తేనెటీగ కుట్టడం - Bee Sting in Telugu

Dr. Rajalakshmi VK (AIIMS)MBBS

November 30, 2018

March 06, 2020

తేనెటీగ కుట్టడం
తేనెటీగ కుట్టడం

తేనెటీగ కుట్టడం అంటే ఏమిటి?

తేనెటీగ కుట్టడం అంటే సామాన్యంగా తేనెటీగతో కుట్టించుకోవడం కానీ అది చాలా సమస్యాత్మకమైనది. ఇతర పురుగుల కుట్టడం కంటే తేనెటీగ కుట్టడం అనేది మరింత భాదపెడుతుంది, ఎందుకంటే అవి ఆమ్లాధారమైనవి (acidic). అందుకే శరీరం వాటికి భిన్నంగా స్పందిస్తుంది.

తేనెటీగ కుట్టిన ఒక వ్యక్తికి  గతంలో తేనెటీగ కుట్టడం వలన అలెర్జీ ప్రతిచర్యలు కలిగి ఉంటే, అది ప్రాణాంతకమవుతుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ఒక తేనెటీగ కాటు ప్రతి వ్యక్తికి వేర్వేరు ప్రతిచర్యలను కలుగచేస్తుంది లేదా ఒకే వ్యక్తిలో వేర్వేరు ప్రతిచర్యలను సృష్టించగలదు. ప్రతిచర్యలు తేలికపాటి (mild) , మితమైన (moderate)  మరియు తీవ్రమైన (severe) విధాలుగా  వర్గీకరించబడ్డాయి.

  • ఒక రోజు లోపులోనే  తేలికపాటి (mild)  ప్రతిచర్యలు పరిష్కరించబడతాయి.
    • కుట్టిన ప్రదేశం వద్ద మంట మరియు నొప్పి
    • ఎరుపుదనం  మరియు స్వల్ప వాపు
  • మితమైన (moderate)ప్రతిచర్యలు తగ్గడానికి ఒక వారం పడుతుంది.
    • వాపు,  క్రమంగా దాని పరిమాణం పెరుగుతుంది
    • కొన్ని రోజులు నిరంతర ఎరుపుదనం
  • తీవ్రమైన (severe) ప్రతిచర్యలను అనాఫిలాక్టిక్ ప్రతి చర్యలు అంటారు. అవి  ప్రాణాంతకం కావొచ్చు మరియు తక్షణమే వైద్య చికిత్స అత్యవసరమని భావిస్తారు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

  • ఒక వ్యక్తి ఒక తేనెటీగలోకుట్టించుకున్నపుడు, దాని కొండి చర్మంలోకి విషాన్ని విడుదల చేస్తుంది. ఇది నొప్పి మరియు వాపుకు  కారణమవుతుంది.
  • తేనె పట్టు చుట్టూ ఉన్న ప్రాంతాలలో నివసించే ప్రజలు లేదా తేనెటీగలతో పనిచేసేవారు తేనెటీగ కాటుకు గురికావడానికి ఎక్కువ అవకాశాన్ని కలిగి ఉంటారు.
  • గతంలో ఒక తేనెటీగతో కుట్టించుకున్న వ్యక్తికి  మరింత తీవ్రమైన ప్రతిచర్య ప్రమాదం ఉంటుంది.

ఎలా నిర్ధారించాలి  మరియు చికిత్స ఏమిటి?

  • తేనెటీగ కుట్టినట్లైతే, వ్యక్తి తేనెటీగ విషానికి ప్రతికూలామా  (allergic) అని తనిఖీ చేయడానికి పరీక్షలు చేయాలి. అవి:
    • IgE యాంటీబాడీస్ అని పిలిచే కొన్ని యాంటీబాడీస్ స్థాయిలు పరీక్ష కోసం రక్త పరీక్ష.
    • ఒక చర్మ మచ్చ పరీక్ష (skin patch test), దీనిలో వ్యక్తి ప్రతిచర్యను అభివృద్ధి చేస్తారా అని  చూడటానికి విషం యొక్క చిన్న మొత్తాన్ని లోపలికి పంపిస్తారు.
  • తేలికపాటి ప్రతిచర్య కోసం, శరీరంలో  విషాన్ని తగ్గించడానికి, కొండిని తొలగించి, ఒక సమయోచిత స్టెరాయిడ్ క్రీమ్ ను పూయాలి. యాంటిహిస్టామైన్లను (Antihistamines) కూడా చల్లని కాపాడంతో పాటు ఉపయోగించవచ్చు.
  • తీవ్రమైన సందర్భాల్లో, అనాఫిలాక్సిస్ కోసం ఎపినేఫ్రిన్ ఇంజక్షన్ (epinephrine injection), అనుబంధక  ఆక్సిజన్ మరియు ఇంట్రావీనస్ ద్రవం నిర్వహణను కలిగి ఉన్న తక్షణ చికిత్స అవసరం. అనాఫిలాక్సిస్ అనేది వైద్య అత్యవసరం, దానికి  తక్షణ చికిత్స చేయాలి.



వనరులు

  1. Journal of allergy and clinical immunology. Allergy in its relation to bee sting. American Academy of Allergy, Asthma & Immunology. [internet].
  2. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Bites and stings
  3. United States Department of Agriculture. Bee Stings / Safety. National Nutrient Database for Standard Reference Legacy Release; Agricultural Research Service
  4. William W. Busse, MD; Charles E. Reed, MD; Lawrence M. Lichtenstein. Immunotherapy in Bee-Sting Anaphylaxis. JAMA. 1975;231(11):1154-1156. doi:10.1001/jama.1975.03240230028014
  5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Bee sting

తేనెటీగ కుట్టడం వైద్యులు

Dr. kratika Dr. kratika General Physician
3 Years of Experience
Dr.Vasanth Dr.Vasanth General Physician
2 Years of Experience
Dr. Khushboo Mishra. Dr. Khushboo Mishra. General Physician
7 Years of Experience
Dr. Gowtham Dr. Gowtham General Physician
1 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు