మెదడుకు గాయం అంటే ఏమిటి?
మెదడుకు గాయం అనేది మెదడు కణాలకు సంభవించే ఏదైనా హాని లేదా నష్టం, దీనివల్ల వ్యక్తి మరణం సంభవించవచ్చు లేదా నాశనానికి దారి తీయొచ్చు. బాహ్య గాయం లేదా అంతర్గత కారణాల వలన మెదడుకు గాయం సంభవించవచ్చు . మెదడు అన్ని శరీర కార్యకలాపాలకు నియంత్రణ కేంద్రంగా ఉంటుంది, కాబట్టి మెదడుకు ఏదైనా గాయం అయితే శరీర పనితీరు తీవ్రంగా దెబ్బ తింటుంది. మెదడు గాయాలు జన్మతః (పుట్టుక నుండి) లేదా మధ్యలో దాపురించినవి కూడా అవచ్చు. మెదడుకు అయిన గాయం యొక్క తీవ్రత ఆధారంగా, మెదడుకు గాయం రుగ్మత (లక్షణాలు) తేలికపాటి స్థాయి నుండి మితమైనదిగా లేదా తీవ్రంగా ఉంటుంది మరియు తరచుగా ప్రాణాంతకం కూడా కావచ్చు.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
మెదడుకు గాయం రుగ్మత యొక్క సంకేతాలు మరియు లక్షణాలు మెదడుకు ఏ భాగంలో గాయమైందో దాని మీద ఆధారపడి ఉంటాయి. ఈ లక్షణాల్ని విస్తృతంగా అభిజ్ఞాత్మకమైనవి, ప్రవర్తనా-సంబంధమైనవి, గ్రహణశక్తికి సంబంధించినవి మరియు భౌతిక-సంబంధమైనవిగా వర్గీకరించబడ్డాయి.
అభిజ్ఞాత్మక లక్షణాలు:
- అవగాహన చేసుకోవడంలో కఠినత
- ఆలోచనలు మరియు ఆలోచనల వ్యక్తీకరణలో కఠినత
- సావధానత లోటు
- నిర్ణయాలు తీసుకోవడంలో దీనత్వం
- జ్ఞాపకశక్తి తగ్గుదల
ప్రవర్తనా లక్షణాలు:
జ్ఞాన లక్షణాలు:
- దృష్టి, వినికిడి లేదా స్పర్శజ్ఞానంలో మార్పు
- దిక్కుతోచని స్థితి (స్థితి నిర్ధారణ రాహిత్యము)
- రుచి మరియు వాసన జ్ఞానంలో మార్పు
- సంతులనంతో కఠినత
- తగ్గిన నొప్పి సహిష్ణత
భౌతిక లక్షణాలు:
- తీవ్రమైన మరియు నిరంతర తలనొప్పి
- అలసట
- పక్షవాతం
- కంపవాతం మరియు మూర్ఛలు
- ఫోటోఫోబియా (కాంతి సున్నితత్వం)
- మాట్లాడడంలో స్పష్టత లేకపోవడం
- స్పృహ కోల్పోవడం
- నిద్రా భంగం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
మెదడుకు గాయం రుగ్మత ప్రధానంగా మెదడుకు ప్రాణవాయువు సరఫరా తక్కువైనపుడు సంభవిస్తుంది, ఇది మెదడు హైపోక్సియా (కణజాలంలో తక్కువ ఆక్సిజన్) ఫలితంగా వస్తుంది. ఈ రుగ్మతకు కారణాలు బాహ్యమైనవి మరియు అంతర్గతమైనవిగా వర్గీకరించబడ్డాయి.
బాహ్య (బాధాకరమైన) గాయం కారణాలు:
- కింద పడడం
- వాహన గాయాలు
- క్రీడల గాయాలు
- తలకు దెబ్బ
అంతర్గత మెదడు గాయానికి కారణాలు:
- స్ట్రోక్ (ఆఘాతం)
- కణితి (కంతి లేక ట్యూమర్)
- రక్తప్రసారం (మెదడులో రక్తనాళ వైకల్యం)
- ఇన్ఫెక్షన్
- విషప్రయోగం
- మందుల దుర్వినియోగం
- నరాల వ్యాధి
మెదడుకు గాయం రుగ్మతను ఎలా నిర్ధారిస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
మెదడుకు గాయం యొక్క నిర్ధారణలో రోగి యొక్క వివరణాత్మక వైద్య చరిత్ర మరియు భౌతిక పరీక్ష సహాయపడతాయి. అయితే, మెదడుకైన గాయం యొక్క తీవ్రత మరియు రోగ నిరూపణ గురించి తెలుసుకోవడానికి కొన్ని పరిశోధనలు తప్పనిసరి. ఆ పరీక్షలు:
- కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT) స్కాన్: ఇది మెదడుకు గాయం అయిందని అనుమానించిన వెంటనే చేసే మొదటి రేడియోలాజికల్ పరీక్ష. ఇది పుర్రె పగుళ్లు, రక్తస్రావం, మెదదుకాణాల్లో గడ్డకట్టిన రక్తం వాపు, మరియు కణజాల వాపును కనుగొనడంలో సహాయపడుతుంది .
- మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI) స్కాన్: ఇది చాలా ముఖ్యమైనది మరియు CT స్కాన్తో పోలిస్తే MRI మెరుగైన ఖచ్చితత్వం కల్గి ఉంటుంది. MRI స్కాన్ మెదడు మరియు దాని వివిధ భాగాల యొక్క వివరణాత్మక చిత్రాన్ని ఇస్తుంది.
గ్లాస్గో కోమా స్కేల్ ను మెదడుకు గాయం యొక్క తీవ్రతను మూల్యాంకనం చేయడానికి వైద్యులు ఉపయోగిస్తారు. ఇందులో ఎక్కువ స్కోర్లు అయితే తేలికపాటి తీవ్రగాయం అయినట్టు, తక్కువ స్కోర్లు సూచిస్తే తీవ్రమైన గాయానికి రోగి లోనైనట్టు అర్థమవుతుంది.
మెదడుకు గాయం చికిత్స ప్రధానంగా దాని తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. తేలికపాటి గాయం అయితే సాధారణంగా లక్షణాల పరిశీలన అవసరమవుతుంది, ఏ చికిత్స అవసరం ఉండదు. మరోవైపు, మెదడుకైన మధ్యరకం స్థాయి గాయాలు నుండి తీవ్రమైన గాయాలకు ప్రభావకారి చికిత్స అవసరం.
మెదడుకు గాయం రుగ్మతకు మందులు ఉన్నాయి. ఆ మందులివి:
- మూర్ఛ-నియంత్రిత మందులు (Anti-seizure drugs) - మూర్ఛలు రావడమనేది “మెదడుకు గాయం” రుగ్మతకు సాధారణ వ్యాధి లక్షణం, ఇది మెదడుకు మరింత నష్టం కలిగిస్తుంది. అందువల్ల, చికిత్సలో మూర్ఛ-నియంత్రిత మందులు గొప్ప సహాయంగా ఉన్నాయి.
- మూత్రకారక మందులు - కొన్ని రకాల మెదడు గాయాలు మెదడు చుట్టూ వాపును కలుగజేస్తాయి. మూత్రవికారక మందుల సేవనం ఈ వాపును తగ్గిస్తుంది మరియు ఒత్తిడి లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతాయి.
- కోమా స్థితిని ప్రేరేపించే మందులు - మెదడు దానంతటదే స్వంతంగా కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అది అదనపు ఆక్సిజన్ను ఉపయోగించుకోవడం మొదలుపెడుతుంది. అయితే, ఇలాంటి సమయంలో రక్త నాళాలు సంపీడనానికి (compressed) గురై దెబ్బతిన్నట్లయితే, అది తగినంతగా ఆక్సిజన్ను పొందలేకపోవచ్చు, మరి ఈ సంపీడనంవల్ల మెదడు కణాలు మరింతగా గాయాలకు గురై, కణాలు చచ్చిపోతాయి. దీనిని నివారించడానికే, కోమా-ప్రేరిత మందుల సాయంతో మెదడు కణాలకు ఆక్సిజన్ అవసరాన్ని డాక్టర్లు తగ్గిస్తారు, తద్వారా మెదడుకణాల పనితీరును మెరుగుపరుస్తారు.
‘మెదడుకు గాయం’ రుగ్మతకు లభ్యంలో ఉన్న శస్త్రచికిత్స అనేక పద్ధతులను కలిగి ఉంటుంది. వాటిల్లో సాధారణమైనవి ఏవంటే:
- పుర్రె పగుళ్లకు మరమ్మతులు చేసి నయం చేయడం
- మెదడు నుండి రక్తం గడ్డకట్టడాన్ని తొలగించడం
- రక్తస్రావానికి గురైన రక్తనాళాన్ని కుట్టివేసి సరిచేయడం
- పీడనం నుండి ఉపశమనం పొందడానికి పుర్రెలో ఒక కిటికీని సృష్టించడం
శస్త్రచికిత్స మరియు మందులు కాకుండా, మెదడు యొక్క పనితీరు మరియు మెదడు దెబ్బతినడం ద్వారా ప్రభావితమైన అవయవాలను మెరుగుపరిచేందుకు పునరావాసం అవసరమవుతుంది. పునరావాసంలో ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, కౌన్సిలింగ్ మరియు రిక్రియేషనల్ థెరపీ ఉన్నాయి.