కంటి నొప్పి అంటే ఏమిటి?
కంటి నొప్పిని, కూడా ఆప్తల్మాల్జియా (ophthalmalgia) అని కూడా పిలుస్తారు అది కంటిలో అసౌకర్యం. ఈ అసౌకర్యం లేదా నొప్పి ఒక్యూలర్ (ocular, కంటి ఉపరితలంపై) లేదా ఆర్బిటాల్ (orbital, కంటి లోపల) గా ఉంటుంది. నొప్పి, గాయం లేదా అలెర్జీ ప్రతిచర్య కారణంగా తీవ్రంగా ఉంటుంది లేదా కంటి సంక్రమణలు, తీవ్ర రుగ్మతల కారణంగా దీర్ఘకాలికంగా ఉండవచ్చు. దృష్టి (చూపు) కోల్పోయే ప్రమాదం ఉంది కనుక, కంటి నొపుల గురించి అశ్రద్ధ చెయ్యకుండా తక్షణమే అర్హత పొందిన వైద్యుణ్ణి సంప్రదించాలి.
దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
కంటి నొప్పే ఒక లక్షణం మరియు తరచుగా ఇతర సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు వీటిని కలిగి ఉంటాయి:
- చెదిరిన చూపు (దృష్టి)
- చంటి పిల్లలు తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నపుడు ఏడవడం
- జ్వరం
- కళ్ళు ఉబ్బడం
- చూపులో స్పష్టత తగ్గుదల
- వాంతులు
- దగ్గు మరియు ముక్కు కారడం
- చీము స్రవించడం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
సాధారణ సందర్భాల్లో, కంటి నొప్పి ఇన్ఫెక్షన్/సంక్రమణ లేదా ఒక గాయం కారణంగా సంభవిస్తుంది. కంటి నొప్పికి సంబంధించిన ఇతర సాధారణ కారణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:
- అలర్జీలు
- కన్నీటి వాహికలో (tear duct) నిరోధం
- తలనొప్పి
- నల్ల కనుగుడ్డు (ఐరిస్) వాపు
- కంటిలోని తెల్లటి భాగం యొక్క వాపు
- కంటి కురుపు
- కండ్లకలక
- గ్లాకోమా - కంటిలో ఒత్తిడి పెరగడం
- కార్నియాలో వాపు
ఎలా నిర్ధారిస్తారు మరియు చికిత్స ఏమిటి?
పైన పేర్కొన్న లక్షణాలలో కొన్నింటిని వ్యక్తి అనుభవించినట్లయితే, అతడు తప్పనిసరిగా వైద్యుణ్ణి సంప్రదించాలి.
- సమర్థవంతమైన రోగ నిర్ధారణ కోసం, కంటి నొప్పి యొక్క కారణాన్ని అర్థం చేసుకోవడానికి వైద్యులు కళ్ళను భౌతికంగా పరిశీలిస్తారు.
- వైద్యులు స్లిట్ లాంప్ కంటి పరీక్షను కూడా జరపవచ్చు, ఇది అధిక మాగ్నిఫికేషన్ (magnification) తో కంటి లోపలి భాగాలను పరిశీలించాడనికి ఉపయోగపడుతుంది.
సంక్రమణ లేదా నొప్పి తీవ్రతను బట్టి, కంటి నొప్పిని తగ్గించటానికి వైద్యులు వివిధ జాగ్రత్తలను (చర్యలను) సూచించవచ్చు. వాటిలో కొన్ని ఈ విధంగా ఉంటాయి
- స్థిరమైన బలహీనపరిచే నొప్పిని అధిగమించడానికి నొప్పి నివారణల యొక్క వాడకం
- సిలియరీ (ciliary) కండరాలలో బిగుతును (spasms) నివారించడానికి కంటి చుక్కల ఉపయోగం. ఇది ఎరుపుదనం మరియు నొప్పి తగ్గించడానికి సహాయం చేస్తుంది
- ఇన్ఫెక్షన్ కు చికిత్స చేయటానికి యాంటీమైక్రోబియల్ కంటి చుక్కలు (eye drops)
- కంటి వాపును తగ్గించడానికి స్టెరాయిడ్ కంటి చుక్కలు (eye drops)