క్లమీడియా - Chlamydia in Telugu

Dr. Ajay Mohan (AIIMS)MBBS

November 29, 2018

March 06, 2020

క్లమీడియా
క్లమీడియా

క్లమిడియా అంటే ఏమిటి?

క్లమిడియా అనేది పురుషులు మరియు స్త్రీలనూ  ప్రభావితం చేసే ఒక సాధారణ లైంగిక సంక్రమణ (sexually transmitted infection). క్లమిడియా ట్రోకోమాటిస్ (Chlamydia trachomatis) అనేది ఈ వ్యాధికి కారణమయ్యే బాక్టీరియా.

ఈ బ్యాక్టీరియా వ్యక్తి శరీరంలోకి ఒకసారి ప్రవేశించినట్లయితే ఆ వ్యక్తి  మళ్లీ మళ్లీ ఈ వ్యాధి బారిన పడవచ్చు.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ఈ  వ్యాధి సంక్రమిత వ్యక్తులతో మళ్లీ సంభోగించేవరకు, కొంతమంది క్లమిడియా ఉన్న వ్యక్తులలో ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు,

పురుషులలో కనిపించే  సాధారణ లక్షణాలు:

  • మూత్రవిసర్జన సమయంలో మంట
  • పురుషాంగం నుండి ఉత్సర్గ, దహన సంచలనంతో పాటు

మహిళల్లో లక్షణాలు:

శిశువులో, కళ్ళు మరియు ఊపిరితిత్తుల అంటువ్యాధులలో కనిపించే లక్షణాలు ఉంటాయి.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

  • ఒక వ్యక్తికి  లైంగిక సంబంధం ద్వారా క్లమిడియా సంక్రమించవచ్చు. సంక్రమిత వ్యక్తితో మౌఖిక, పాయువు లేదా యోని శృంగారం అనేది సంక్రమణ ప్రమాదానికి దారితీస్తుంది.
  • ప్రసూతి సమయంలో సంక్రమిత తల్లి ద్వారా బిడ్డకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
  • అసురక్షితమైన లైంగిక చర్యలు లేదా బహుళ భాగస్వాములతో లైంగిక సంబంధం కలిగి ఉండటం అనేవి, క్లమిడియాతో కూడిన వివిధ లైంగిక సంక్రమణలకు దారి తీస్తాయి. (మరింత సమాచారం: సురక్షితమైన శృంగారాన్ని ఎలా పొందాలి)

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

  • ఒక వ్యక్తికీ  లక్షణాలు లేకపోయినా కానీ, క్లమిడియాకు గురైనట్లు అనుమానం ఉన్నట్లయితే, ఆ వ్యక్తి లైంగిక చరిత్ర గురించి వైద్యున్ని తెలియజేయడం ముఖ్యం.
  • స్త్రీ నుండి యోని స్విబ్ ను  తీసి సంక్రమణ గురించి తనిఖీ చేయబడుతుంది.
  • పురుషులలో, మూత్రం(urine) పరీక్షించబడుతోంది.

చికిత్సఈ  క్రింది విధంగా ఉంటుంది:

  • క్లమిడియా ఒక బ్యాక్టీరియా సంక్రమణం (infection) కాబట్టి యాంటిబయోటిక్స్ ప్రామాణిక చికిత్సగా ఉంటాయి.
  • ఇచ్చిన యాంటీబయాటిక్ రకాన్ని బట్టి, కోర్సు సమయం 10-14 రోజుల వరకు ఉండవచ్చు. సంక్రమణం పూర్తిగా తొలగిపోయెందుకు మొత్తం మందుల కోర్సును పూర్తి చేయడం ముఖ్యం.
  • స్త్రీలలో గర్భసంచి మరియు గర్భాశయమునకు సంక్రమణ వ్యాప్తి చెందడం వంటి తీవ్రమైన సమస్య కలిగితే, అది వంధ్యత్వానికి కూడా దారితీస్తుంది.
  • పురుషులలో, సంక్రమణ ప్రోస్టేట్ గ్రంధికి లేదా మూత్రాసాయానికీ వ్యాపిస్తుంది.



వనరులు

  1. Elwell C et al. Chlamydia cell biology and pathogenesis.. Nat Rev Microbiol. 2016 Jun;14(6):385-400. PMID: 27108705
  2. Marc O. Beem et al. Respiratory-Tract Colonization and a Distinctive Pneumonia Syndrome in Infants Infected with Chlamydia trachomatis. The New England Journal of Medicine; February 10, 1977
  3. Catherine M. O’Connell et al. Chlamydia trachomatis Genital Infections. Microb Cell. 2016 Sep 5; 3(9): 390–403. PMID: 28357377
  4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Chlamydia Infections
  5. Kalpana Betha et al. Prevalence of Chlamydia trachomatis among Childbearing Age Women in India: A Systematic Review. Infect Dis Obstet Gynecol. 2016; 2016: 8561645. PMID: 27672303