మూత్రాశయ వ్యాధి ఏమిటి?
మూత్రాశయ సంక్రమణం (సిస్టిటిస్) వ్యాధి అనేది పిల్లలు మరియు పెద్దలను ఒకేలా బాధించే మూత్ర మార్గ సంక్రమణం. మూత్రనాళంలోనే ఈ వ్యాధిబాధిత ప్రాంతాలేవంటే మూత్రపిండాలు (పైలోనెఫ్రిటిస్) మరియు మూత్రమార్గం. (urethritis). పురుషులు కంటే మూత్రపిండాల సంక్రమణకు మహిళలు ఎక్కువగా గురవుతుంటారు. మూత్రవిసర్జన సమయంలో తరచుగా మంట (బర్నింగ్) తరచూ మూత్ర విసర్జనాలు ఈ మూత్రపిండ సంక్రమణ వ్యాధి యొక్క అత్యంత సాధారణ లక్షణాలు. దీనికి చికిత్స చేయనిపక్షంలో మూత్రపిండాలకు మరియు మూత్రమార్గానికి కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ మూత్రాశయ సంక్రమణ వ్యాధిని వదిలించుకోవడానికి మరియు వ్యాధి లక్షణాల ఉపశమనానికి యాంటీబయాటిక్స్ని సూచిస్తారు.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
మూత్రాశయ సంక్రమణ వ్యాధికి సంబంధించిన లక్షణాలు తరచుగా అధికమైన బాధ, యిబ్బందితో కూడుకుని ఉన్నవై ఉంటాయి. వీటితొ పాటు:
- మూత్రవిసర్జన చేసేటప్పుడు నొప్పి లేదా మంట సంభవిస్తుంది. (మరింత సమాచారం: నొప్పితో కూడిన మూత్రవిసర్జన కారణాలు)
- మూత్రవిసర్జనకు పోయి వచ్చిన వెంటనే తిరిగి మూత్రవిసర్జనకు పోవాలనిపిస్తుంది, ఇది తరచూ జరుగుతూ ఉంటుంది. ఇలా రోజంతా మరియు రాత్రి అంతటా బాధించవచ్చు.
- మూత్రవిసర్జనకు పోవాలనిపించినపుడు మూత్రాన్ని కొద్దిసేపు కూడా ఆపుకోలేక పోయే అసమర్థత
- మూత్రం రంగులో మార్పు- మేఘావృతంరంగు, ముదురు రంగు, మొ.
- తీవ్రమైన సంక్రమణ విషయంలో మూత్రంలో రక్తం
- మూత్రం ఘాటైన దుర్వాసన
- సాధారణ బలహీనతతో పొత్తి కడుపు నొప్పి
- అధిక-స్థాయి సంక్రమణకు సంబంధించి చలితో కూడిన జ్వరం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
చాలా సందర్భాలలో మూత్ర నాళాల అంటువ్యాధులు లేదా మూత్రాశయం అంటువ్యాధులు ఇ. కోలి అని పిలువబడే ఒక రకం బాక్టీరియా వలన సంభవిస్తుంది .
మూత్రాశయ సంక్రమణ ప్రమాదాన్ని పెంచే కారకాలు కూడా ఉన్నాయి
- మూత్రాశయంలో ఎక్కువకాలం పాటు ఉంచబడిన కాథెటర్ వల్ల
- లైంగిక సంపర్కం, ముట్లుడగడం (మెనోపాజ్), గర్భనిరోధకం యొక్క అవరోధ పద్ధతులు (డయాఫ్రాగమ్), గర్భం మొదలైనవి. ఈ కారణాలవల్ల సాధారణంగా మహిళలలో మూత్రాశయం సంక్రమించే అవకాశం ఉంది. మహిళల్లో మూత్రనాళం యొక్క తక్కువ పొడవు మరియు పాయువుకు సమీపంలో మూత్రాశయ ప్రారంభ స్థానం కారణంగా మూత్రాశయ వ్యాధులకు మహిళలు ఎక్కువగా గురవుతూ ఉంటారు.
- చక్కెరవ్యాధి (డయాబెటిస్)
- విస్తరించిన ప్రోస్టేట్ గ్రంధి
- ముసలితనం, మరియు ఎక్కువకాలంపాటు కదలలేని స్థితితో కూడిన దీర్ఘకాలిక అనారోగ్యం
- మూత్ర మార్గానికి సంబంధించిన శస్త్ర చికిత్స లేక ఇతర చికిత్సా పద్దతులు
దీన్ని ఎలా నిర్ధారించేది మరియు దీనికి చికిత్స ఏంటి?
వైద్యులు వ్యాధి లక్షణాలు మరియు శారీరక పరీక్షల ఆధారంగా మూత్రాశయం సంక్రమణను నిర్ధారిస్తారు. రోగ నిర్ధారణ నిర్ధారణలో సహాయపడే పరీక్షలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
మూత్ర విశ్లేషణ
- డిప్-స్టిక్ పరీక్షను మూత్రంలో పెరిగిన ఆమ్లత్వాన్ని సంక్రమణ సమయంలో గుర్తించడానికి ఉపయోగిస్తారు. ఇది మూత్రంలో సంక్రమణను గుర్తించటానికి చాలా తక్కువ ధర కల్గిన పరీక్ష.
- నైట్రైట్స్ (Nitrites) మరియు ల్యూకోసైట్ ఎస్టేరేజ్ పరీక్షలు సంక్రమణ సమయంలో మూత్రంలో తెల్ల రక్త కణాల ఉనికిని గుర్తించడానికి చేయబడతాయి.
- ప్రయోగశాలలో కృత్రిమ మాధ్యమంలో మూత్రం నమూనాలో సంక్రమణనికి -కారణమయ్యే బాక్టీరియా పెరుగుదలను అంచనా వేయడానికి “మూత్ర సంస్కృతి” (urine culture) పరీక్ష జరుగుతుంది.
ఇమేజింగ్ స్టడీస్ పరీక్షలు
అధిక-స్థాయి మరియు పునరావృత అంటువ్యాధులు, లేదా ప్రామాణిక చికిత్సకు స్పందించని మూత్రాశయపు అంటురోగాల సందర్భాలలో అనేక ఇతర పరిశోధనలు జరుగుతాయి.ఆ ఇతర పరిశోధనలు ఏవంటే:
- మూత్రాశయాంతర్దర్శిని (Cystoscopy)
- అల్ట్రాసౌండ్
- ఎక్స్-రే (X- రే) ఇమేజింగ్
- ఇంట్రావెనస్ పైలెగోగ్రామ్ (IVP)
- కంప్యూటెడ్ టోమోగ్రఫీ స్కాన్ (CT స్కాన్)
- అయస్కాంత ప్రతిధ్వని ఇమేజింగ్ (Magnetic resonance imaging (MRI))
- చురుకుదనం అధ్యయనాలు (Urodynamic studies)
మూత్రాశయ సంక్రమణ యొక్క చికిత్స అనారోగ్యంతో బాధపడుతున్న రోగిని వ్యాధి లక్షణాల నుండి సంరక్షించి ఉపశమనాన్ని కల్గించడానికి. చికిత్స వ్యాధిని నిర్మూలించడానికి ఉద్దేశించబడింది.
యాంటిబయాటిక్స్
- మూత్రాశయ సంక్రమణ వ్యాధి సాధారణంగా పెద్దలకైతే 5 రోజుల్లో మరియు 2 నుండి 3 రోజుల్లో పిల్లలకు యాంటీబయాటిక్ కోర్సు ఇవ్వడంతో నయమవుతుంది.
- యాంటీబయాటిక్స్ మందుల్ని దీర్ఘకాలంపాటు సేవించడంవల్ల మూత్రాశయ సంక్రమణం యొక్క పునరావృతాన్ని ఆలస్యం (could be delayed) చేయవచ్చు.
- తీవ్ర అంటువ్యాధుల విషయంలో ఇంట్రావీనస్ యాంటిబయోటిక్స్ మందులు ఇవ్వబడతాయి.
ఇతర మందులు
-
యూరిన్ ఆల్కలీసర్లు (Urine alkalisers) మందులు మూత్రం యొక్క ఆమ్లతను తగ్గిస్తాయి మరియు మంటను కూడా తగ్గిస్తాయి.
స్వీయ రక్షణ Self-care
- ద్రవాహారాలను పుష్కలంగా త్రాగాలి: తరచు మూత్రవిసర్జన ద్వారా ఈ మూత్రాశయ సంక్రమణను తొలగించుకోవడానికి ద్రవాహారాలను పుష్కలంగా త్రాగాలి.
- మూత్ర నాళాల సంక్రమణ సమయంలో ఇబ్యుప్రొఫెన్ లేదా ఆస్పిరిన్ వంటి NSAIDs (నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్) తీసుకోవడం మానుకోండి .
- క్రాన్బెర్రీ జ్యూస్ మూత్రాశయ వ్యాధుల పునరావృత నివారణకు సహాయపడుతుంది.
కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి వేడినీటి కాపడాలు సహాయపడతాయి.