజ్జిగతో కలిపి ఇస్తారు. ఎందుకంటే తక్కువ pH స్థాయిల్లో ఐరన్ మెరుగ్గా గ్రహించబడుతుందని తెలియజేయబడింది. ఇటీవలి ఒక క్లినికల్ అధ్యయనంలో, వృద్ధాప్య రక్తహీనత కలిగిన 50 మంది రోగులకు (ముసలితనముకు సంబంధించి) పునర్నవ మండూర్ మాత్రలను రెండింటిని రోజుకు రెండుసార్లు మజ్జిగతో కలిపి 90 రోజుల సమయం వరకు ఇవ్వడం జరిగింది. రోగులందరిలో రక్తహీనత లక్షణాల తగ్గుదల గుర్తించబడిందని నివేదిక ఇవ్వబడింది.       

ఏదైనా ఆయుర్వేదిక సూత్రీకరణ తీసుకోవడానికి ముందుగా మీ ఆయుర్వేద డాక్టరుతో మాట్లాడవలసిందిగా ఎల్లప్పుడూ సిఫార్సు చేయబడుతుంది.   

మూత్రపిండాలకు సంబంధించి పునర్నవ ప్రయోజనాలు - Punarnava benefits for kidneys in Telugu

వివిధ మూత్రపిండ సమస్యల యొక్క చికిత్సకు సంబంధించి గిరిజన మరియు సంప్రదాయ వైద్య వ్యవస్థలు ద్వారా పునర్నవ ఆకులు, వేర్లు మరియు మొత్తం మొక్క ఉపయోగించబడుతుంది. పునర్నవ యొక్క సజల పదార్థాలు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటంలో ఒక గుర్తించదగ్గ నిరోధ ప్రభావం కలిగిఉన్నాయని ప్రయోగశాల-ఆధారిత అధ్యయనాలు సూచిస్తున్నాయి. అసంఖ్యాక జంతు-ఆధారిత అధ్యయనాలు పునర్నవ యొక్క మూత్రవర్ధక మరియు నెఫ్రోప్రొటెక్టివ్ ప్రయోజనాల్ని సూచిస్తున్నాయి. పునర్నవ వేర్లలో ఉండే నీటిలో కరిగే రసాయన సమ్మేళనం, పునర్నవీన్ ఈ ఔషధ మూలిక యొక్క మూత్రవర్ధక లక్షణాలకు ప్రధాన బాధ్యత కలిగిఉంటుందని తర్వాత ఇన్ వివో అధ్యయనం సూచనలు ఇచ్చింది.           

అధునాతన ఆయుర్వేదం, యోగి, యునాని, సిద్ధ మరియు హోమియోపతికి సంబంధించిన అంతర్జాతీయ జర్నల్‌లో పేర్కొన్న ఒక కేసు అధ్యయనం ఆధారంగా, పునర్నవ యొక్క ఆయుర్వేదిక సూత్రీకరణ ద్వారా తయారుచేయబడ్డ ఔషధాన్ని దీర్ఘకాల మూత్రపిండాల వైఫల్యముతో బాధపడుచున్న(సిహెచ్‌ఎఫ్, మూత్రపిండాల పనితీరులో క్రమంగా క్షీణత ఏర్పడడం) రోగికి ఆరు నెలల సమయం వరకు ఇవ్వాలని సూచించింది. ఆరు నెలల చివరి కల్లా, మూత్రపిండాల పనితీరులో గణనీయమైన అభివృద్ధి గుర్తించబడింది. అంతేకాక, ఆ వ్యక్తి డయాలసిస్ చేయించుకోవాల్సిన అవసరం ఏ మాత్రం లేదని తెలియజేయబడింది.      

పునర్నవడి, అనే ఒక ఆయుర్వేదిక సూత్రీకరణ, దీర్ఘకాల మూత్రపిండ వైఫల్యం యొక్క ప్రమాదాన్ని తగ్గించడం‌లో ప్రయోజకరమైనదని మరొక క్లినికల్ అధ్యయనం సూచించింది. అయినప్పటికీ, వివిధ మూత్రపిండ రుగ్మతలకు సంబంధించిన చికిత్సలకు పునర్నవ యొక్క ఖచ్చితమైన మెకానిజం మరియు మోతాదును నిర్ధారించడానికి ఎక్కువ అధ్యయనాలు అవసరమవుతాయి.    

కాలేయానికి సంబంధించి పునర్నవ ప్రయోజనాలు - Punarnava benefits for liver in Telugu

సంప్రదాయ మరియు నాటు వైద్య వ్యవస్థలలో అధిక కాలేయ సమస్యలకు ఉత్తమ చికిత్సగా పునర్నవ పరిగణించబడిందని ఎథ్నోఫార్మాకాలాజికల్ (ప్రజలలో సాధారణ వాడుక ఆధారంగా) అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ వాదనల ఆధారంగా, పునర్నవ యొక్క హెపటోప్రొటెక్టివ్ సామర్థ్యాన్ని నిర్ధారించేందుకు వివిధ ఇన్ వివో (జంతు ఆధారిత) అధ్యయనాలు జరిగాయి.  

పునర్నవ యొక్క వేరు పదార్థాల నిర్వహణ, శరీరం‌లోని సేరం అలెనైన్ అమినోట్రాన్స్‌ఫెరేస్ (ఎఎల్‌టి) స్థాయిల గణనీయమైన తగ్గుదలకు దారితీస్తుందని ఒక ఇన్ వివో ఆధారిత అధ్యయనం సూచించింది. ఎఎల్‌టి అన్నది వివిధ శారీరక క్రియల కోసం కాలేయం ద్వారా సాధారణంగా విడుదల చేయబడే ఒక ఎంజైము అయితే ఎఎల్‌టి అదనంగా విడుదల కావడం కాలేయం యొక్క అనుచిత పనితీరును సూచిస్తుంది.      

పునర్నవ యొక్క వేర్లు 1-3 సెం.మీ. పెరిగినప్పుడు పునర్నవను దిగుబడి చేసేందుకు మే నెల మంచి సమయమని ఒక అధ్యయనం సూచిస్తుంది. అటువంటి వేర్ల యొక్క సజల పదార్థాలు అద్భుతమైన హెపటోప్రొటెక్టివ్ ప్రయోజనాలు కలిగిఉంటాయని గుర్తించబడింది. కాలేయం యొక్క మంచి ఆరోగ్య నిర్వహణకు ఈ పునర్నవ ఔషధ మొక్క యొక్క సజల రూపం పౌడరు రూపం కంటే మరింత శక్తివంతమైనదని తర్వాత మరలా పేర్కొనబడింది.  

అయినప్పటికీ, ప్రస్తుత కేస్ అధ్యయనంలో, పునర్నవ మండూర్ గా తెలుపబడే ఒక ఆయుర్వేదిక సూత్రీకరణ కొంత హెపటోటాక్సిసిటీని ప్రదర్శిస్తుందని నివేదిక ఇవ్వబడింది. మీ కోసం ఏదైనా ఔషధ మూలిక యొక్క సరైన మోతాదు తెలిసిన ఆయుర్వేద డాక్టరును సంప్రదించాలని ధృఢంగా మీకు సిఫార్సు చేయబడింది.      

పునర్నవను అత్యధికంగా పునర్నవ మండూర్ మరియు పునర్నవ గుగ్గులు వంటి ఆయుర్వేదిక సూత్రీకరణ రూపాల్లో ఉపయోగిస్తారు.ఇది కొంతమంది ఆయుర్వేదిక డాక్టర్ల చేత పునర్నవ పౌడర్, ట్యాబ్లెట్లు, మరియు క్యాప్సూల్స్ వంటి రూపాల్లో కూడా సూచించబడింది.    

చర్మ సమస్యలకు సంబంధించి కొన్ని సంప్రదాయ చికిత్సల్లో పునర్నవ పేస్ట్‌ ను ఉపయోగిస్తారు.   

పునర్నవ టీ, కషాయం (కధా) మరియు కంటిని శుభ్రపరిచేవి కూడా ఉపయోగం‌లో ఉన్నాయి. పునర్నవను వైద్య ప్రయోజనాలకు మాత్రమే కాకుండా, పశ్చిమ బెంగాల్ మరియు అస్సాం లోని కొన్ని ప్రాంతాల్లో పునర్నవ ఆకులను ఆహారంగా కూడా ఉపయోగిస్తున్నారు.  

సాంప్రదాయకంగా, ఎటువంటి దుష్ప్రభావాలు చూపకుండా 15-20  గ్రాముల పునర్నవ పౌడర్ (పాలతో తీసుకోవాలి) మరియు 15 మి.లీ. పునర్నవ కషాయం ఉపయోగించవచ్చని తెలియజేయబడింది.  

అయినప్పటికీ,  మీ యొక్క శరీర రకం ఆధారంగా మరియు మానసిక పరిస్థితి ఆధారంగా పునర్నవ యొక్క ఖచ్చితమైన మోతాదు మారుతూ ఉంటుంది. పునర్నవను ఏదైనా రూపంలో తీసుకునేందుకు ముందుగా మీ ఆయుర్వేద వైద్యుడిని మీరు అడుగవలసిందిగా ఎల్లప్పుడూ సలహా ఇవ్వబడుతుంది.    

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj Hair Oil
₹546  ₹850  35% OFF
BUY NOW
  • ఒకవేళ ప్రస్తుతం మీరు ఏదైనా ఒక మెడిసిన్‌ను తీసుకుంటుంటే, మందు చర్యతో అది జోక్యం కలుగజేసుకోకుండా, పునర్నవను తీసుకోవడానికి ముందుగా మీరు ఆయుర్వేదిక వైద్యుడిని కలవాలని మీకు సూచించబడింది.
  • గర్భవతులు మరియు పాలు ఇచ్చే తల్లుల కోసం పునర్నవ యొక్క భద్రతను నిర్ధారించేందుకు ఏ విధమైన తెలిసిన పరిశోధనలు లేవు. పునర్నవను ఏదైనా ఒక రూపంలో తీసుకునేందుకు ముందుగా మీ డాక్టరుతో మీరు పరీక్ష చేయించుకోవాలని సలహా ఇవ్వబడింది.  
  • పునర్నవ అన్నది ఒక మూత్రవిసర్జనగా తెలియజేయబడింది, అనగా ఇది మీ శరీరం నుండి నీటిని కోల్పోవడానికి దారితీస్తుంది. పునర్నవను తీసుకునేందుకు ముందుగా మీరు మోడరేషన్ అనుసరించవలసిన అవసరం ఉంది మరియు మీ శరీర పరిస్థితి మరియు లక్షణాల ప్రకారం ఈ మూలిక యొక్క సరియైన మోతాదును తెలుసుకునేందుకు మీ డాక్టరుతో మీరు మాట్లాడాలి.      

Medicines / Products that contain Punarnava

వనరులు

  1. Sharma J, Gairola S, Gaur RD, Painuli RM. The treatment of jaundice with medicinal plants in indigenous communities of the Sub-Himalayan region of Uttarakhand, India. J Ethnopharmacol. 2012 Aug 30;143(1):262-91. PMID: 22759701
  2. Devesh Tewari et al. Ethnopharmacological Approaches for Therapy of Jaundice: Part I. Front Pharmacol. 2017; 8: 518. PMID: 28860989
  3. Zhengtao Liu et al. Alanine Aminotransferase-Old Biomarker and New Concept: A Review. Int J Med Sci. 2014; 11(9): 925–935. PMID: 25013373
  4. Rawat AK, Mehrotra S, Tripathi SC, Shome U. Hepatoprotective activity of Boerhaavia diffusa L. roots--a popular Indian ethnomedicine. J Ethnopharmacol. 1997 Mar;56(1):61-6. PMID: 9147255
  5. Kunal K Dalal, Thomas Holdbrook, Steven R Peikin. Ayurvedic drug induced liver injury. World J Hepatol. 2017 Nov 8; 9(31): 1205–1209. PMID: 29152040
  6. National Health Service [Internet]. UK; Chronic kidney disease.
  7. G. S. Prashanth, M. S. Baghel, B. Ravishankar, S. N. Gupta, Miten P. Mehta. A clinical comparative study of the management of chronic renal failure with Punarnavadi compound. Ayu. 2010 Apr-Jun; 31(2): 185–192. PMID: 22131708
  8. Megha G. Pandya, Alankruta R. Dave. A clinical study of Punarnava Mandura in the management of Pandu Roga in old age (geriatric anemia). Ayu. 2014 Jul-Sep; 35(3): 252–260. PMID: 26664234
  9. Irié-N'guessan G, Champy P, Kouakou-Siransy G, Koffi A, Kablan BJ, Leblais V. Tracheal relaxation of five Ivorian anti-asthmatic plants: role of epithelium and K⁺ channels in the effect of the aqueous-alcoholic extract of Dichrostachys cinerea root bark. J Ethnopharmacol. 2011 Nov 18;138(2):432-8. PMID: 21963567
  10. Mehrotra S, Mishra KP, Maurya R, Srimal RC, Singh VK. Immunomodulation by ethanolic extract of Boerhaavia diffusa roots.. Int Immunopharmacol. 2002 Jun;2(7):987-96. PMID: 12188040
  11. Barthwal M, Srivastava K. Histologic studies on endometrium of menstruating monkeys wearing IUDs: comparative evaluation of drugs. Adv Contracept. 1990 Jun;6(2):113-24. PMID: 2403030
  12. Biomed Res Int. 2014; 2014: 808302. Ayurvedic formulations containing BD as main ingredient. [Internet]
  13. Shikha Mishra, Vidhu Aeri, Praveen Kumar Gaur, Sanjay M. Jachak. Phytochemical, Therapeutic, and Ethnopharmacological Overview for a Traditionally Important Herb: Boerhavia diffusa Linn. Biomed Res Int. 2014; 2014: 808302. PMID: 24949473
  14. Sreeja S, Sreeja S. An in vitro study on antiproliferative and antiestrogenic effects of Boerhaavia diffusa L. extracts. J Ethnopharmacol. 2009 Nov 12;126(2):221-5. PMID: 19723573
  15. Mehrotra S, Singh VK, Agarwal SS, Maurya R, Srimal RC. Antilymphoproliferative activity of ethanolic extract of Boerhaavia diffusa roots. Exp Mol Pathol. 2002 Jun;72(3):236-42. PMID: 12009788
Read on app