కళ్ళు పొడిబారే రుగ్మత (డ్రై ఐ సిండ్రోమ్) అంటే ఏమిటి?
కళ్ళు పొడిబారే లక్షణం లేదా డ్రై ఐ సిండ్రోమ్ అనేది మనకు సంభవించే సాధారణ పరిస్థితి. కళ్ళు పొడిబారడం ఎపుడు జరుగుతుందంటే మన కళ్ళలో పొడిదనం రూపంలో లేదా దురద పట్టడంద్వారా అసౌకర్యం కలిగినపుడు. కళ్ళలో తగినంతగా కన్నీళ్లు ఉత్పత్తి కాకపోవడంవల్ల లేదా కళ్ళలో ఉన్నతేమ త్వరగా ఆవిరైన కారణంగా ఇలా కళ్ళుపొడిబారిపోయే సమస్య మనకు ఎదురవుతుంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
‘కళ్ళు పొడిబారే రుగ్మత’ యొక్క వ్యాధి లక్షణాలు తీవ్రతలో (ఒకరినుండి మరొకరికి) తేడా ఉండొచ్చు. తేలికపాటి నుండి బాధాకర తీవ్రస్థాయి వరకూ లక్షణాలుంటాయి. కొన్ని లక్షణాలు క్రింద ఇవ్వబడ్డాయి:
- పొడిబారడం
- నొప్పి లేదా సలుపు పట్టడం
- దురద
- కళ్ళలో మంట అనుభూతి
- ఎర్రగా మారుతుంది
- తాత్కాలికంగా అస్పష్ట దృష్టి, రెప్పలు మిటకరించడం చేసింతర్వాత దృష్టి సరిపోతుంది
- నొప్పి
- నీళ్ళుకారడం
- కళ్ళ లోపల ఒత్తిడి అనుభూతి
కళ్ళు పొడిబారే లక్షణంతో ఉండే వ్యక్తి పొడి వాతావరణంలో లేదా కలుషితం ఎక్కువగుండే ప్రాంతంలో ఉన్నట్లయితే ఈ లక్షణాలు మరింత అధ్వాన్నంగా మారి బాధిస్తాయి. దీనికి తోడు దురద కూడా తోడై వ్యాధి పరిస్థితిని మరింత తీవ్రతరం చేయవచ్చు.
కళ్ళు పొడిబారడానికి ప్రధాన కారణాలు ఏమిటి?
కళ్ళు పొడిబారడమనే సమస్యకు ప్రాథమిక కారణం కళ్లలో తగ్గిన కన్నీటి ఉత్పత్తి, ఇది కళ్ళలో తేమలేమికి దారితీస్తుంది. కళ్ళు పొడిబారడానికి ఇతర సాధారణ కారణాలు
- కాంటాక్ట్ లెన్స్ వాడకం
- వేడి వాతావరణం
- అధిక గాలులతో కూడిన వాతావరణం
- కనురెప్పలలో వాపు
- యాంటిహిస్టమైన్స్, యాంటిడిప్రెసెంట్స్, గర్భ నిరోధక మాత్రలు మరియు మూత్రకారకాలు (diuretics) వంటి మందులు
- రుతువిరతి మరియు గర్భధారణ వంటి పరిస్థితులలో హార్మోన్ల మార్పులు
కళ్ళు పొడిబారడమనే వ్యాధి లక్షణం యొక్క ప్రమాదం వయసుతోబాటు పెరుగుతుంది, ఈ సమస్య పురుషుల కంటే మహిళల్లోనే మరింత ఎక్కువగా ఉంటుంది.
దీన్ని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
వైద్యుడిచే శారీరక పరీక్షలు కళ్ళు పొడిబారడం అనే సమస్యను గుర్తించడంలో సహాయపడతాయి. సాధారణంగా దీనికి మరెలాంటి పరీక్షలు అవసరం లేదు.
సూర్యకాంతిలో లేదా ఎండలో ఉన్నప్పుడు కళ్ళను కాపాడుకోవడానికి డడానికి చలువకళ్ళద్దాలను (సన్ గ్లాసెస్) ధరించడం, , దుమ్ము మరియు పొగతో కూడిన వాతావరణాల్లో సంచరించకుండా ఉండడం ద్వారా కళ్ళు పొడిబారడ మనే రుగ్మతను నిరోధించవచ్చు. కళ్ళు పొడిబారే సమస్యకు చికిత్స ఆ వ్యాధి లక్షణాలను బట్టి కూడా మారవచ్చు. ఈ కళ్ళసమస్యకు వెంటనే ఉపశమనం కల్గించేందుకు డాక్టర్ కిందివాటిని సూచించవచ్చు:
- కంటి చుక్కల మందు
- కళ్ళకు తేమను కల్పించి మెత్తదనం కల్గించడానికి లేపనాలు (ointments)
- కళ్ళ మంట, వాపును తగ్గించడానికి మందులు
డాక్టర్ ఆహార మార్పులను కూడా సిఫారసు చేయవచ్చు. కళ్ళను (తేమతో కూడుకుని) జారుడుగుణంతో ఉంచడానికి మరిన్ని ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను కూడా సేవించమని డాక్టర్ సలహా ఇవ్వవచ్చు.