ఆనల్ ఫిషర్ అంటే ఏమిటి?
ఆనల్ ఫిషర్ అనేవి మలద్వారం వద్ద చిన్న, సన్నని, అండాకార ఆకారపు పగుళ్లు లేదా పుండ్లు. అవి సాధారణంగా మలద్వార మార్గము యొక్క గోడల మీద వస్తాయి, ముఖ్యంగా వెనుక వైపున ఉంటాయి. మలద్వార మార్గము అనేది పురీషనాళం మరియు మలద్వారం మధ్య ఒక గొట్టం వంటి నిర్మాణం. పాయువు/మలద్వారం వద్ద రక్తస్రావంతో బాధ మరియు నొప్పి అనేవి ఈ వ్యాధి సాధారణ లక్షణాలు. అవి ఏ వయసులో వారికైనా సంభవించవచ్చు. సాధారణంగా, వాటిని మొలల వ్యాధి అని భ్రమపడతాము. ఫిషర్లు తీవ్రముగా లేదా దీర్ఘకాలికంగా ఉంటాయి. తీవ్రమైన ఫిషర్లు ఒక చిన్న పగులు మాదిరిగా ఉంటాయి, కానీ దీర్ఘకాలిక ఫిషర్లు మలద్వార మార్గము యొక్క గోడల మీద చర్మం గడ్డల్లా ఉంటాయి.
ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
నొప్పి మరియు రక్తస్రావం అనేవి సాధారణ లక్షణాలు. సాధారణంగా, నొప్పి ప్రేగుల కదలికల సమయంలో ప్రారంభమవుతుంది మరియు కొన్ని గంటల పాటు కొనసాగుతుంది. దురద మరియు వాపు కూడా అనుభవించబడుతున్నాయి. నొప్పి తీవ్రత సహించదగినది, కానీ కొన్నిసార్లు తీవ్రమైన నొప్పి అనుభవించవచ్చు.ఎర్రటి రక్తం మచ్చలు మలంపై, లేదా టిష్యూ పేపర్ మీద లేదా మలద్వారం చుట్టూ కనిపిస్తాయి. పాయువు/మలద్వార చర్మంపై ఒక సన్నని పగులు కనిపిస్తుంది. ఈ వ్యక్తికి సాధారణంగా రెండు ప్రేగు కదలికల మధ్య ఈ లక్షణాల నుండి స్వేచ్చగా లభిస్తుంది.
ప్రధాన కారణాలు ఏమిటి?
ఆనల్ ఫిషర్లు అనేవి మలద్వార మార్గము ద్వారా మలబద్దకం వలన, గట్టి, భారీ మలం ప్రయాణించినప్పుడు ప్రధానంగా ఉత్పన్నమవుతాయి. క్రోన్'స్ వ్యాధి వంటి ప్రేగు వాపు వ్యాధుల వలన కూడా ఈ ఫిషర్లు ఏర్పడవచ్చు. గర్భం ధరించినప్పుడు మరియు ప్రసవ సమయంలో కూడా ఫిషర్లు సంభవించవచ్చు. విరేచనాలు మరియు నిరంతరంగా వచ్చే అతిసారం కూడా ఒక అంతర్లీన కారణం కావచ్చు.
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వైద్యులు ఒక వేలుకు తొడుగు(glove) ధరించన వేలుని పెట్టడం ద్వారా లేదా ఒక అనోస్కోప్ (ఒక చివరలో కెమెరాను అమర్చిన ఒక సన్నని గొట్టం) లోపలకు పెట్టడం ద్వారా మలద్వార మార్గాన్ని తనిఖీ చేస్తారు. ఆనల్ ఫిషర్ యొక్క స్థానం కూడా సాధ్యమయ్యే కారణాన్నితెలుపుతుంది. క్రోన్'స్ వ్యాధి కారణంగా ఫిషర్లు అనేవి వెనుక లేదా ముందు కన్నా పక్కన సంభవించవచ్చు. అవసరమైతే, మరింత నిర్ధారణ కోసం లేదా అంతర్లీన పరిస్థితులను విశ్లేషించడానికి, వైద్యులు బాధిత వ్యక్తి యొక్క పరిస్థితిని బట్టి సిగ్మాయిడోస్కోపీ (sigmoidoscopy) లేదా కోలొనోస్కోపీ (colonoscopy)ను ఉపయోగించవచ్చు.
ఆనల్ ఫిషర్లను సులభంగా చికిత్స చేయవచ్చు మరియు కొన్ని వారాల్లో వాటికవే తగ్గిపోతాయి కానీ, అంతర్లీన పరిస్థితులకు చికిత్స చేయకపోతే పునరావృతమవుతాయి. సాధారణంగా, పీచుపదార్థం (ఫైబర్) అధికంగా ఉండే ఆహారం మరియు నీరు పుష్కలంగా తాగడం వల్ల మలమును మృదువుగా చేయవచ్చు మరియు పెద్ద మొత్తంలో మలాన్ని సులభంగా బయటకు పంపించవచ్చు, తద్వారా మరింత నష్టం జరగకుండా నిరోధించి మరియు ఆనల్ ఫిషర్లను నయం చేయడానికి కుదురుతుంది. మలద్వార నొప్పి నుండి ఉపశమనం అందించడానికి మత్తుమందులను సమయోచితంగా వాడవచ్చు. మలాన్ని మృదువు చేసే మందులను కూడా చికిత్సలో సూచించబడతాయి.
రోజులో 10-20 నిమిషాల పాటు పలు సార్లు ఒక వెచ్చని తొట్టి స్నానం చేస్తే మలద్వార కండరాలకు ఉపశమనాన్నీ కలిగించి మరియు విశ్రాంతిని కలుగ చేస్తుంది. నార్కోటిక్ నొప్పి మందులు మలబద్ధకాన్నీ ప్రేరేపించడం వలన వాటిని ఉపయోగించరాదు. నైట్రో-గ్లిసరిన్ (nitro-glycerine) లేపనం మరియు కాల్షియం ఛానల్ బ్లాకర్ల (calcium channel blockers) వంటి మందులు ఉపయోగించబడతాయి. చాలా అరుదుగా శస్త్రచికిత్స చికిత్సను నిర్వహిస్తారు. శస్త్ర చికిత్సలో బోట్యులిన్ టాక్సిన్ ఇంజెక్షన్ (botulinum toxin injection) మరియు స్పిన్స్టెరోటోమీ (sphincterotomy) (anal sphincter కు సంబంధించిన శస్త్రచికిత్స) ఉంటుంది. శస్త్రచికిత్సా విధానాలతో ప్రేగు నియంత్రణ కోల్పోయే ప్రమాదం తక్కువగానే ఉంటుంది.