చుండ్రు అంటే ఏమిటి?
చుండ్రు అనేది నెత్తి (scalp) పై తెలుపు లేదా బూడిద రంగులో పొడిబారిన చర్మం పెచ్చులుగా మారే ఒక చర్మ సమస్య. ఇది పురుషుల మరియు స్త్రీలను సమానంగా ప్రభావితం చేసే ఒక చర్మ పరిస్థితి. ఇది వ్యక్తుల యొక్క సామాజిక జీవితాన్ని ప్రభావితం చేసే అసాధారణ పరిస్థితి. మహిళల్లో కంటే పురుషుల్లో చుండ్రు సమస్య ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా, దాదాపు 50% జనాభాకి చుండ్రు సమస్య ఉంటుంది. భారతదేశంలో దీని ప్రాబల్యం 195,785,036గా ఉన్నటు కనుగొనబడింది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
సాధారణ లక్షణాలు:
- నుదురుపై మృతచర్మ కణాల యొక్క తెల్లని, జిడ్డుగా ఉండే చిన్న చిన్న పెచ్చులు.
- పొలుసులుగా ఉన్న లేదా దురదతో కూడిన నెత్తి.
- తేలికపాటి వాపు.
- కనుబొమ్మలు, కనురెప్ప వెంట్రుకలు మరియు చెవులు వెనుక భాగంలో ఉన్న చిన్న చిన్నపెచ్చులు.
చుండ్రు నెత్తి మీద ఏర్పడుతుంది, అధిక చుండ్రు విషయంలో, అది తరచూ భుజాల పై రాలుతుంది. సెబామ్, (తల వెంట్రుకలతో స్రవించే ఒక రకమైన కొవ్వు నూనె) అది తైల గ్రంథులు (sebaceous glands) ద్వారా స్రవిస్తుంది. అధికంగా ఉత్పత్తి కావడం వలన నెత్తి చర్మం జిడ్డుగా మారుతుంది.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
చుండ్రు యొక్క ముఖ్య కారణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
- కందిన లేదా చికాకు పుట్టించే నూనె చర్మం
- షాంపూను తగినంత వాడకపోవడం
- మలస్సేజియా అనే ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్
- పొడి బారిన చర్మం
- జుట్టు ఉత్పత్తి వలన అలెర్జీ
ప్రమాద కారకాలు:
- వయస్సు: యవ్వనం నుండి మధ్య వయస్సు వరకు.
- మగవారు: పురుష హార్మోన్ ప్రభావం వలన.
- అధిక సెబామ్: మలస్సేజియా ఫంగల్ సంక్రమణ చర్మ సహజ నూనెలను వాడుకొని, మరింత చుండ్రును కలిగిస్తుంది.
- కొన్ని వ్యాధులు: పార్కిన్సన్స్ వ్యాధి (ఒక మెదడుకి సంబందించిన వ్యాధి) మరియు హెచ్ఐవి (HIV) సంక్రమణ.
ఎలా నిర్ధారిస్తారు మరియు చికిత్స ఏమిటి?
చుండ్రు పొలుసులుగా మరియు పెచ్చులు పెచ్చులుగా కనిపిస్తుంటే, సోబోరిక్ డెర్మటైటిస్ (seborrheic dermatitis) సోరియాసిస్ (psoriasis), అటోపిక్ డెర్మాటిటిస్ (atopic dermatitis), టినియా క్యాపిటీస్ (tinea capitis) వంటి చర్మపు సమస్యలు కూడా ఆవే లక్షణాలు చూపించడం వలన వాస్తవమైన చుండ్రు పరిస్థితిని విశ్లేషించడం కష్టమవుతుంది. రోగ నిర్ధారణ ప్రధానంగా రోగి యొక్క ఆరోగ్య చరిత్ర మరియు శారీరక పరిక్ష ఆధారంగా ఉంటుంది. కొన్నిసార్లు, చర్మ బయాప్సీను (జీవాణుపరీక్ష) ఆదేశించవచ్చు.
అత్యంత ప్రభావవంతమైన చికిత్స చుండ్రు వ్యతిరేక షాంపూలను మరియునెత్తి చర్మం (scalp) చికిత్సలను ఉపయోగించడం. దురదృష్టవశాత్తు, ఈ చికిత్సలు అందరికీ పనిచేయవు. చుండ్రు వ్యతిరేక షాపులు మరియు నెత్తి చర్మం (scalp) చికిత్సలతో సమస్య మెరుగుపడకపోతే, అంతర్లీన సమస్య పై ఆధారపడి, తగిన బ్యాక్టీరియా వ్యతిరేక లేదా ఫంగస్ వ్యతిరేక చికిత్సను ఇవ్వవచ్చు. చుండ్రు చికిత్సలో భాగంగా లిపోసొమ్లు (liposomes), నోయోసోమ్లు (niosomes) మరియు సాలిడ్ లిపిడ్ నానోపార్టికల్స్ (solid lipid nanoparticles) వంటి నూతనమైన మందుల విధానాలు ఉపయోగించబడుతున్నాయి.
స్వీయ సంరక్షణ:
- నెత్తి చర్మం యొక్క సంరక్షణ తీసుకోవాలి.
- మూలికల నూనెలను తలకు పట్టించడం మరియు చుండ్రు పురోగతిని నివారించడానికి తరచూ తలస్నానం చెయ్యడం వంటి జుట్టు సంరక్షణ పద్ధతులను పాటించాలి.
- అధికంగా షాంపూలు ఉపయోగించి తలస్నానం చేయడం వలన నెత్తి చర్మం యొక్క ఆరోగ్యాన్ని కాపాడే అవసరమైన సహజ నూనెలను అది తొలగిస్తుంది కాబట్టి దానిని నివారించాలి.
- జుట్టు దువ్వెనతో గట్టిగా దువ్వరాదు.
- చుండ్రు సమస్య పరిష్కరింపబడే వరకు జుట్టు స్టైలింగ్ చికిత్సలను మానుకోవాలి.
చుండ్రును సమర్థవంతంగా నిర్వహించడం కోసం, తగిన జుట్టు సంరక్షణ విధానాన్ని అనుసరించాలి అయినా చుండ్రు తగ్గకపోతే, ఈ సమస్యను అధిగమించడానికి ఒక ట్రైకోలజిస్ట్ (జుట్టు నిపుణులు) సహాయం తీసుకోవాలి.