గర్భాశయవాపు (సెర్విసైటీస్) అంటే ఏమిటి?
స్త్రీలలో, గర్భాసంచి మొదలు నుంచి యోనిలోకి తెరుచుకునే మార్గాన్ని గర్భాశయం లేదా గర్భాశయమార్గం అంటారు. గర్భాశయము వాచినప్పుడు, దానిని గర్భాశయవాపు లేదా సెర్విసైటీస్ అని అంటారు. దీనికి అనేక కారణాలున్నాయి, మరియు లక్షణాలు ఒక స్త్రీ నుండి మరొక స్త్రీకీ వేరుగా ఉంటాయి.
గర్భాశయవాపు అంటువ్యాధుల వలన లేదా అంటువ్యాధుల వలన కాకుండా కూడా సంభవించవచ్చు మరియు దాని చికిత్స అనేది కారణం మీద ఆధారపడి ఉంటుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
గర్భాశయవాపు యొక్క సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు:
- ఒక స్త్రీ యొక్క మూత్రనాళము కూడా ప్రభావితమైతే మూత్రవిసర్జన సమయంలో నొప్పి లేదా మంటను అనుభవిస్తుంది.
- ముఖ్యంగా లైంగిక సంభోగం తర్వాత లేదా ఋతు చక్రాల మధ్య సమయంలో, యోని దురద లేదా యోని నుండి రక్తస్రావం ఉండవచ్చు, (మరింత సమాచారం: సురక్షిత లైంగిక పద్ధతులు)
- కొన్నిసార్లు, జ్వరంతో కూడిన కడుపు నొప్పి ఉంటుంది.
- కొందరు స్త్రీలలో గర్భాశయవాపు ఎటువంటి లక్షణాలను చుపించకపోవచ్చు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
- సాధారణంగా, గర్భాశయం లైంగిక సంక్రమణల (sexually transmitted infections) వలన వాపుకు గురవుతుంది. ఈ లైంగిక సంక్రమణ వ్యాధులు-
- అంటువ్యాధుల వలన కాకుండా సంభవించిన వాపు రబ్బరు అలెర్జీ (latex allergy) మరియు డచింగ్ (douching , నీళ్లను అధికంగా వెదజల్లి యోనిని శుభ్రపరచడం) వలన కావొచ్చు.
- బాక్టీరియల్ వాజైనోసిస్ (Bacterial vaginosis) అనేది యోనిలో బ్యాక్టీరియా యొక్క సంక్రమణం మరియు ఇది గర్భాశయవాపుకు కారణమవుతుంది.
- క్యాన్సర్ కోసం రేడియోధార్మిక చికిత్సా చేయించుకుంటున్న స్త్రీలలో కొన్నిసార్లు గర్భాశయంలో వాపు అభివృద్ధి చెందుతుంది.
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
ఈ పరిస్థితి యొక్క నిర్ధారణ వీటిని కలిగి ఉంటుంది:
- వైద్యులు గర్భాశయవాపును అనుమానించినట్లయితే కటి పరీక్షను (pelvic exam) నిర్వహిస్తారు. వ్యాధి నిర్ధారణకు రోగి యొక్క లైంగిక చరిత్ర కూడా ముఖ్యమైనది.
- గర్భాశయ ద్రవాల యొక్క సాగు, అంటువ్యాధులను గుర్తించడానికి సూక్ష్మదర్శినిలో (microscope) పరీక్షించబడుతుంది.
- రక్త పరీక్షలు కూడా సంక్రమణను (infection) గుర్తించడంలో సహాయపడతాయి.సంక్రమణ ఉన్నపుడు, రక్త పరీక్షలు సాధారణంగా తెల్ల రక్త కణాల (WBC) సంఖ్య యొక్క పెరుగుదలను చూపిస్తాయి.
గర్భాశయవాపు లేదా సెర్విసైటీస్ యొక్క చికిత్స వీటిని కలిగి ఉంటుంది:
- సంక్రమణం(infection) వలన వాపు ఉంటే , యాంటీబయాటిక్స్ సూచించబడతాయి ..
- శృంగారం నుండి దూరంగా ఉండటం మరియు లైంగిక సంక్రమణ వ్యాధులు గురించి వారి భాగస్వామిని తనిఖీ చేయడం కూడా ముఖ్యమైనది.
- అలెర్జీ కారణంగా గర్భాశయవాపు ఉంటే, ఆ అలెర్జీ ఏజెంట్ను తొలగించటం తప్ప, ఎటువంటి పెద్ద చికిత్స అవసరం లేదు.
- గర్భాశయ వాపును నిరోధించడానికి, యోని ప్రాంతాన్ని శుభ్రపరచడానికి బలమైన రసాయనాలను ఉన్న సబ్బులను ఉపయోగించకూడదు, నీటితోనే యోనిని శుభ్రం చేయాలి, మరియు బహుళ భాగస్వాములతో అసురక్షితమైన శృంగారంలో పాల్గొనరాదు.