సెర్వికల్ డిస్టోనియా - Cervical Dystonia in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

November 29, 2018

March 06, 2020

సెర్వికల్ డిస్టోనియా
సెర్వికల్ డిస్టోనియా

సెర్వికల్ డిస్టోనియా అంటే ఏమిటి?

సెర్వికల్ డిస్టోనియా (CD) అనేది ఓ అరుదైన నాడీ సంబంధిత రుగ్మత. దీన్నే “స్పాస్మోడిక్ టార్టికోలిస్” అని కూడా పిలుస్తారు మరియు ఇది ఒక రకమైన “ఫోకల్ డెస్టోనియా”. ఈ రుగ్మత మెడ కండరాల అసాధారణ మరియు అసంకల్పిత సంకోచంతో గుర్తించబడింది. ఈ సమస్యతో మీ తల ఓ వైపుకు, ముందుకు, లేదా వెనక్కి వాలిపోవడము  జరుగుతుంది. మరియు భుజం కూడా వంకరపోతుంది. ఈ రుగ్మత అన్ని వయస్సులవారికి, పురుషులు మరియు స్త్రీలు అన్న భేదం లేకుండా సంభవించినప్పటికీ, మహిళల్లో 40 నుంచి 50 ఏళ్ల వయస్సున్నవాళ్ళలోనే సాధారణంగా వస్తుంటుంది. సెర్వికల్ డిస్టోనియా మెడనొప్పి రెండు రకాలుగా ఉంటుంది, ప్రాధమిక లేదా ఏకాంత మరియు ద్వితీయ.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

సెర్వికల్ డిస్టోనియా మెడనొప్పి యొక్క అత్యంత సాధారణ సంకేతం మెడ కండరాల అసాధారణమైన అసంకల్పిత సంకోచం. కండరాల ఈడ్పులు (గుంజడం) లేదా అప్పుడప్పుడు హఠాత్తుగా గుంజడమనేది ఉంటాయి. రెండూ కూడా ఉండవచ్చు. ఈ వ్యాధి లక్షణాల కలయిక అసౌకర్యం, పెడసరం, మరియు నొప్పిని కలిగించవచ్చు. ఈ కండరాల సంకోచం ఎక్కువ కాలం బాధించొచ్చు, భుజం కండరాలకు విస్తరించవచ్చు. అయితే  భుజాల కండరాలను దాటి ఈ వ్యాధి లక్షణాలు ఇతరభాగాలకు వ్యాప్తి చెందే అవకాశం లేదు.

నిరంతర మీద కండరాల సంకోచం మెడ మరియు తల యొక్క ఇబ్బందికరమైన భంగిమను కలిగిస్తుంది, అయితే కాలానుగుణ మెడ కండర సంకోచం వేలాడబడిపోయే తల కదలికలకు కారణమవుతుంది. భుజం వైపు గడ్డం మలుపుతిరిగి ఉండేటుగా ఉండేట్లు తల యొక్క భ్రమణమనేది సాధారణంగా గమనించిన అత్యంత ఇబ్బందికరమైన భంగిమ.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

ఎక్కువగా, ఏకాంత సెర్వికల్ డిస్టోనియా మెడనొప్పి యొక్క అంతర్లీన కారణం తెలియదు, మరియు కేవలం నరాల కారణాలు మాత్రమే ఈ రుగ్మత సంభవించడానికి కారణమనిపిస్తుంది. ప్రాథమిక సెర్వికల్ డిస్టోనియాకు గల కారణాలు:

  • సెర్వికల్ డిస్టోనియా యొక్క కుటుంబ చరిత్ర
  • బహుళ జన్యు ఉత్పరివర్తనలు / జన్యుపరమైన కారణాలు
  • పర్యావరణ కారకాలు

ద్వితీయ సెర్వికల్ డిస్టోనియా మెడనొప్పి యొక్క కారణాలు:

  • యాంటిసైకోటిక్ ఔషధాల ఉపయోగం
  • డోపామైన్ గ్రాహకాలను నిరోధించే వికారం చికిత్సకు మందుల వాడకం
  • శరీరజన్య విషము
  • ఇతర నరాలకు సంబంధించిన వ్యాధులు (neurodegenerative diseases) ఉండటం

ఈ రుగ్మతను ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

ఇమేజింగ్ పద్ధతులు వంటి అనేక ప్రయోగశాల పరీక్షలు సెర్వికల్ డిస్టోనియా మెడనొప్పి తో ఉన్నవారిలో సాధారణమైనవి; కాబట్టి, రోగ నిర్ధారణకు క్లినికల్ పరీక్ష జరుగుతుంది. సెర్వికల్ డిస్టోనియా మెడనొప్పి యొక్క రోగ నిర్ధారణలో క్రింది చర్యలు ఉపయోగపడతాయి:

  • క్లినికల్ పరీక్ష మరియు సెర్వికల్ డిస్టోనియా మెడనొప్పి యొక్క జ్ఞానం
  • వ్యక్తిగత వివరణాత్మక వైద్య చరిత్ర
  • వెన్నెముక సంపీడనం అనుమానం ఉంటే అయస్కాంత ప్రతిధ్వని ఇమేజింగ్ (Magnetic resonance imaging) సహాయపడుతుంది
  • నాడీ-సంబంధమైన మంట సంకేతాలు ఉంటే ఎలెక్ట్రోమాయోగ్రఫీ అనబడే విద్యుదయస్కాంత చికిత్ససహాయపడుతుంది

సెర్వికల్ డిస్టోనియా మెడనొప్పి యొక్క చికిత్స పద్ధతి యొక్క ప్రభావం వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు, మరియు అనేక పద్ధతులు వ్యాధి లక్షణాలకు ఉపశమనం కలిగించేవిగా ఉంటాయి. సెర్వికల్ డిస్టోనియా మెడనొప్పికి అందుబాటులో ఉన్న చికిత్స ఎంపికలు:

  • బొట్యులియం టాక్సిన్ సూది మందులు
  • ఓరల్ ఔషధాలు
  • శాస్త్రచికిత్స
  • భౌతిక చికిత్స

సెర్వికల్ డిస్టోనియా మెడనొప్పి విషయంలో ఒత్తిడికి తావు లేనప్పటికీ, ఒత్తిడి అనేది వ్యాధి లక్షణాలను మరింత అధ్వాన్నపరుస్తుంది.సెర్వికల డిస్టోనియా మెడనొప్పి క్రియాత్మకం కావచ్చు మరియు ఒత్తిడి, ఉత్సాహం లేదా కొన్ని భంగిమల కారణంగా వ్యాధి లక్షణాలు మరింత తీవ్రతరం అవుతాయి.

ఒత్తిడిని తగ్గించడం మరియు మీ భంగిమలను సరిగ్గా నిర్వహించడంవంటి చర్యల ద్వారా మీరు వ్యాధి లక్షణాలను నిర్వహించుకోవచ్చు.తల మరియు మెడ బంధము (brace) వాడడం ద్వారా నొప్పిని మరియు అసౌకర్యాన్ని తగ్గించుకోవచ్చు.



వనరులు

  1. Dystonia Medical Research Foundation. Dystonia News. Medical Research Foundation; [Internet]
  2. National Organization for Rare Disorders. Cervical Dystonia. Danbury CT; [Internet]
  3. Brain Foundation. Cervical Dystonia. Australia. [Internet]
  4. American Academy of Family Physicians. Cervical Dystonia. UK; [Internet]
  5. National Health Service [Internet]. UK; Dystonia

సెర్వికల్ డిస్టోనియా వైద్యులు

Dr. Manoj Kumar S Dr. Manoj Kumar S Orthopedics
8 Years of Experience
Dr. Ankur Saurav Dr. Ankur Saurav Orthopedics
20 Years of Experience
Dr. Pritish Singh Dr. Pritish Singh Orthopedics
12 Years of Experience
Dr. Vikas Patel Dr. Vikas Patel Orthopedics
6 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

సెర్వికల్ డిస్టోనియా కొరకు మందులు

Medicines listed below are available for సెర్వికల్ డిస్టోనియా. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.