సెరిబ్రల్ మలేరియా అంటే ఏమిటి?
సెరిబ్రల్ మలేరియా (CM), మలేరియా యొక్క క్లిష్టమైన పరిస్థితి, మూర్ఛ మరియు కోమా లక్షణాలు కలిగించే ఒక నరాల వ్యాధి. ఇది మలేరియా వ్యాప్తి చెందే ప్రాంతాలలో నివసించే చిన్న పిల్లలలో మరియు పెద్దలలో ప్రధానంగా కనిపిస్తుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
సంక్రమిత (infected) దోమ కాటు తర్వాత 2 వారాల లోపు సెరిబ్రల్ మలేరియా (CM) అభివృద్ధి చెందుతుంది మరియు 2 నుంచి 7 రోజులకు జ్వరం వస్తుంది. ఇది అసాధారణ ప్రవర్తన, బలహీనమైన స్పృహ, ఎపిలెప్టిక్ ఫిట్స్ (epileptic fits), కోమా మరియు ఇతర నరాలకు సంబంధించిన లక్షణాలను చూపిస్తుంది. 14 మంది పిల్లల్లో 6 మందికి సెరిబ్రల్ పరిమాణం పెరిగిందని తేలింది. సెరిబ్రల్ మలేరియా పిల్లలలో కదలికలు, మాట్లాడడంలో ఇబ్బందులు, చెవుడు మరియు అంధత్వ లోపాలను కూడా కలిగిస్తుంది. దాని సంకేతాలు మరియు లక్షణాలు:
- మూర్చ
- రెటినోపతీ
- స్పృహ మార్పు చెందిన స్థితి
- పెరిగిన కపాల(cranial) ఒత్తిడి మరియు వాపు
- తలనొప్పి
- వెన్ను నొప్పి
- వికారం
- వాంతులు
నరాలకు సంభందించిన సమస్యలు తరచుగా తీవ్రమైన మెటబాలిక్ అసిడోసిస్ (శరీర ద్రవాలలో చాలా ఎక్కువ యాసిడ్ చేరడం), తక్కువ హిమోగ్లోబిన్ మరియు తగ్గిపోయిన చక్కెర స్థాయిలతో ముడి పడి ఉంటాయి.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఇది ఆడ అనోఫిలస్ దోమ (Anopheles mosquito) యొక్క కాటు ద్వారా వ్యాపిస్తుంది. ప్లాస్మోడియం యొక్క నాలుగు జాతులు సంక్రమణకు (infection) బాధ్యులు, వీటిలో P. ఫాలసీపారం (P.falciparum) యొక్క సంక్రమణం అత్యంత తీవ్రమైన పరిస్థితిని కలిగిస్తుంది. సంక్రమణం సోకిన రక్త కణాల ద్వారా మెదడు యొక్క చిన్న రక్త నాళికలలో అడ్డంకులు ఏర్పడిన కారణంగా సెరిబ్రల్ మలేరియా (CM) సంభవిస్తుంది, ఫలితంగా మెదడు వాపు మరియు చివరికి మెదడుకి హాని జరుగుతుంది. బయట పదార్ధాల నుండి మెదడుని రక్షించే మెదడు-రక్త అవరోధం (blood-brain barrier, BBB), చీలిపోతుంది మరియు దాని వలన ఫైబ్రినోజెన్ (fibrinogen) లీకేజీని గమనించవచ్చు. ఇది కోమాకు దారి తీస్తుంది. నరాల సమస్యలుకు ఇతర కారణాలు:
- అధిక స్థాయి జ్వరం
- మలేరియా వ్యతిరేక మందులు (Anti-malarial medicines)
- తగ్గిన చక్కెర స్థాయిలు
- తగ్గిన సోడియం స్థాయిలు
- చాలా శాతం తగ్గిన హిమోగ్లోబిన్ స్థాయిలు
ఎలా నిర్ధారిస్తారు మరియు చికిత్స?
మలేరియా వ్యాపించే ప్రాంతాలకు వెళ్లిన ఇటీవలి ప్రయాణ చరిత్రతో పాటు వైద్యులు ఆరోగ్య చరిత్రను తెలుసుకుంటారు మరియు శారీరక పరీక్ష చేస్తారు. ఇస్చేమియా (ischaemia) ఉన్న భాగాలను కనుగొనడానికి ఇమేజింగ్ చేయవచ్చు.
-
కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT) స్కాన్: ఇది సాధారణమైనది కావచ్చు, కానీ కొన్ని మెదడుకి సంభందించిన లక్షణాలను చూడవచ్చు, అవి
- సెరిబ్రల్ ఎడెమా
- అనారోగ్యం కారణంగా సంభవించిన థాలమిక్ హైపోటాటేన్యుయేషన్ (Thalamic hypoattenuation)
- మెదడు తెల్లటి పదార్థం హైపోటాటేన్యుయేషన్ (Cerebellar white matter hypoattenuation)
- అయస్కాంత ప్రతిధ్వని ప్రతిబింబనం (MRI): వ్యాధి పురోగతికి సంబంధించిన ముఖ్య విషయాలను అర్థం చేసుకోవడంలో ఉపయోగపడుతుంది.
- లుంబార్ పంక్చర్: మార్పు చెందిన స్పృహతో ముడి పడి ఉండే ఫిబ్రిల్ సిండ్రోమ్స్ (febrile syndromes) వంటి ఇతర కారణాలను మినహాయించటానికి.
సెరిబ్రల్ మలేరియా అనేది ఒక తీవ్రమైన సమస్య మరియు దానికి తక్షణ వైద్య సహాయం అవసరం. చికిత్స ప్రధానంగా ఈ క్రింది వాటిని కలిగి ఉంటుంది:
- మలేరియా వ్యతిరేక మందులు - ప్రతిఘటనను (resistance) నివారించటానికి ఒకే రకమైన చికిత్స (మోనోథెరపీ) లేదా కలయిక చికిత్స (combination therapy).
- ఎలెక్ట్రోలైట్ అసమతుల్యతను సరి చేసే ఏజెంట్లు.
- లక్షణాలను బట్టి యాంటి ఎపిలెప్టిక్ ఔషధాల ఉపయోగం.
- స్టెరాయిడ్ దిరివేటివ్స్ (derivatives).
- ఇతర నాడీ సంబంధిత సమస్యలను సరిదిద్దడం.
- శ్వాస సంబంధిత సమస్యల విషయంలో ఆక్సిజన్ థెరపీ సహాయపడవచ్చు.
స్వీయ రక్షణ చిట్కాలు ఉన్నాయి:
- లక్షణాల యొక్క ప్రారంభదశ గుర్తింపు సంక్రమణ చక్రాన్ని (infection cycle) విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది.
- దీర్ఘకాలిక జ్వరాన్ని తగ్గించడంలో జ్వరం మందులు సహాయం చేయకపోతే వాటి అనవసర వినియోగాన్ని నివారించాలి.
- పరిసరాలను శుభ్రంగా ఉంచాలి మరియు దోమల అభివృద్ధి చెందే వనరులను తొలగించాలి.
సరైన చికిత్స మరియు సంరక్షణ అనేవి మెదడు నస్టాన్ని మరియు మలేరియా సమస్య యొక్క తీవ్రతను తగ్గించడానికి సహాయపడుతుంది.